
న్యూఢిల్లీ: రేప్ దోషులకు నేరం చేసిన ఆరు నెలల్లోగా కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఇక్కడి ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు ఆస్పత్రిలో చేర్పించాలని సూచించినప్పటికీ, ఆమె అందుకు నిరాకరించారు. అపస్మారక స్థితిలోకి చేరుకోగానే ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారని, స్పృహలోకి రాగానే డాక్టర్లు సెలైన్లు ఎక్కించడాన్ని స్వాతి నిరాకరించారని కమిషన్ సభ్యుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇక్కడి రాజ్‌ఘాట్‌లోని సమతా స్థల్ వద్ద స్వాతి పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment