handicaped women
-
నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన హేయనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. నిందితులను ఉరి తీయడం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు. బాధితురాలికి ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, యువతి చేస్తానంటే ఉద్యోగం కూడా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు సూచించామని హోంమంత్రి పేర్కొన్నారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించారని తానేటి వనిత తెలిపారు. పెస్టిసైడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించామని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు మానసికంగా బాధపడుతున్న యువతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన దృష్టి మరల్చేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. చదవండి👉: బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్తే టీడీపీ దౌర్జన్యం చేసింది: వాసిరెడ్డి పద్మ -
‘డీజిల్‌కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’
లక్నో: సామాన్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అధికారులు.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో.. ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది జనాలు పోలీసుల ప్రవర్తనకు జడిసి స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడతారు. ఇక ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. తప్పకుండా ఖాకీల చేతులు తడపాల్సిందే. లేదంటే మన కంప్లైంట్ పక్కకు పడేస్తారు. అందరు ఇలానే లేకపోయినా.. చాలా చోట్ల మాత్రం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి యూపీలో చోటు చేసుకుంది. కిడ్నాపయిన తన బిడ్డను విడిపించాల్సిందిగా కోరుతూ.. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళ పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. వికలాంగురాలు అని కూడా చూడకుండా.. ఆమె వద్ద నుంచి 15 వేల రూపాయల వరకు వసూలు చేశారు. కానీ ఫిర్యాదును మాత్రం పట్టించుకోలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమార్తె క్యారెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడారు. పోలీసులు నిర్లక్ష్యాన్ని భరించలేని ఆ తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. (చదవండి: ప్రేమికుల కిడ్నాప్.. సినిమాను తలపించేలా ) వివరాలు.. కాన్పూర్‌కు చెందిన గుడియా అనే వికాలంగురాలి భర్త చనిపోయాడు. మైనర్ కుమార్తెతో కలిసి ఉన్న కొద్ది పాటి భూమిని సాగు చేసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గుడియా మైనర్ కుమార్తెని ఆమె బంధువు ఒకరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. దాంతో గుడియా పోలీస్ స్టేషన్లో దీని గురించి ఫిర్యాదు చేసింది. ఇక ఆమె కుమార్తెని వెతికాలంటే డీజిల్ ఖర్చు భరించాల్సిందిగా పోలీసులు గుడియాకు తెలిపారు. అందుకు అంగీకరించిన ఆ తల్లి బంధువుల దగ్గర అప్పు తెచ్చి మరి డీజిల్ ఖర్చులకు గాను 15 వేల రూపాయలు చెల్లించింది. ఇలా మూడు నాలుగు సార్లు డబ్బులు ఇచ్చిన్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. కుమార్తె గురించి ప్రశ్నిస్తే.. వెతుకుతున్నాం అంటూ సమాధానమిచ్చేవారు. ఆ తర్వత అసలు రెస్పాన్స్ లేదు. (చదవండి: కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్ యువతి) దాంతో గుడియా అధికారులను నిలదీయగా.. వారు ఆమె పట్ల ఏ మాత్రం జాలీ, దయ లేకుండా.. ‘‘ఇక్కడ నుంచి వెళ్లు.. అసలు నీ కుమార్తె ఎలాంటిదో.. ఎవరితో వెళ్లిపోయిందో’’ అంటూ నీచంగా మాట్లాడారు. ఇక తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను అన్నది గుడియా. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. స్టేషన్ ఎస్హెచ్ఓను విధుల నుంచి తొలగించడమేకాక మరో అధికారిని నియమించి గుడియా కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇక గుడియాను పోలీసు వాహనంలో తీసుకెళ్లి ఆమె ఇంటి వద్ద వదిలేశారు. -
పాదాలే చేతులయ్యాయి
చేతులు లేనప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి మహిళగా జిలుమోల్ థామస్ వార్తల్లోకి ఎక్కింది. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి వాసి అయిన జిలుమోల్‌కు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. ఈ శారీరక వైకల్యం ఆమెను మరింత దృఢం చేసింది. కారు నడపడం చిన్ననాటి నుంచీ ఆమెతోపాటు ఎదుగుతున్న కల. ఆ కలే ఆమెను వీధుల్లో రయ్.. మంటూ దూసుకెళ్లేలా చేసింది. రెండు చేతులు లేకపోయినా ఆసియాలో కార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా వార్తల్లో నిలిచింది జిలుమోల్. తను ఉంటున్న కరీమనూర్ వీధుల్లో నడుస్తున్నప్పుడు కారు నడపడాన్ని ఊహించింది జిలుమోల్. ఏడాది వ్యవధిలో ఆ కలను నిజం చేసుకుంటూ వీధుల్లో కారు నడపడం సాధించింది. ‘మనం చేయలేని పనుల గురించి విలపిస్తూ కూర్చుంటే ఎప్పటికీ అవి పూర్తికాని పనుల్లాగే ఉండిపోతాయి. భయాన్ని అధిగమిస్తే విజయాన్ని సాధించవచ్చు’ అంటోంది జిలుమోల్. 2014లో జిలుమోల్ తోడుపుళ ప్రాంతీయ రవాణా అధికారిని సంప్రదించి డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు అనుమతించమని కోరింది. ‘దేశంలో ఎక్కడైనా ఇలా చేతులు లేనివారు లైసెన్స్ పొందిన వ్యక్తి ఉంటే ఆ లైసెన్స్ కాపీ తీసుకురా అప్పుడు ఆలోచిస్తా’ అన్నాడు ఆ అధికారి ఇది సాధ్యమయ్యే పనికాదంటూ. జిలుమోల్ ఇంటర్నెట్లో శోధించింది తనలాంటి వారు లైసెన్స్ పొందినవారు ఎవరైనా ఉన్నారా అని. అప్పుడే తెలిసింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వాసి విక్రమ్ అగ్నిహోత్రి గురించి. రెండు చేతులు లేకపోయినా విక్రమ్ కాళ్లతోనే కారు డ్రైవింగ్ చేస్తున్నాడని. చేతులు లేకపోయినా దేశంలో మొట్టమొదటి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తి విక్రమ్ అగ్నిహోత్రి అని. దీంతో తనకూ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే అవకాశం ఉండటంతో జిలుమోల్లో ఆశలు చిగురించాయి. పాదాలతో డ్రైవింగ్ కూతురుకోసం 2018లో మారుతి సెలెరియో ఆటోమేటిక్ కారును కొనుగోలు చేశాడు జిలుమోల్ తండ్రి థామస్. అదే సంవత్సరం ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చింది. థామస్‌కు ముందు అతని కుటుంబంలో ఎవరికీ కారు నడపడం తెలియదు. కానీ, రోడ్డు మీద కాళ్లతో కారు నడుపుతున్న జిలుమోల్ ధైర్యానికి నమస్కరించాలని సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసిన ప్రతిఒక్కరూ అభినందించారు. ఆమె తన పాదాలతో డ్రైవింగ్ చేస్తున్న అనేక ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇటీవల వైరల్ అయిన వీడియోను ఆనంద్ మహీంద్రా చూసి, తన ట్విట్టర్ ఖాతాలో జిలుమోల్ ధైర్యాన్ని ప్రశంసించారు. గ్రాఫిక్ డిజైనర్ శారీరకంగా వికలాంగురాలినని తాను ఎప్పుడూ అనుకోలేదనీ, చిన్నప్పటినుంచి చదువులో ప్రథమస్థానంలో ఉండేదాన్ననీ, కాలి వేళ్ల సాయంతోనే పెయింటింగ్ చేయడం ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు తన వృత్తిగా గ్రాఫిక్ డిజైనింగ్‌ను ఎంచుకున్నానని జిలుమోల్ చెబుతుంది. a‘నా కూతురు కోసం కారు కొనడానికి మా ఇంట్లోవాళ్లను ఎంతగా ఒప్పించానో ఆ రోజు నాకు బాగా గుర్తుంది’ అని చెబుతాడు ఆమె తండ్రి థామస్. ఆయన రైతు. తల్లి అన్నకుటి గృహిణి. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన స్టేట్ మౌత్ అండ్ ఫుట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలిగానూ విధులను నిర్వర్తిస్తుంది జిలుమోల్. -
మంట కలిసిన మానవత్వం..
బయ్యారం(వరంగల్) : కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు ఇంట్లో నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలిని లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజుమాదిరిగానే శనివారం రాత్రి మానసిక వికలాంగురాలు(20) తల్లిపక్కనే నిద్రిస్తోంది. ఈ క్రమంలో మండలంలోని జగ్నాతండాకు చెందిన ఇస్లావత్ రవి మద్యం మత్తులో వచ్చి వికలాంగురాలి నోటిని చేతితో మూసివేసి లాక్కెళ్లాడు. కొంత సమయం తర్వాత పక్కన కూతరు కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లి పక్కనే నిద్రిస్తున్న కొడుకును లేపింది. ఇంటి పక్కల వారితో కలిసి వెతుకుతుండగా బయట లైంగికదాడికి పాల్పడిన రవి గమనించి తన మోపెడ్‌ను అక్కడే వదిలి పారిపోయాడు. గాయాలతో ఉన్న బాధితురాలిని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామంధుడిపై దాడికి యత్నం.. మానసిక వికలాంగురాలిపై లైంగికదాడికి పాల్పడిన ఇస్లావత్ రవిపై బాధితురాలి బంధువులు దాడికి యత్నించారు. బయ్యారంలో ప్రైవేట్ పంచాయతీకి యత్నిస్తున్న సమయంలో కోపోద్రిక్తులైన వారు దాడిచేయడానికి యత్నించగా రవితో పాటు అతనికి అడ్డుగా వచ్చిన క్రిష్ణ తలకు గాయాలయ్యాయి. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బయ్యారం పోలీసులు లైంగికదాడికి పాల్పడిన ఇస్లావత్ రవిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపట్ల కఠినచర్యలు తీసుకుంటామని గార్ల–బయ్యారం సీఐ రమేష్, ఎస్సై మురళీధర్ హెచ్చరించారు. -
అంతా కట్టుకథ!
విజయనగరం టౌన్ : దివ్యాంగురాలిపై సామూహిక లైంగిక దాడి ఘటన కట్టుకథగా తేలింది. పూసపాటిరేగ మండలానికి చెందిన దివ్యాంగురాలిని నెల్లిమర్ల మండలం సారిపల్లికి వెళ్లే నిర్జన ప్రదేశంలో ఆటోడ్రైవర్ మరొక ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో అదంతా దివ్యాంగురాలు అల్లిన కట్టుకథేనని తేలింది. ఈ మేరకు ఎస్పీ జి.పాలరాజు జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. దివ్యాంగురాలి లైంగిక దాడి కేసుకు సంబంధించి జిల్లాలోని ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, ఒక్కో బృందానికి భౌతిక ఆధారాలు, సాంకేతిక ఆధారాలు సేకరించాలని, కుటుంబ నేపథ్యం, శాస్త్ర, సాంకేతిక ఆధారాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. బాధితురాలి కథనం ప్రకారం ఆమె ఆటో ఎక్కిన ప్రాంతాలను, సంఘటనా స్థలంగా చెప్పబడిన సారిపల్లిలోని నిర్జన ప్రదేశాన్ని సందర్శించారు. ఆమెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయిన తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ను మహిళా, శిశు సంక్షేమ అధికారుల సమక్షంలో నమోదు చేశారు. బాధితురాలు పట్టణంలో ఎక్కువ సమయం గడిపి ఇంటికి ఆలస్యంగా చేరడంతో కుటుంబ సభ్యులు తనను తిడతారని భావించి, పొంతన లేని విషయాలను చెప్పినట్టు నిర్ధారణ జరిగిందని ఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తు చేయడంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, విజిలెన్స్ మోనటరింగ్ సభ్యులు, మీడియా సభ్యులు, దళిత నాయకులు, పోలీస్ శాఖకు సహకరించారన్నారు. కేసు మిస్టరీని చేధించడంలో తీవ్రం గా శ్రమించిన డీఎస్పీలు టి.సౌమ్యలత, టి.త్రినాథరావు, ఎవి.రమణ, రూరల్ సీఐ దాసరి లక్ష్మణరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐలు రామకృష్ణ, ఉపేంద్ర, నారాయణరావు, ఇతర పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. పోలీసుల విచారణలో వెలుగు చూసిన అంశాలు సంఘటనా స్థలానికి ఆటో వెళ్లే అవకాశం లేదు. నెల్లిమర్లకు వెళ్లే అన్ని మార్గాల్లో సీసీ పుటేజీలలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. సంఘటన జరిగిన సమయాల ప్రకారం చూస్తే అవే సమయాల్లో బాధితురాలు పూర్తిగా విజయనగరం పట్టణంలోనే ఉన్నట్టుగా ఆమె ఫోన్ టవర్స్ రావడం. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్కు, వాస్తవ సంఘటనకు పొంతన లేకుండాపోవడం. బాధితురాలు ఫోన్, బ్యాగ్‌ను ఆటోలో విడిచిపెట్టినట్టుగా ముందుగా తెలిపినప్పటికీ, సదరు వస్తువులు ఆమె ఇంట్లోనే పోలీసు విచారణలో లభ్యం కావడంతో బాధితురాలు వాస్తవాలను అంగీకరించక తప్పలేదు. వైద్యులు బాధితురాలికి నిర్వహించిన పరీక్షలలో ఆమె శరీరంపై బాహ్యంగాగానీ, లోపలగానీ ఎటువంటి గాయాలు లేనట్టు ధృవీకరించారు. -
దివ్యాంగురాలిపై దాష్టీకం ఘోరం
వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నరసరావుపేట: ప్రభుత్వ వైద్యశాలకు వెనుకవైపున నివాసం ఉంటున్న దివ్యాంగురాలు నంద్యాల నాగసుబ్బమ్మపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న దౌర్జన్యాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ ప్లోర్‌లీడర్ పాలపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడారు. నాగమ్మ కొంతకాలంగా నివాసం ఉంటూ మున్సిపాల్టీకి పన్నులు చెల్లిస్తుందన్నారు. ఇప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ భర్త రూ.50 వేలు ఇస్తేనే ఉండనిస్తామని, లేనిపక్షంలో ఖాళీ చేయాలని ఆమెపై దౌర్జన్యానికి దిగటం టీడీపీ వైఖరిని తెలియచేస్తుందని తెలిపారు. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు రెండు నియోజకవర్గాల్లో అవినీతికి పాల్పడుతుండటంతో అదే వైఖరిని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులూ అనుసరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి పోకడలను ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండించాలని కోరారు. మున్సిపల్ స్థలంలో దివ్యాంగురాలు ఉన్నదని అందుకే ఖాళీచేస్తున్నామని టీడీపీ నాయకుల ఆలోచనే అయితే పట్టణంలోని అనేక ప్రదేశాల్లో మున్సిపల్ స్థలాలు, రోడ్డు మార్జిన్లలో ఉన్న వారిని ఎందుకు ఖాళీచేయించటంలేదని ప్రశ్నించారు. కేవలం డబ్బులకోసం దివ్యాంగురాలిని ఇబ్బంది పెట్టడం శోచనీయమన్నారు. మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వం వెంటనే కలుగచేసుకొని దివ్యాంగురాలికి తగిన న్యాయం చేయాలని కోరారు. కౌన్సిలర్ మాడిశెట్టి మోహనరావు మాట్లాడుతూ ప్రతిపక్ష కౌన్సిలర్లకు మున్సిపల్ కార్యాలయంలో కేటాయించిన వెయిటింగ్ హాల్లో కార్యాలయ ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వాడటం శోచనీయమన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు కారుమంచి మీరావలి, షేక్ రెహమాన్, షేక్ మున్ని, గోగుల శంకరమ్మ, వార్డు నాయకులు సయ్యద్‌బాజీ, రవివర్మ, గేరా ధర్మారావు పాల్గొన్నారు.