delhi women commission
-
సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ స్వాతి మలివాల్ ఘాటు లేఖ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, స్వాతి మలివాల్ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తాను గత జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం డీసీడబ్ల్యూని పట్టించుకోవడం లేదని, మెల్లమెల్లగా అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు గుప్పించారు.లేఖలో ఢిల్లీ మహిళా కమిషన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ఆమె ఎత్తి చూపారు. తాను 2015 నుంచి నిర్మించిన వ్యవస్థను (సీడబ్ల్యూసీని ఉద్ధేశిస్తూ) ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడింది. కమిషన్ బడ్జెట్‌ను ఏకపక్షంగా కోతలు విధించినట్లు తెలిపింది.‘నా రాజీనామా తర్వాత కమిషన్‌కు జరిగిన అన్యాయం చాలా నిరుత్సాహపరిచింది. 181 మహిళా హెల్ప్‌లైన్‌ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం, కమిషన్‌కు నిధుల నిలిపివేత, కమిషన్‌కు బడ్జెట్లో కోత విధించడం, కమిషన్ సిబ్బందిని తొలగించడం నాయకత్వ పదవులు ఖాళీలు వంటివి కమిషన్ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు.రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా పేరొందిన నగరానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు(కేజ్రీవాల్).. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే వ్యవస్థలను రక్షించడం చాలా కీలకం.. సీఎం, మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని రాజధాని మహిళలు, పిల్లలను ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.” అని పేర్కొన్నారు. -
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. ఈ మేరకు ఎల్జీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. అమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు రావటంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎల్జీ నిర్ణయంపై స్పందించిన ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే.. మొత్తం కమిషన్ మూతపడుతుంది. కమిషన్ ప్యానెల్లో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉన్నారు. అందుతో కేవలం 8 మంది మాత్రమే ప్రభుత్వ సిబ్బంది. మిగిలిన వారంతా మూడే నెలలపాటు పని చేసే.. కాంక్రాక్టు ఉద్యోగులు. ఇలా ఎందుకు చేస్తున్నారు. మహిళా కమిషన్ అస్సలు మూత పడనివ్వను. నన్ను జైలులో పెట్టండి కానీ, మహిళలను హింసించకండి’అని ‘ఎక్స్’ వేదికగా ఉన్నారు.LG साहब ने DCW के सारे कॉंट्रैक्ट स्टाफ को हटाने का एक तुग़लकी फ़रमान जारी किया है। आज महिला आयोग में कुल 90 स्टाफ है जिसमें सिर्फ़ 8 लोग सरकार द्वारा दिये गये हैं, बाक़ी सब 3 - 3 महीने के कॉंट्रैक्ट पे हैं। अगर सब कॉंट्रैक्ट स्टाफ हटा दिया जाएगा, तो महिला आयोग पे ताला लग जाएगा।…— Swati Maliwal (@SwatiJaiHind) May 2, 2024ఢిల్లీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం ప్యానెల్లో 40 ఉద్యోగాలు, కొత్తగా కొల్పించిన 223 ఉద్యోగ పోస్టులకు ఎల్జీ అనుమంతి తీసుకోలేదని జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. స్వాతి మలివాల్ ఆప్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా పనిచేవారు. ప్రస్తుతం ప్యానెల్ చైర్మన్ పదవి ఖాళీ ఉంది. తాజా చర్యలతో మరోసారి ఆప్ ప్రభుత్వానికి, ఎల్జీకి మరోసారి వివాదం ముదరనుందని ప్రచారం జరుగుతోంది. -
Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే
Wrestlers’ protest against Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజధాని ఢిల్లీ వేదికగా మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా బజ్రంగ్ పునియా తదితరులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. కాగా బ్రిజ్ భూషణ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆమె అంకుల్‌నంటూ వీడియో విడుదల చేశాడు. ఆమె మైనర్ కాదంటూ వీడియో అందరూ అనుకుంటున్నట్లు సదరు రెజ్లర్ మైనర్ కాదని, ఆమె వయసు దాదాపు 20 ఏళ్లకు పైనే అంటూ ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మండిపడ్డ స్వాతి మలివాల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈ మేరకు.. ‘‘బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టిన మైనర్‌కు అంకుల్‌నంటూ ఓ వ్యక్తి మీడియా ముందు ఆమె ఐడెంటీని బయటపెట్టాడు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు నేను నోటీస్ జారీ చేస్తున్నాను. ఎందుకంటే.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. కాబట్టి ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి మలివాల్ బుధవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సింగ్ ప్రమేయం కూడా ఉందేమో విచారించి.. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా మహిళా కమిషన్ తరఫున డిమాండ్ చేశారు. రెజ్లర్ల పట్ల పోలీసుల చర్యపై ఆగ్రహం కాగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు సహా కొంతమంది క్రీడాకారులు వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తాము సాధించిన పతకాలు గంగలో నిమజ్జనం చేస్తామంటూ వాళ్లు హరిద్వార్ బయల్దేరగా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆ ప్రయత్నం విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య విచారం వ్యక్తం చేసింది. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ WTC: నెట్స్‌లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో -
మా నాన్న లైంగికంగా వేధించాడు.. స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు..
సాక్షి,న్యూఢిల్లీ: కన్నతండ్రే తనను బాల్యంలో లైంగికంగా వేధించాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల చెప్పడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఇలాంటి విషయాన్నె వెల్లడించడం షాక్‌కు గురిచేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన స్వాతి మలివాల్.. కన్నతండ్రే తనను బాల్యంలో లైంగికంగా వేధించాడని చెప్పారు. అతని భయానికి బెడ్ కింద దాచుకునేదానినని దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించారు. 'నా చిన్నప్పుడు తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను బాగా కొట్టేవాడు. భయంతో వెల్లి మంచం కింద దాచుకునేదాన్ని. జుట్టుపట్టుకుని నా తలను గోడకేసి బాదేవాడు. దీంతో తల పగిలి రక్తం వచ్చేది. ఓ వ్యక్తిపై ఇలాంటి దాడులు జరిగినప్పుడే అవతలి వాళ్ల బాధ బాగా అర్థం అవుతుంది. ఈ ఆగ్రహ జ్వాల మొత్తం వ్యవస్థనే షేక్ చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలకు ఎలా న్యాయం చేయాలి, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలి అని ప్రతి రోజు ఆలోచించే దాన్ని.' అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. తన నాలుగో తరగతి వరకు తండ్రితోనే ఉన్నానని, చాలా సార్లు తనను వేధించాడని చెప్పారు. నటి ఖుష్బూ సుందర్ కూడా ఇటీవలే తన తండ్రి లైంగికంగా వేధించాడని చెప్పడం సంచలనం సృష్టించింది. తన 8 ఏళ్ల వయసులోనే ఇది జరిగిందని, అదే తన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితి అని పేర్కొంది. 15 ఏళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించినట్లు చెప్పింది. అప్పుడే అతను ఇళ్లు వదిలి వెళ్లిపోయాడని వివరించింది. చదవండి: నేను వెళ్లిపోతున్నా ఎప్పటికీ తిరిగిరాను అని మెసేజ్.. లవర్‌తో కలిసి కొండపై నుంచి దూకి.. -
భయపడేది లేదు.. ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా: స్వాతి మలివాల్
న్యూఢిల్లీ: బీజేపీ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెదిరింపులు తనను ఆపలేవని, ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.. అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం స్వాతి మలివాల్‌ను మద్యం మత్తులో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మహిళా భద్రతను పర్యవేక్షిస్తున్న క్రమంలో బుధవారం రాత్రి ఎయిమ్స్ సమీపంలోని రోడ్డు వద్ద మద్యం సేవించిన కారు డ్రైవర్ ఆమెను లైంగికంగా వేధించాడు. కారులో ఎక్కాలని బలవంతం చేశాడు. దీంతో ఆగ్రహించిన స్వాతి మలివాల్.. కారు డ్రైవర్‌ను కిటికీలోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చేయి విండోలోపల ఉండగానే డ్రైవర్ కారు అద్దాలను పైకి ఎక్కించి 15 మీటర్లు మాలివాల్‌ను లాక్కెళ్లాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలో మహిళా చైర్ పర్సన్‌కే భదత్ర లేకుండా సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్వాతి మలివాల్ అన్నారు. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపుతున్న ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్వాతి మలివాల్ ఆరోపించిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి అని పేర్కొంది. ఢిల్లీ పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఆప్‌తో కుమ్మకై వీడియో తీసినట్లుగా ఉందని విమర్శించింది. ఘటన జరిగిన వెంటనే స్వాతి ఎందుకు స్పందించలేదని బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖరానా ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ ఘటన అంతా సృష్టించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్వాతి మలివాల్ ఘాటుగా స్పందించారు. బీజేపీ ఆరోపణలు పచ్చి అబద్దాలుగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘“నా గురించి బూటకపు అబద్ధాలు చెబితే భయపెడతానని అనుకునే వాళ్ళకి ఓ విషయం చెప్పాలి. ఈ చిన్న జీవితంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను. ఇప్పటి వరకు నాపై ఎన్నోసార్లు దాడి జరిగాయి. అవేవి నా ప్రశ్నించే గొంతుకను ఆపలేదు. వాస్తవానికి నాలోని దైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. నేను బతికి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను’ అని స్పష్టం చేశారు. जिनहें लगता है मेरे बारे में झूठी गंदी बातें कर मुझे डरा देंगे उनको बता दूँ। मैंने सर पे कफ़न बांध इस छोटी सी ज़िंदगी में बहुत बड़े काम किए है। मुझपे कई अटैक हुए पर मैं रुकी नही। हर अत्याचार से मेरे अंदर की आग और बढ़ी। मेरी आवाज़ कोई नही दबा सकता। जब तक ज़िंदा हूँ लड़ती रहूँगी! — Swati Maliwal (@SwatiJaiHind) January 20, 2023 -
Delhi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు వేధింపులు.. బయటకొచ్చిన వీడియో..!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలీవాల్‌ను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని నగరంలో మహిళల భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆమెను మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో 15 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇది జరిగిన మరుసటి రోజు ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో.. దేశ రాజధానిలో మహిళ భద్రతను పరిశీలించేందుకు తన బృందంతోకలిసి రోడ్డు మీదకు వచ్చారు. గురువారం తెల్లవారు జామున గంటల సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో నిల్చొని ఉండగా ఆమె వద్దకు ఓ బాలెనోకారు వచ్చి ఆగింది. కార్లో వచ్చి కూర్చొమని కా వ్యక్తి స్వాతిని అడిగాడు.. దీనికి ఆమె స్పందిస్తూ.. సారీ మీ మాటలు వినిపించడం లేదు.. మీరు నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తారని అడిగింది. వెంటనే మలివాల్ కాస్తా దూరంగా వెళ్లడంతో ఆ వ్యక్తి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి యూటర్న్ తీసుకొని ఆమె వద్దకు వచ్చాడు. మళ్లీ తనను కార్లో ఎక్కమని ఒత్తిడి చేయడంతో ఆగ్రహం చెందిన మాలివాల్.. నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావ్.. నువ్వు ఇక్కడికి రావడం రెండో సారి.ఇలాంటివి వద్దని పదేపదే చెప్తున్నా’ అని అరుస్తూ కారు డ్రైవర్ వద్దకు వెళ్లారు. కారు డ్రైవర్‌ను కిటికీ ద్వారా బయటకు లాకేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె చేయి లోపల ఉండగానే కారు డ్రైవర్ విండో మూసేశాడు. దీంతో స్వాతి చేయి కారులోనే ఉండగానే నిందితుడు అలాగే 15 మీటర్లు లాక్కెళ్లారు. కాగా స్వాతి మాలివాల్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని 47 ఏళ్ల హరీష్ చంద్రగా గుర్తించిన పోలీసులు.. ఫిర్యాదు అందిన 22 నిమిషాల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. బాలెనో కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. అతడిని న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది. దీనిపై స్పందించిన స్వాతి మాలివాల్..తనకు ఎదురైన అనుభవాన్ని భయనక సంఘటనగా అభివర్ణించారు. సమాయానికి తన బృందం అందుబాటులో లేకుంటే మరో అంజలి పరిస్థితి ఎదుర్కొనేదని పేర్కొంది. . దేవుడే తన ప్రాణాలు కాపాడాడని, ఢిల్లీలో మహిళా చైర్ పర్సన్‌కే భదత్ర లేకుండా సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాగా ఈ ఏడాది తొలి రోజు( జనవరి1) అంజలి అనే యువతిని కొంతమంది యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. చదవండి: Video: సచిన్ పైలట్‌ను కరోనాతో పోల్చిన సీఎం అశోక్ గహ్లోత్ Viral Video of Swati Maliwal, claiming AAP leader and Chairperson DCW staging attack on herself to defame Delhi Police and LG; Drama stands exposed. pic.twitter.com/WOZEGDpTub — Megh Updates 🚨™ (@MeghUpdates) January 20, 2023 -
దేవుడే నన్ను రక్షించాడు: లైంగిక వేధింపులపై స్వాతి మలివాల్
ఢిల్లీ: ప్రముఖ ఉద్యమకారిణి, మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ భయానక అనుభవం ఎదుర్కొన్నారు. ఓ యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన చంపిన ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతను పర్యవేక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు ఆమె. అయితే.. ఈ ప్రయత్నంలో కారులో తప్పతాగి వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు ప్రతిఘటించడంతో కొద్దిదూరం అతని కారుతో సహా లాక్కెల్లాడు. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడగా.. ఆమె ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నారు. అంజలి సింగ్ ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతపై తన బృందంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు డీసీడబ్ల్యూ చైర్పర్సన్ స్వాతి మలివాల్. ఈ క్రమంలో.. బుధవారం అర్ధరాత్రి మూడు గంటల తర్వాత ఎయిమ్స్ వద్ద కాలిబాటలో ఆమె నిల్చున్నారు. అంతలో ఓ బాలెనో కారులో దూసుకొచ్చిన వ్యక్తి.. ఆమెను చూసి ఆగిపోయాడు. కారులో ఎక్కమంటూ ఆమెను బలవంతం చేయబోయాడు. ఆమె నిరాకరించడంతో అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి.. యూటర్న్ తీసుకుని మళ్లీ వచ్చాడు. మరోసారి కారు ఎక్కమంటూ ఆమెను కోరగా.. ఆమె అతన్ని కిటీకి నుంచి బయటకు లాగే యత్నం చేసింది. అయితే.. కిటీకిని క్లోజ్ చేయడంతో ఆమె చెయ్యి అందులో ఇరుకుపోయింది. అలా.. 15 మీటర్లపాటు కారు దూసుకెళ్లగా, ఆమె కిటికీలోంచి చెయ్యిని విడిపించుకుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న టీం ఆమెకు సాయంగా వచ్చారు. ఆపై సదరు వ్యక్తి మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుడే తనను రక్షించాడని, ఢిల్లీలో ఒక మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే ఇలా జరిగితే.. పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని ఆమె ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని నలభై ఏడేళ్ల హరీశ్‌చంద్రగా గుర్తించి.. కారును సీజ్ చేశారు. कल देर रात मैं दिल्ली में महिला सुरक्षा के हालात Inspect कर रही थी। एक गाड़ी वाले ने नशे की हालत में मुझसे छेड़छाड़ की और जब मैंने उसे पकड़ा तो गाड़ी के शीशे में मेरा हाथ बंद कर मुझे घसीटा। भगवान ने जान बचाई। यदि दिल्ली में महिला आयोग की अध्यक्ष सुरक्षित नहीं, तो हाल सोच लीजिए। — Swati Maliwal (@SwatiJaiHind) January 19, 2023 కొత్త సంవత్సరం రోజున.. స్నేహితురాలితో స్కూటీ మీద వస్తున్న అంజలి సింగ్(20)ను ఢీ కొట్టారు దుండగులు. ఆపై సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా మధ్య పదమూడు కిలోమీటర్లపాటు ఆమె శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘోర ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోగా.. దేశవ్యాప్తంగా ఈ హిట్ అండ్ రన్ కేసు చర్చనీయాంశంగా మారింది. -
అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి?
న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయ తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న అంజలిని మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢొకొట్టి ఈడ్చుకెళ్లారు. అయితే ఈ సమయంలో ఆమె స్నేహితురాలు నిధి అక్కడే ఉన్నారు. అంజలి కారు కింద నలిగిపోవడం చూసి కూడా ఆమె సాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి నుంచి పారిపోయింది. పైగా అంజలిదే తప్పు అని మాట్లాడింది. నిధి తీరుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ మండిపడ్డారు. చనిపోయిన ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కళ్ల ముందే అంజలి కారు కింద పడి నలిగిపోతుంటే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి అని ఫైర్ అయ్యారు. విపత్కర పరిస్థితిలో స్నేహితురాలిని విడిచిపెట్టి వెళ్లిన నీ లాంటి వాళ్లను ఎలా నమ్మాలి అని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు. DCW chief @SwatiJaiHind ‘s byte on Anjali’s friend !! pic.twitter.com/0XA42DTOnG — Vandana Singh (@VandanaSsingh) January 4, 2023 జనవరి 1న అంజలి, నిధి స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. కారు చక్రాల కింద అంజలి ఇరుక్కుంది. తాగిన మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఈ విషయాన్ని గమనించకుండా కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. కంఝవాల ప్రాంతంలో ఉదయం అంజలి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో నిధికి ఎలాంటి గాయాలు కాలేదు. చదవండి: ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి.. -
ఢిల్లీ యువతి ఘటన.. హోటల్ ఓనర్‌పై మహిళా కమిషన్ సీరియస్..
న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చికెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి దాటిన తర్వాత న్యూ ఇయర్ రోజున ఈఘటన జరిగింది. అయితే అంతకుముందు ఏం జరిగిందో ఓ హోటల్ యజమాని వివరించాడు. ఈ ఘటనలో చనిపోయిన యువతి(అంజలి) తన స్నేహితురాలు(నిధి)తో కలిసి హోటల్‌కు వచ్చిందని పేర్కొన్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని, ఒకరితో ఒకరు గొడవపడి హోటల్లో రచ్చ చేశారని చెప్పాడు. ఇది చూసి ఇద్దరినీ బయటకు గెంటేసినట్లు వెల్లడించాడు. హోటల్ ఓనర్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ సీరియస్ అయ్యారు. బాధితురాలిపై నిందలు మోపడం సరికాదన్నారు. అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలను బయటకు ఎలా గెంటేస్తారని ప్రశ్నించారు. ఇద్దరు యువతులు మద్యం మత్తులో ఉన్నారనేందుకు ఆధారాలేంటని? అడిగారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువతులను హోటల్ నుంచి గెంటేయడం కంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందని స్వాతి అన్నారు. అలా చేసి ఉంటే యువతి చనిపోయి ఉండేది కాదన్నారు. హోటల్ నుంచి వాళ్లను బయటకు పంపడం వల్లే ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. सुबह से होटल मालिक के घटिया बयान TV पे दिखाए जा रहे हैं, वो कह रहा है लड़कियों ने शराब पी थी, झगड़ा कर रही थीं और मैंने उन्हें बाहर निकाल दिया। अगर लड़कियाँ नशा करके झगड़ा कर रही तो पुलिस बुलाते, देर रात में उन्हें होटल से क्यूँ निकाला? नशे का क्या सबूत है? STOP VICTIM SHAMING! — Swati Maliwal (@SwatiJaiHind) January 3, 2023 జనవరి 1న ఉదయం 1:30 గంటల సమయంలో ఇద్దరు యువతులు హోటల్ నుంచి బయటకు వచ్చినట్లు సీసీటీవీ రికార్డులో ఉంది. ఆ తర్వాత కాసేపటికే ఆ యువతి స్కూటీని కారు ఢీకొట్టింది. చక్రాల మధ్య ఇరుక్కున్న ఆమెను గుర్తించకుండా మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో యువతి చనిపోయింది. తెల్లవారుజామున ఆమె మృతదేహం నగ్నంగా రోడ్డుపై కన్పించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత.. -
స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్ విద్యార్థినిపై బుధవారం జరిగిన యాసిడ్ దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ చల్లారు. అయితే ఈ ఘటనతో ప్రమాదకరమైన యాసిడ్ అందరికీ ఎంత సులభంగా దొరుకుతుందో మరోసారి బహిర్గతమైంది. యాసిడ్ విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ అది మార్కెట్లో లభిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ విద్యార్థినిపై దాడి చేసిన నిందితులు యాసిడ్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకున్నారు. దీంతో ఇంత సులభంగా యాసిడ్ ఎలా దొరుకుతుందని ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సంస్థలు దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. ఢిల్లీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై వచ్చి దాడి చేసిన సచిన్ అరోరా, హర్షిత్ అగర్వాల్‌తో పాటు వీరికి సాయం చేసిన వీరేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. మహిళలపై యాసిడ్ దాడులు పెరిగిన కారణంగా 2013లో వీటి విక్రయాలపై నిషేధం విధించింది సుప్రీంకోర్టు. లైసెన్స్ ఉన్న షాపు ఓనర్లే యాసిడ్‌ను విక్రయించాలని, వాటిని కోనుగోలు చేసే వారి వివరాలు సేకరించాలని నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ఇప్పటికీ మార్కెట్లో కూరగాయలు కొన్నంత ఈజీగా యాసిడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. చదవండి: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి.. -
దేశ రాజధానిలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడ్ని కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో అబ్బాయిలకు కూడా రక్షణ లేదు అని మండిపడ్డారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. दिल्ली में लड़की तो क्या लड़के भी सुरक्षित नहीं हैं। एक 12 साल के लड़के के साथ 4 लोगों ने बुरी तरह से रेप किया और डंडों से पीटकर अधमरी हालत में छोड़कर चले गए। हमारी टीम ने मामले में FIR दर्ज करवाई। 1 आरोपी गिरफ़्तार, 3 अब भी फ़रार, दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। pic.twitter.com/tXrqK7xkwm — Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022 ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఘటనపై మహిళా ప్యానెల్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. చదవండి: వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు -
SBI: దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు
ఉమెన్ కమిషన్ నోటీసుల దెబ్బకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాండిడేట్స్‌ల విషయంలో.. మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఇండియా సర్క్యులర్ జారీ చేయడం, ఆపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్ 31న రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయమై లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. SBI మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్ సర్క్యులర్ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. ఇక సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్ చైర్మన్ ఉమెన్ కమిషన్ ముందు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. -
పెళ్లయి 3 నెలలు: యాసిడ్ తాగించిన భర్త.. సీఎంకు ఫిర్యాదు
గ్వాలియర్ (మధ్యప్రదేశ్): పెళ్లయి మూడు నెలలు కూడా కాలేదు అదనపు కట్నం వేధింపులు తీవ్రమయ్యాయి. భర్తతో పాటు వదిన కూడా హింసించడం మొదలుపెట్టింది. వారి ఆగడాలు శ్రుతిమించి ఆ నవ వధువుపై క్రూరంగా ప్రవర్తించారు. వారిద్దరూ కలిసి ఆ అబల నోటిలో యాసిడ్ పోశారు. అనంతరం అగ్గి పెట్టారు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కొన ఊపిరి మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె జీర్ణాశయం మొత్తం దెబ్బతింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్వాలియర్‌లోని డబ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో యువతికి (25) ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే అత్తింటి వారు వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా కట్నం తీసుకురావాలని ఆమెపై నిత్యం వేధిస్తున్నారు. భర్త శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. అతడికి తోడుగా అతడి సోదరి కూడా చేరి ఆమెకు నరకం చూపించారు. జూన్ 3వ తేదీన వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఆ యువతిని తీవ్రంగా కొట్టి భర్త, వదిన కలిసి యాసిడ్ తాగించారు. అంతటితో ఊరుకోకుండా అగ్గి పెట్టారు. వాటి దెబ్బకు ఆమె తాళలేక అరుపులు, కేకలు వేసి నరకం అనుభవించింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో నరకయాతన అనుభవిస్తూ జీవిస్తోంది. యాసిడ్ ప్రభావంతో జీర్ణాశయం పూర్తిగా దెబ్బతింది. కడుపు ముందరి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో వైద్యులు అతికష్టంగా ఆమెకు తినిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, సభ్యురాలు ప్రమీలా గుప్తా బాధితురాలిని పరామర్శించారు. జరిగిన విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దారుణంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సహించలేకపోయారు. వెంటనే ఆమె వివరాలు, ఫొటోలను తీసుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు తెలుపుతూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదై నెల దాటినా ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదని గుర్తుచేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి దీనస్థితిని ముఖ్యమంత్రికి లేఖలో వివరించారు. दिल्ली महिला आयोग की अध्यक्षा @SwatiJaiHind और मेंबर @promilagupta24 ने दिल्ली के एलएनजेपी अस्पताल पहुंचकर ग्वालियर की एसिड अटैक सर्वाइवर से मुलाकात की। https://t.co/bv7yg8xopK pic.twitter.com/vGmLWGcV39 — Delhi Commission for Women - DCW (@DCWDelhi) July 20, 2021 -
సోషల్ మీడియాలో టన్నుల కొద్దీ హింస
న్యూ ఢిల్లీ: నేరాలు కొత్తరూపం ఎత్తాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవి మరింత వికృతంగా మారాయి. ఫొటోలు మార్ఫింగ్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి క్రూర నేరానికి పాల్పడటం, నిస్సిగ్గుగా గ్రూపుల్లో అమ్మాయిని ఎలా అత్యాచారం చేయాలని మాట్లాడుకోవడం వీటికి పరాకాష్ట. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాయ్స్ లాకర్ రూమ్' గ్రూపులో జరిగిన నీచ చేష్టలివి. ఒక్క బాయ్స్ లాకర్ రూమ్ గ్రూపు మాత్రమే కాదు, ఇంకా తెలీని, వెలుగు చూడని ఇలాంటి క్రూర చేష్టలు ఎన్నెన్నో. వీటన్నింటికి సోషల్ మీడియా వేదికగా మారడాన్ని సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ గురువారం విచారణ చేపట్టింది. ('బాయ్స్ లాకర్ రూమ్'లో కొత్త ట్విస్ట్) అసభ్య వీడియోలకు, విద్వేషపూరిత చర్యలకు, సమస్మాత్మక కంటెంట్లకు సోషల్ మీడియా ప్రధాన కేంద్రంగా మారిందని అభిప్రాయపడింది. ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయని పేర్కొంది. వీటిని ఎలా నిలువరిస్తాలో తెలియజేస్తూ.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మే 25లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. దీని గురించి మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో హింసను, వేధింపులను ప్రధానంగా చిత్రీకరిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా మహిళలు, పిల్లలే బాధితులుగా ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి ప్రమాదకర అంశాలు టన్నుల కొద్దీ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పోస్టులను నియంత్రించడం కష్టసాధ్యమైన పని. ఎవరైనా హింసను ప్రేరేపించేవిధంగా వీడియోలు పోస్ట్ చేస్తే వారిని తక్షణమే వారిని ఆ సోషల్ మీడియా యాప్ నుంచి నిషేధిస్తామని హెచ్చరించారు. (ఆ కమిటీతో సోషల్ మీడియా గాడిన పడేనా..?) -
అపస్మారక స్థితిలోకి స్వాతి మలివాల్
న్యూఢిల్లీ: రేప్ దోషులకు నేరం చేసిన ఆరు నెలల్లోగా కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఇక్కడి ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు ఆస్పత్రిలో చేర్పించాలని సూచించినప్పటికీ, ఆమె అందుకు నిరాకరించారు. అపస్మారక స్థితిలోకి చేరుకోగానే ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారని, స్పృహలోకి రాగానే డాక్టర్లు సెలైన్లు ఎక్కించడాన్ని స్వాతి నిరాకరించారని కమిషన్ సభ్యుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇక్కడి రాజ్‌ఘాట్‌లోని సమతా స్థల్ వద్ద స్వాతి పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. -
సామూహిక అత్యాచారం.. యువతి ఆత్మహత్య
లక్నో : పద్నాలుగేళ్లకే పెళ్లి.. ఓ బిడ్డ. తర్వాత భర్తతో విడాకులు. ఎక్కడికెళ్లాలో తెలియక పుట్టింటికి చేరింది. కానీ విధి మాత్రం ఆమెని పగబట్టింది. దాదాపు మూడేళ్ల పాటు మృగాళ్లు ఆమెను పీక్కు తిన్నారు. ఇక బతకలేననుకుని.. స్వయంగా తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. యూపీ హపూర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ మీద అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు గత మూడేళ్ల నుంచి అత్యచారానికి పాల్పడుతున్నారు. సదరు మహిళ అప్పటికే భర్త నుంచి విడాకుల పొంది ఒంటరిగా జీవిస్తుంది. అలాంటి సమయంలో ఇలాంటి దారుణాల గురించి బయటకు చెప్తే సమాజం మరింత చులకన చేస్తుందని మృతురాలి భావించింది. దాంతో ఆ దారుణాలను భరిస్తూ వచ్చింది. ఏళ్లు గడుస్తున్నా.. మృగాళ్లు తనను విడిచి పెట్టకపోవడంతో.. ఇక ఇలాంటి జీవితం వద్దనుకుంది. దాంతో తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన పట్ల పోలీసుల వ్యవహరించిన తీరు దారుణంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి మరణించిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు. ఢిల్లీ మహిళా కమిషన్ ఈ విషయం గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు లేఖ రాయడంతోపాటు నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసుల్లో చలనం మొదలైంది. మహిళ చనిపోయిన 14 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇంతవరకూ ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ విషయం గురించి ఓ పోలీసాధికారి మాట్లాడుతూ.. ‘ఈ కేసుకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులను అందరిని ప్రశ్నించాము. ఓ 16 మందిని నిందితులుగా భావిస్తున్నాం. కానీ ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఒక్క ఆధారం కూడా లభించలేదు. దాంతో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేద’ని పేర్కొన్నారు. -
రెండేళ్లు సోదరుడి నిర్బంధంలో...
న్యూఢిల్లీ: రెండేళ్లుగా సోదరిని టెర్రస్‌పై బంధించి, తినడానికి నాలుగు రోజులకో బ్రెడ్ మాత్రమే ఇచ్చిన సోదరుడి ఘాతుకం ఇది. మలమూత్రాల మధ్యే జీవచ్ఛవంలా గడిపిన 52 ఏళ్ల మహిళను ఢిల్లీ మహిళా కమిషన్ మంగళవారం కాపాడింది. సరిగా తిండిపెట్టక పోవడంతో బాధితురాలు శారీకంగా కృషించిపోయి ఎముకల గూడులా మారింది. కనీస వైద్య, పారిశుధ్య వసతులు లేకుండా ఇన్నాళ్లు దుర్భర జీవితం గడిపిన ఆమె మనుషులను గుర్తుపట్టే స్థితిలో లేదు. బాధితురాలి మరో సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు అక్కడికి వెళ్లి ఆమెకు విముక్తి కలిగించారు. ప్రస్తుతం ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఆమెను నిర్బంధించిన సోదరుడిపై కేసు నమోదైంది. -
ఉప ముఖ్యమంత్రికీ నోటీసులిస్తాం: ఏసీబీ
ఢిల్లీ మహిళ కమిషన్‌లో ఇష్టం వచ్చినట్లు అక్రమంగా నియామకాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌పై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఈ విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నామని, దీంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తామని ఏసీబీ చీఫ్ ఎంకే మీనా తెలిపారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కూడా ఈ కేసులో నోటీసులు ఇస్తామని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (డి), ఐపీసీలోని 409, 120బి, సెక్షన్ల కింద స్వాతి మలివాల్‌పై కేసులు నమోదు చేసినట్లు మరో అధికారి వెల్లడించారు. స్వాతిని ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. దాంతోపాటు మరో్ 27 ప్రశ్నలు చేతికిచ్చి, వాటికి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని తెలిపారు. ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ చేసిన ఫిర్యాదుతో ఏసీబీ స్పందించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో మహిళా కమిషన్‌ను నింపేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. తగిన అర్హతలు లేకుండా కమిషన్‌లో చేరిన 85 మంది పేర్లను కూడా ఆమె జత చేశారు. మహిళా కమిషన్‌లో అంతమందిని ఎలా నియమించారంటూ తనను వాళ్లు ప్రశ్నించారని స్వాతి మలివాల్ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన నవీన్ జైహింద్ భార్యే స్వాతి. ఇటీవలి కాలంలో మహిళా భద్రతపై తాము పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నామని, తమ నోరు మూయించడానికే ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.