గాయాలు చూపిస్తున్న సరిత, సంజయ్ కుమార్
రాంగోపాల్‌పేట్: ఆయన ఓ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్...పెళ్లై 13 ఏళ్లు అవుతోంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ప్రతి రోజు భార్యను తీవ్రంగా కొడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం సంజయ్ కుమార్ అనే వ్యక్తి గోపాలపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ గాస్మండి ఆదయ్యనగర్‌లో ఉంటున్నాడు. 2003లో అతడికి సరితతో వివాహం జరిగింది.
వీరికి ఒక పాప, ఒక బాబు. గత కొన్నేళ్లుగా సంజయ్ తరచూ భార్యపై చేయి చేసుకుంటున్నాడు. ప్రతి రోజు మధ్యం సేవించి ఇంటికి రావడమే కాకుండా విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారు. అతడికి రాము, శ్రీకాంత్ అనే అతని స్నేహితులు మద్దతు పలుకుతున్నట్లు తెలిపింది. మూడు రోజుల క్రితం కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సరిత మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కౌన్సెలింగ్ ఇచ్చినా...
భార్య ఫిర్యాదు మేరకు సంజయ్ కుమార్‌ను మార్కెట్ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఇన్‌స్పెక్టర్ మట్టయ్య వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తనకు భార్య వద్దని ఏ కేసు పెట్టుకున్నా సరే విడాకులు తీసుంటానని మొండికేశాడు. భార్య సరిత మాత్రం తనను మళ్లీ కొట్టకుండా బాగా చూసుకుంటానంటే సరేనని చెప్పినా అతను మాత్రం కేసు పెట్టుకోమని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment