న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళ కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్‌ను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని నగరంలో మహిళల భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆమెను మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో 15 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇది జరిగిన మరుసటి రోజు ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇందులో.. దేశ రాజధానిలో మహిళ భద్రతను పరిశీలించేందుకు తన బృందంతోకలిసి రోడ్డు మీదకు వచ్చారు. గురువారం తెల్లవారు జామున గంటల సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో నిల్చొని ఉండగా ఆమె వద్దకు ఓ బాలెనోకారు వచ్చి ఆగింది. కార్లో వచ్చి కూర్చొమని కా వ్యక్తి స్వాతిని అడిగాడు.. దీనికి ఆమె స్పందిస్తూ.. సారీ మీ మాటలు వినిపించడం లేదు.. మీరు నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తారని అడిగింది. వెంటనే మలివాల్ కాస్తా దూరంగా వెళ్లడంతో ఆ వ్యక్తి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాసేపటికి యూటర్న్ తీసుకొని ఆమె వద్దకు వచ్చాడు. మళ్లీ తనను కార్లో ఎక్కమని ఒత్తిడి చేయడంతో ఆగ్రహం చెందిన మాలివాల్.. నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావ్.. నువ్వు ఇక్కడికి రావడం రెండో సారి.ఇలాంటివి వద్దని పదేపదే చెప్తున్నా’ అని అరుస్తూ కారు డ్రైవర్ వద్దకు వెళ్లారు. కారు డ్రైవర్‌ను కిటికీ ద్వారా బయటకు లాకేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె చేయి లోపల ఉండగానే కారు డ్రైవర్ విండో మూసేశాడు. దీంతో స్వాతి చేయి కారులోనే ఉండగానే నిందితుడు అలాగే 15 మీటర్లు లాక్కెళ్లారు.
కాగా స్వాతి మాలివాల్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని 47 ఏళ్ల హరీష్ చంద్రగా గుర్తించిన పోలీసులు.. ఫిర్యాదు అందిన 22 నిమిషాల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. బాలెనో కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. అతడిని న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది.
దీనిపై స్పందించిన స్వాతి మాలివాల్..తనకు ఎదురైన అనుభవాన్ని భయనక సంఘటనగా అభివర్ణించారు. సమాయానికి తన బృందం అందుబాటులో లేకుంటే మరో అంజలి పరిస్థితి ఎదుర్కొనేదని పేర్కొంది. . దేవుడే తన ప్రాణాలు కాపాడాడని, ఢిల్లీలో మహిళా చైర్ పర్సన్‌కే భదత్ర లేకుండా సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాగా ఈ ఏడాది తొలి రోజు( జనవరి1) అంజలి అనే యువతిని కొంతమంది యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది.
చదవండి: Video: సచిన్ పైలట్‌ను కరోనాతో పోల్చిన సీఎం అశోక్ గహ్లోత్
Viral Video of Swati Maliwal, claiming AAP leader and Chairperson DCW staging attack on herself to defame Delhi Police and LG; Drama stands exposed. pic.twitter.com/WOZEGDpTub
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 20, 2023
Comments
Please login to add a commentAdd a comment