Emancipation
-
43 ఏళ్లు జైలులో మగ్గి ‘నిర్దోషి’గా విడుదల
పాట్నా: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. 10 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లి 53 ఏళ్ల వయసులో నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ సంఘటన బిహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ బాక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు కొట్టి వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఇంతకి ఏం జరిగిందంటే? జిల్లాలోని మురార్ పోలీస్ స్టేషన్ పరిధి చౌగాయి గ్రామంలో ఓ దుకాణదారుడిపై 1979, సెప్టెంబర్‌లో హత్యాయత్నం జరిగింది. పలువురు దుండగులు తనను హత్య చేసేందుకు దాడి చేశారని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అందులో మున్నా సింగ్ అనే 10 ఏళ్ల బాలుడిపైనా ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బాలుడిని సెక్షన్ 148, 307ల కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ పెండింగ్‌లో పడిపోయింది. 2012 నుంచి ఈ కేసును బక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు విచారిస్తోంది. జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ రాజేశ్ సింగ్ ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాలని పలుమార్లు ఫిర్యాదుదారుకు నోటిసులు పంపించారు. అయితే, ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మున్నా సింగ్‌ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది జిల్లా కోర్టు. ప్రస్తుతం మున్నా సింగ్ వయసు 53 ఏళ్లు. తనను నిర్దోషిగా వదిలిపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేసిన సింగ్.. దశాబ్దాల పాటు కేసును పెండింగ్‌లో పెట్టటంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
15 మద్యం, మాదకద్రవ్య విమోచనా కేంద్రాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిని తిరిగి సమాజ జీవనంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ‘మన పాలన, మీ సూచన’ కార్యక్రమం సందర్భంగా డిజిటల్ విధానంలో 15 కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆ విమోచనా కేంద్రాల వివరాలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ► మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో విభిన్న ప్రతిభావంతులు, లింగమార్పిడి, వయోవృద్ధుల విభాగం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ► 15 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి నిర్వహణకు ఏటా రూ. 4.98 కోట్లు వ్యయం అవుతుంది. ► ఈ కేంద్రాల్లో ఇన్‌పేషెంట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అన్ని కేంద్రాల్లో ఓ మానసిక వైద్య చికిత్స నిపుణుడు, ఎంబీబీఎస్ అర్హత కలిగిన వైద్యుడు, ముగ్గురు కౌన్సిలర్లతో సహా 11 మంది సిబ్బంది ఉంటారు. ► డాక్టర్, కౌన్సిలర్లు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందిస్తారు. ► ప్రతి కేంద్రం 15 పడకల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉచితంగా వైద్యం అందిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి, ప్రభుత్వ ఆస్పత్రులలో మరో 10 విమోచనా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. ► ఎన్డీడీటీసీ, ఎయిమ్స్, భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభాలో 10 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వారిలో 13.7% ప్రస్తుతం మద్యం వినియోగిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయటమే ప్రభుత్వ ధ్యేయం ► ఏపీలో మద్యం కారణంగా 47 లక్షల మంది, ఓపియాయిడ్ బాధితులు 3.6 లక్షల మందికి సహాయం అవసరం. ► గంజాయి వాడకం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న సుమారు 1.08 లక్షల మంది, ఇతర మత్తు మందుల బాధితులు 1.4 లక్షల మంది ఏపీలో సహాయం కోసం వేచి ఉన్నారు. -
రెండేళ్లు సోదరుడి నిర్బంధంలో...
న్యూఢిల్లీ: రెండేళ్లుగా సోదరిని టెర్రస్‌పై బంధించి, తినడానికి నాలుగు రోజులకో బ్రెడ్ మాత్రమే ఇచ్చిన సోదరుడి ఘాతుకం ఇది. మలమూత్రాల మధ్యే జీవచ్ఛవంలా గడిపిన 52 ఏళ్ల మహిళను ఢిల్లీ మహిళా కమిషన్ మంగళవారం కాపాడింది. సరిగా తిండిపెట్టక పోవడంతో బాధితురాలు శారీకంగా కృషించిపోయి ఎముకల గూడులా మారింది. కనీస వైద్య, పారిశుధ్య వసతులు లేకుండా ఇన్నాళ్లు దుర్భర జీవితం గడిపిన ఆమె మనుషులను గుర్తుపట్టే స్థితిలో లేదు. బాధితురాలి మరో సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు అక్కడికి వెళ్లి ఆమెకు విముక్తి కలిగించారు. ప్రస్తుతం ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఆమెను నిర్బంధించిన సోదరుడిపై కేసు నమోదైంది. -
40 మంది ఆంధ్రప్రదేశ్ యువతులను రక్షించిన సిఐడి
పూణే: సిఐడి పోలీసులు మహారాష్ట్రలోని పూణేలో వ్యభిచారగృహాలపై దాడి చేసి పలువురు యువతులను రక్షించారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 మంది యువతులు ఉన్నారు. వారికి విముక్తి కల్పించారు. సీఐడీ ఎస్పి రమణ్ కుమార్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. అమ్మాయిలను తరలిస్తున్న 8 మంది నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహాలలో మగ్గుతున్న 40 మంది యువతులను హైదరాబాద్ పంపినట్లు తెలిసింది.