ప్రేమించి పెళ్లిచేసుకున్నా భర్త కాదనడంతో.. | Wife Silent Protest Before Husbands House At Khanapuram | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ఎదుట భార్య మౌనపోరాటం

Published Sun, May 20 2018 7:43 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Wife Silent Protest Before Husbands House At Khanapuram - Sakshi

తల్లితో కలిసి మౌనపోరాటం చేస్తున్న స్వరూప

జన్నారం(ఖానాపూర్‌) : ప్రేమించి పెళ్లిచేసుకున్నా భర్త కాదనడంతో భార్య మౌనపోరాటానికి దిగింది. బాధితురాలు బాదవత్‌ స్వరూప తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న జాదవ్‌ బద్రేశ్వర్‌(బద్రునాయక్‌) స్వరూపలు ఈ ఏడాది మార్చి 4న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాని తర్వాత ఇంటికి వచ్చిన స్వరూపను కాదన్నాడు. కుటుంబీకుల ఒత్తిడితో స్వరూపను తన ఇంట్లో వదిలేశాడు. ఈ క్రమంలో పోలీసులు కౌన్సెలింగ్‌ చేయగా తిరిగి తీసుకెళ్లాడు.

తర్వాత హైదరాబాద్‌లో కొన్ని రోజులు ఉండి, తిరిగి ఇంట్లో వదిలేయగా ఏప్రిల్‌ 10 న ఆత్మహత్యయత్నం చేసుకుంది. బాగయ్యాక ఫ్యామిలీ కోర్టులో ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా భర్త తీసుకుపోకపోవడం, అత్తమామలు భర్తను కలువనీయడం లేదని చివరికి శనివారం కుటుంబీకులతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగినట్లు స్వరూప తెలిపారు. తన భర్త తనను ఇంటికి తోలుకుపోయే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్వరూప, ఆమె తల్లి అనసూయ పేర్కొన్నారు. చావయిన, బతుకయిన భర్తతోనే అన్నారు. పలువురు మహిళలు మద్దతు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement