
న్యూఢిల్లీ: రెండేళ్లుగా సోదరిని టెర్రస్‌పై బంధించి, తినడానికి నాలుగు రోజులకో బ్రెడ్ మాత్రమే ఇచ్చిన సోదరుడి ఘాతుకం ఇది. మలమూత్రాల మధ్యే జీవచ్ఛవంలా గడిపిన 52 ఏళ్ల మహిళను ఢిల్లీ మహిళా కమిషన్ మంగళవారం కాపాడింది. సరిగా తిండిపెట్టక పోవడంతో బాధితురాలు శారీకంగా కృషించిపోయి ఎముకల గూడులా మారింది. కనీస వైద్య, పారిశుధ్య వసతులు లేకుండా ఇన్నాళ్లు దుర్భర జీవితం గడిపిన ఆమె మనుషులను గుర్తుపట్టే స్థితిలో లేదు. బాధితురాలి మరో సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు అక్కడికి వెళ్లి ఆమెకు విముక్తి కలిగించారు. ప్రస్తుతం ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఆమెను నిర్బంధించిన సోదరుడిపై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment