ట్యూషన్‌లో పరిచయం, ఇన్‌స్ట్రాలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌.. ఆపై! | HYD: Young Man Arrested For Harassing Woman | Sakshi
Sakshi News home page

ట్యూషన్‌లో పరిచయం, ఇన్‌స్ట్రాలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌.. ఆపై!

Published Sat, Jul 31 2021 8:45 AM | Last Updated on Sat, Jul 31 2021 8:55 AM

HYD: Young Man Arrested For Harassing Woman - Sakshi

నిందితుడు సాయిమాధవ్‌  

సాక్షి,నాగోలు: యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సఫిల్‌గూడకు చెందిన ముముడి సాయిమాధవ్‌(19) విద్యార్థి. బాధితురాలు ట్యూషన్‌లో పరిచయం కావడంతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఆ తర్వాత ఆమె అంగీకిరించింది. కొంత కాలం ఆమెతో మామూలుగా చాట్‌ చేసేవాడు. అతని విచిత్ర ప్రవర్తన కారణంగా కొంత కాలం తర్వాత అతడిని బ్లాక్‌ చేసింది. దీంతో నిందిడుతు ఆమెపై పగ పెంచుకున్నాడు. బాధితురాలి మొబైల్‌ నంబర్‌ను పోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా అప్‌లోడ్‌ చేశాడు. వెంటనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

పెట్టుబడి పెడితే డబుల్‌ రిటర్న్స్‌ అంటూ మోసం 

సాక్షి,నాగోలు: ఆన్‌లైన్‌ పెట్టుబడులు పెడితే ఎక్కవ డబ్బులు వస్తాయని నిమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. నేపాల్, ఖాట్మండుకు చెందిన తారా బహదూర్‌ (33) న్యూఢిల్లీ వచ్చి పాండవ్‌నగర్, లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో నివాసం ఉంటూ ట్రావెల్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. తరువాత తన స్నేహితుల ద్వారా సైబర్‌ మోసాల గురించి తెలుసుకున్నాడు.


నిందితుడు తారా బహదూర్‌, వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌  

ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో ఖాతాలు సృష్టించి ఇన్వెస్టిమెంట్, డబుల్‌ రిటరŠన్స్‌ అంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. యూరోషియాకు చెందిన వ్యక్తిగా ఆన్‌లైన్‌లో నమ్మించేవాడు. తక్కవ పెట్టుబడిపై వారు చెప్పినట్లుగా రూ.వెయ్యి, రూ.500 తిరిగి డబుల్‌ రిటరŠన్స్‌ ఇచ్చి పలువురిని నమ్మించాడు. ఎక్కువ పెట్టుబడి పెట్టినా డబుల్‌ రిటర్న్స్‌ అంటూ నమ్మించి డబ్బులు కాజేశాడు. కొత్త మంది ఏజెంట్ల సాయంతో సిమ్‌కార్డులు తీసుకుని తరుచు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నాడు. ఆధార్, పాన్‌కార్డులు, రెండు సిమ్‌కార్డులు, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌లో ఉన్న రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరినాథ్, సీఐ వెంకటేష్‌ పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement