Khanapuram
-
పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన యువకుడు.. పెళ్లై ఏడాది తిరగకముందే
సాక్షి, వరంగల్: యువకుడు, అతని కుటుంబ సభ్యుల వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బండమీదితండాలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన మనుబోతులగడ్డకు చెందిన భూక్య డోలి, బిచినిల చిన్న కుమార్తె మూడు అనూష (24)ను బండమీదితండాకు చెందిన రమేశ్‌కు ఇచ్చి 2022 ఫిబ్రవరి మాసంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం అనూష మూడు నెలల గర్భిణి. వీరి జీవితం సజావుగా సాగుతున్న క్రమంలో తండాకు చెందిన ఉస్మాన్‌తో పాటు మరికొంతమంది వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామ పెద్దలు, పోలీసులు హెచ్చరించినా వేధింపులు ఆపకపోవడంతో సోమవారం రాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కుమార్తె మృతికి కారణమైన ఉస్మాన్, మస్తాన్, ఇమామ్‌సాబ్, సర్వర్, అనిల్, సైదులుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సంపత్‌రావు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. చదవండి: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ.. -
విషాదం: సంబంధాలు వస్తున్నాయి.. భూమి కొనడానికి ఎవరూ రాక..
ఖానాపురం (వరంగల్ రూరల్): వ్యవసాయ భూమి అమ్ముడు పోక పోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మర్నాగిబోడుతండాలో శనివారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు ఈర్య, భద్రిల చిన్నకుమార్తె సంధ్య (19) నర్సంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో వివాహం కోసమని సంబంధాలు వస్తున్నాయి. తనకున్న మూడు ఎకరాల భూమిని విక్రయించి వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ సదరు భూమికి పట్టాలేకపోవడంతో ఎవరూ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన సంధ్య జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. మృతురాలి తండ్రి ఈర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ కుమారస్వామి తెలిపారు. కుమార్తె మరణంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. చదవండి: (సెల్ఫోన్లో మగవాళ్లతో ఎక్కువ మాట్లాడుతోందని...) ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వాటిని కట్టకున్నా.. నిధులు కొట్టేశారు
సాక్షి, వరంగల్: ఖానాపురం మండలంలోని మంగళవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని కార్యదర్శిని సస్పెండ్ చేశారు. పూర్తి విచారణ, వివరాలు తెలియకముందే అతడికి ఆత్మకూరు మండలంలో పోస్టింగ్ సైతం ఇచ్చేశారు. ఈ క్రమంలో మరోసారి గ్రామంలో నిధుల గోల్‌మాల్‌పై దుమారం రేగింది. మరుగుదొడ్లు నిర్మించుకోకుండానే బిల్లులు కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఫోర్జరీ సంతకాలతో బిల్లులు కాజేసిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మించకున్నా బిల్లులు.. గతంలో మంగళవారిపేట పంచాయతీ కార్యదర్శిగా శ్రీధర్ పని చేశారు. అయితే, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో మే 4న ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు కొట్టేశారనే ఆరోపణలు గత రెండు రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలు చేయకున్నా బిల్లులు ఎలా సాధ్యమయ్యాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుండగా.. తమకేమీ తెలియకుండానే ఇలా జరిగిందంటూ ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 మరుగుదొడ్లు మంజూరు కాగా, ఇందులో అసలు నిర్మించుకోని వారికి బిల్లులు వచ్చాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి మాత్రం సగం బిల్లులు, కొంత మందికి రెండుసార్లు బిల్లులు మంజూరయ్యాయి. పూర్తిగా కట్టుకున్న వారిలో కొంత మందికి మాత్రమే బిల్లులు రావడంతో ఇందులో ఎవరి హస్తం ఉందని, బిల్లులు ఎవరు కాజేసారో తెలియాల్సిందేననంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. రూ.6 లక్షలు డ్రా.. బిల్లుల విషయమై పాలకవర్గ సభ్యులు మాత్రం గతంలో పని చేసిన కార్యదర్శిపైనే ఆరోపణలు చేస్తున్నారు. నిధుల గోల్మాల్ విషయంలో అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్చార్జ్ కార్యదర్శి ఆధ్వర్యంలో బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇందులో పాత కార్యదర్శి తమ సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు రూ.6 లక్షలు కాజేసి నర్సంపేటకు చెందిన నలుగురి ఖాతాల్లో జమచేసినట్లు సర్పంచ్ లావుడ్య రమేష్‌నాయక్, ఉప సర్పంచ్ ఉపేందర్ గుర్తించారు. ఈ మేరకు ఫోర్జరీగా గుర్తించిన చెక్కులను జిరాక్స్ తీయించి ఎంపీడీఓ సుమణవాణికి ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే, సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి సైతం ఫిర్యాదు చేశారు. కాగా, మరుగుదొడ్ల బిల్లులపై విచారణ జరిపి కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. -
పాక్ సరిహద్దుల్లో ఖానాపురం వాసి
ఖానాపురం: మతిస్థిమితం సరిగా లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి ఎక్కడెక్కడో తిరుగుతూ చివరకు భారత్ – పాక్ సరిహద్దుల్లో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ తచ్చాడుతుండగా సైనికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పరమేశ్వర్‌కు ఎనిమిదేళ్ల క్రితం తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయాడు. భార్య మంజుల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని తరచూ కొడుతుండటంతో వారు హైదరాబాద్ వలస వెళ్లారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట ఓ రైలు ఎక్కి వెళ్లిపోయిన పరమేశ్వర్.. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇరవై రోజుల క్రితం రాజస్తాన్‌లోని జింజిర్యా నీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పాకిస్తాన్ సరిహద్దుల్లోని జైసల్మేర్ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ సరిహద్దులు దాటి పాక్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మన సైనికులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అతనికి మతిస్థిమితం లేదని.. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంవాసి అని విచారణలో తేలింది. పరమేశ్వర్ తెలుగులో మాట్లాడుతుండటంతో ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన సైనిక అధికారి సురేశ్ బాబు ఈ విషయాన్ని ఖానాపురం ఎస్సై సాయిబాబుకు ఫోన్ ద్వారా తెలిపారు. పరమేశ్వర్‌కు ఎలాంటి నేరచరిత్ర లేదని, మతిస్థిమితం తప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన సైనికాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పరమేశ్వర్ అన్నయ్య పుల్లయ్య, బంధువులు రాజస్తాన్ వెళ్లి అతడిని ఖానాపురం తీసుకొచ్చారు. -
ఖానా‘పురం’ ఎట్టకేలకు ‘కారు’పరం
నిర్మల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఐదేళ్లపాటు పట్టణాభివృద్ధికి అంకితమవుతామంటూ ప్రమాణం చేశాయి. బీసీ జనరల్‌కు రిజర్వు అయిన నిర్మల్‌లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన గండ్రత్ ఈశ్వర్ చైర్మన్ అయ్యారు. భైంసాలో గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా ఉన్న సబియాబేగం మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కొత్త మున్సిపాలిటీ ఖానాపూర్‌ను ఎట్టకేలకు టీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి అంకం రాజేందర్ చైర్మన్‌గా ప్రమాణం చేశారు. మూడు మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశం, ప్రమాణ స్వీకారోత్సవం ప్రశాంతంగా ముగిశాయి. నాలుగువందలకు పైగా ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్ పట్టణం 12వ మున్సిపల్ చైర్మన్‌గా గండ్రత్ ఈశ్వర్ ఎన్నికయ్యారు. ఇక్కడ 42వార్డులకు గానూ టీఆర్ఎస్ ఏకపక్షంగా 30వార్డులను దక్కించుకుంది. మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో హాజరైన కౌన్సిలర్లు 33వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఈశ్వర్‌ను చైర్మన్‌గానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా ఈశ్వర్ పేరును తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ ప్రతిపాదించగా, 24వ వార్డుకు కౌన్సిలర్ మేడారం అపర్ణ బలపరిచారు. దీంతో ఎన్నిక నిర్వహణాధికారి, జెడ్పీ సీఈఓ సుధీర్ చైర్మన్‌గా గండ్రత్ ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్‌గా ఇప్పటి వరకు నిర్మల్‌లో రెండోసారి ఎన్నికై ఈశ్వర్ రికార్డు నెలకొల్పారు. ఆయన గతంలో 2000–05వరకు చైర్మన్‌గా కొనసాగారు. అప్పట్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నిక అనంతరం వైస్ చైర్మన్‌గా 22వ(వైఎస్ఆర్ కాలనీ) వార్డు కౌన్సిలర్ షేక్ సాజిద్ పేరును 41వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్ధుల్ సయీద్ ప్రతిపాదించారు. 23వ వార్డుకు చెందిన సయ్యద్ జహీర్ బలపర్చారు. దీంతో షేక్ సాజిద్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రత్యేక సమావేశానికి హాజరైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎక్స్ అఫిషి యో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేకాధికారి శృతిఓజా, కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భైంసాలో మళ్లీ వాళ్లే.. రాష్ట్రంలో మహారాష్ట్రతో సరిహద్దు పట్టణంగా ఉన్న భైంసా మున్సిపల్లో మరోసారి ఎంఐఎం కొలువుదీరింది. ఇక్కడ బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా కొనసాగిన సబియాబేగంను ఈసారి కూడా చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. పట్టణంలోని రెండోవార్డు నుంచి ఆమె గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా 20వ వార్డు నుంచి ఏకగ్రీవమైన మహ్మద్ జాబిర్ అహ్మద్ కూడా మరోసారి అదే స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌గా సబి యాబేగం పేరును ఒకటోవార్డు కౌన్సిలర్ ఫైజు ల్లాఖాన్ ప్రతిపాదించగా, 16వ వార్డు కౌన్సిలర్ ముదస్సిమ్ బలపర్చారు. వైస్ చైర్మన్‌గా జాబిర్ అహ్మద్‌ను 15వ వార్డు కౌన్సిలర్ ఖాదర్ ప్రతిపాదించగా, 13వ వార్డు కౌన్సిలర్ రాహుల్ దగ్డే బలపర్చారు. ఈమేరకు వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు. అంతకుముందు ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు ముందే బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఖానా‘పురం’ కారుకే... కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డ ఖానాపూర్‌లో తొలిసారే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఈ పురం ‘కారు’ పార్టీ పరమైంది. మొత్తం 12వార్డులకు గానూ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు చెరో ఐదు స్థానాలు రాగా, ఇండిపెండెంట్ ఒకటి, బీజేపీ ఒకటి గెలుపొందారు. టీఆర్ఎస్కు స్వతంత్ర అభ్యర్థిగా 10వ వార్డు నుంచి గెలుపొందిన తొంటి శ్రీనివాస్ మద్దతు పలికారు. అంతకుముందు ఆయన గులాబీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన రెండో వార్డు కౌన్సిలర్ కారింగుల సంకీర్తన సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే రేఖానాయక్ ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా మద్దతు పలికారు. దీంతో టీఆర్ఎస్ బలం ఏడు స్థానాలకు చేరగా, కాంగ్రెస్ నుంచి ఒకరు గైర్హాజరు కావడంతో వారి బలం నాలుగు స్థానాలకు పడిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నాయిని స్రవంతి ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయారు. దీంతో ప్రత్యేకాధికారి ప్రసూనాంబ, కమిషనర్ మల్లేశ్‌లు మెజార్టీ ఉన్న టీఆర్ఎస్కు చైర్మన్ ఎన్నికకు అవకాశం ఇచ్చారు. ఆ పార్టీ నుంచి చైర్మన్‌గా 9వ వార్డు కౌన్సిలర్ అంకం రాజేందర్ పేరును 10వ వార్డు కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్ ప్రతిపాదించగా, 3వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి బలపర్చారు. వైస్ చైర్మన్‌గా 8వ వార్డు కౌన్సిలర్ అబ్ధుల్ ఖలీల్ పేరును ఒకటో వార్డు కౌన్సిలర్ కావలి సంతోష్ ప్రతిపాదించగా, ఐదో వార్డు కౌన్సిలర్ పరిమి లత బలపర్చారు. దీంతో చైర్మన్‌గా అంకం రాజేందర్, వైస్ చైర్మన్‌గా అబ్ధుల్ ఖలీల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఖానాపూర్ టీఆర్ఎస్ కైవసం.. ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే గెలిచారు. చైర్మన్ ఎన్నికకు ఏడుగురి మద్దతు కావాలి. అయితే స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఎక్స్అఫిషియో మెంబర్‌గా ఖానాపూర్‌లో నమోదు చేసుకున్నారు. ఆమె ఓటుతో టీఆర్ఎస్ బలం ఆరుకు చేరింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన 10వ వార్డు కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్ పార్టీలో చేరడంతో చైర్మన్‌గా అంకం రాజేందర్, వైస్ చైర్మన్‌గా అబ్దుల్ ఖలీల్ ప్రమాణ స్వీకారం చేశారు. భైంసాలో గట్టి బందోబస్తు భైంసా(ముథోల్): భైంసా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా పట్టణంలో సోమవారం గట్టి బందోబస్తు నిర్వహించారు. 144సెక్షన్ విధించారు. డీఎస్పీ నర్సింగ్‌రావు గతంలో పనిచేసి బది లీపై వెళ్లిన మరో డీఎస్పీ రాములు భద్రతను పర్యవేక్షించారు. కాగా, ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రేమించి పెళ్లిచేసుకున్నా భర్త కాదనడంతో..
జన్నారం(ఖానాపూర్) : ప్రేమించి పెళ్లిచేసుకున్నా భర్త కాదనడంతో భార్య మౌనపోరాటానికి దిగింది. బాధితురాలు బాదవత్ స్వరూప తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న జాదవ్ బద్రేశ్వర్(బద్రునాయక్) స్వరూపలు ఈ ఏడాది మార్చి 4న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాని తర్వాత ఇంటికి వచ్చిన స్వరూపను కాదన్నాడు. కుటుంబీకుల ఒత్తిడితో స్వరూపను తన ఇంట్లో వదిలేశాడు. ఈ క్రమంలో పోలీసులు కౌన్సెలింగ్ చేయగా తిరిగి తీసుకెళ్లాడు. తర్వాత హైదరాబాద్‌లో కొన్ని రోజులు ఉండి, తిరిగి ఇంట్లో వదిలేయగా ఏప్రిల్ 10 న ఆత్మహత్యయత్నం చేసుకుంది. బాగయ్యాక ఫ్యామిలీ కోర్టులో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా భర్త తీసుకుపోకపోవడం, అత్తమామలు భర్తను కలువనీయడం లేదని చివరికి శనివారం కుటుంబీకులతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగినట్లు స్వరూప తెలిపారు. తన భర్త తనను ఇంటికి తోలుకుపోయే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్వరూప, ఆమె తల్లి అనసూయ పేర్కొన్నారు. చావయిన, బతుకయిన భర్తతోనే అన్నారు. పలువురు మహిళలు మద్దతు తెలిపారు. -
మళ్లీ నకిలీ ఆయుర్వేదం
చికిత్స చేస్తున్న అనుమతి లేని వైద్యులు పట్టించుకోని అధికారులు! ఖానాపురం : మండల కేంద్రంలో అనుమతి లేని ఆయుర్వేదం మళ్లీ జోరందుకుంటుంది. నెల రోజుల క్రితం ‘అనుమతి లేని ఆయుర్వేదం’ శీర్షికన సాక్షిలో వరుస కథనాలు రావడంతో జిల్లా ఆయూష్ అధికారులు స్పందిం చారు. మండల కేంద్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఆయుర్వే వైద్యాన్ని పరిశీలించారు. ఆయూష్ అధికారుల పరిశీలనలో ఒక్కరూ అర్హులు కారనే విషయాన్ని గుర్తించి షాపులను మూసివేయాలని హెచ్చరించి, వివరాలు సేకరించారు. ఆ తర్వాత కొన్ని రోజులు వైద్యాన్ని నిలిపివేశారు. తిరిగి కొద్ది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ వైద్యాన్ని ప్రారంభించారు. బుధవారం కరీంగనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వృద్ధులు అధిక సంఖ్యలో వచ్చారు. అనుమతి లేకున్నా విచ్చలవిడిగా వైద్యాన్ని నడిపిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయూష్ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఒంటికి నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
ఖానాపురం: ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై దుడ్డెల గురుస్వామి కథనం ప్రకారం... వరంగల్‌లోని దయానంద కాలనీకి చెందిన కోన్‌రెడ్డి అరుణ-వుల్లారెడ్డి దంపతుల కుమార్తె శ్రీవిద్య(28) వరంగల్‌లో పీజీ వరకు చదువుకుంది. కొంతకాలంగా శ్రీవిద్య ఫిట్స్‌తో, మానసిక స్థితి బాగలేక బాధపడుతోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం అయిన అరుణ ఇంట్లో కిం దపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అరుణ హన్మకొండలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొం దుతుండగా శ్రీవిద్య తల్లిని ఆస్పత్రిలో చూసి అశోక్‌నగర్‌లోని అమ్మమ్మ అయిన చల్లా శకుంతమ్మ-కొంరారెడ్డి ఇంటికి వచ్చింది. తల్లి పరిస్థితిని చూసి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అవ్మువ్ము ఇంట్లోకి వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురుస్వామి తెలిపారు.