నెల్లూరు(క్రైమ్): వివాహమైన నాటినుంచి అత్తింటివారు తనను అదనపుకట్నం కోసం వేధింపులకు గురిచేస్తోన్నారని ఓ మహిళ మంగళవారం ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని గాయత్రినగర్‌కు చెందిన పి.లక్ష్మీలావణ్యకు మూడునెలల కిందట సూళ్లూరుపేట బాపూజీ కాలనికి చెందిన పి.ప్రభుకిరణ్‌తో వివాహమైంది. వివాహసమయంలో లక్ష్మీలావణ్య కుటుంబసభ్యులు ప్రభుకిరణ్‌కు కట్నం కింద రూ.4.50లక్షలు నగదు, 30సవర్ల బంగారు ఇచ్చారు.
వివాహమైన నాటినుంచే ప్రభుకిరణ్ మరో వివాహానికై.. తన భార్యను విడిపించుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అదనపు కట్నం కోసం ఆయన తన కుటుంబసబ్యులతో కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. అతని వేధింపులు తాళలేక మంగళవారం బాధిత వివాహిత తన పుట్టింటివారితో కలిసి భర్త, అత్త, మామలపై ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సీహెచ్ కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment