సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వేధిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిబట్ల ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. కడ్తాల్ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ ఆదిబట్ల సమీపంలోని సాయితేజ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేస్తుండేవాడు. అపార్ట్‌మెంట్‌లో టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకునే వారికి పార్సిల్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆ క్రమంలో కొంతమంది ఫోన్‌నంబర్లు మనోజ్‌కుమార్ వద్ద ఉన్నాయి.
ఈ క్రమంలో టీసీఎస్‌లో పనిచేసే ఓ సాఫ్ట్‌వేర్ యువతిని న్యూడ్ ఫోన్‌కాల్స్ చేస్తూ కొద్దిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని సదరు ఉద్యోగిని గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మనోజ్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment