సాక్షి, హైదరాబాద్: యువతి ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలు పంపి వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట్ జిల్లా హుజుర్‌నగర్‌కు చెందిన నవదీప్(18)కు అతడి స్నేహితుడి ద్వారా ఓ యువతి(19) పరిచయమైంది. ఆమె పేరుపై ఇన్‌స్టా ఐడీ తెలుసుకున్న నవదీప్ గుర్తుతెలియని వ్యక్తి పేరుపై ఐడీ క్రియేట్ చేసి సందేశాలు పంపించసాగాడు.
ఈ క్రమంలో యువతి ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలు రూపొందించి పంపి వేధించంతో పాటు రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ మేరకు యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నవదీప్‌ను అదుపులోకి తీసుకొని జుడీషియల్ రిమాండ్‌కుతరలించారు.
చదవండి: కన్న కూతురిపై కన్నేసిన కామాంధుడు.. అసభ్యకర ప్రవర్తన
Comments
Please login to add a commentAdd a comment