న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, స్వాతి మలివాల్ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తాను గత జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం డీసీడబ్ల్యూని పట్టించుకోవడం లేదని, మెల్లమెల్లగా అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు గుప్పించారు.
లేఖలో ఢిల్లీ మహిళా కమిషన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ఆమె ఎత్తి చూపారు. తాను 2015 నుంచి నిర్మించిన వ్యవస్థను (సీడబ్ల్యూసీని ఉద్ధేశిస్తూ) ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడింది. కమిషన్ బడ్జెట్‌ను ఏకపక్షంగా కోతలు విధించినట్లు తెలిపింది.
‘నా రాజీనామా తర్వాత కమిషన్‌కు జరిగిన అన్యాయం చాలా నిరుత్సాహపరిచింది. 181 మహిళా హెల్ప్‌లైన్‌ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం, కమిషన్‌కు నిధుల నిలిపివేత, కమిషన్‌కు బడ్జెట్‌లో కోత విధించడం, కమిషన్ సిబ్బందిని తొలగించడం నాయకత్వ పదవులు ఖాళీలు వంటివి కమిషన్ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు.
రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా పేరొందిన నగరానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు(కేజ్రీవాల్).. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే వ్యవస్థలను రక్షించడం చాలా కీలకం.. సీఎం, మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని రాజధాని మహిళలు, పిల్లలను ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.” అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment