లైంగికదాడికి పాల్పడిన ఇస్లావత్
బయ్యారం(వరంగల్) : కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు ఇంట్లో నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలిని లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజుమాదిరిగానే శనివారం రాత్రి మానసిక వికలాంగురాలు(20) తల్లిపక్కనే నిద్రిస్తోంది. ఈ క్రమంలో మండలంలోని జగ్నాతండాకు చెందిన ఇస్లావత్ రవి మద్యం మత్తులో వచ్చి వికలాంగురాలి నోటిని చేతితో మూసివేసి లాక్కెళ్లాడు. కొంత సమయం తర్వాత పక్కన కూతరు కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లి పక్కనే నిద్రిస్తున్న కొడుకును లేపింది. ఇంటి పక్కల వారితో కలిసి వెతుకుతుండగా బయట లైంగికదాడికి పాల్పడిన రవి గమనించి తన మోపెడ్‌ను అక్కడే వదిలి పారిపోయాడు. గాయాలతో ఉన్న బాధితురాలిని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కామంధుడిపై దాడికి యత్నం..
మానసిక వికలాంగురాలిపై లైంగికదాడికి పాల్పడిన ఇస్లావత్ రవిపై బాధితురాలి బంధువులు దాడికి యత్నించారు. బయ్యారంలో ప్రైవేట్ పంచాయతీకి యత్నిస్తున్న సమయంలో కోపోద్రిక్తులైన వారు దాడిచేయడానికి యత్నించగా రవితో పాటు అతనికి అడ్డుగా వచ్చిన క్రిష్ణ తలకు గాయాలయ్యాయి.
నిందితుడిపై నిర్భయ కేసు నమోదు
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బయ్యారం పోలీసులు లైంగికదాడికి పాల్పడిన ఇస్లావత్ రవిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపట్ల కఠినచర్యలు తీసుకుంటామని గార్ల–బయ్యారం సీఐ రమేష్, ఎస్సై మురళీధర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment