
డీఎస్పీ లక్ష్మినారాయణకు విన్నవిస్తున్న లక్ష్మిదేవి
రాజంపేట: గల్ఫ్ దేశమైన ఖతార్‌లో తమ కోడలు సుశీల, రామకృష్ణలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఓబులవారిపల్లెకు చెందిన మద్దికర లక్ష్మిదేవి సోమవారం రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణను కలిసి మొరపెట్టుకున్నారు. ఎనిమిది నెలల క్రితం తమ కొడుకు, కోడలిని ఓబులవారిపల్లె మండలం వడ్డెపల్లెకు చెందిన పూజారి చంద్ర అనే వ్యక్తి రూ.40వేలు తీసుకొని ఖతార్‌కు పంపాడన్నారు. ఇందుకు చంద్ర తమ్ముడు సుధాకర్ సహకరించాడన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత తమ కొడుకు, కోడలిని చిత్రహింసలు పెడుతున్నారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమవారిని ఇండియాకు రప్పించాలని కోరారు. దీనిపై డీఎస్పీ సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment