Wife Hunger Strike
-
ప్రేమించి పెళ్లిచేసుకున్నా భర్త కాదనడంతో..
జన్నారం(ఖానాపూర్) : ప్రేమించి పెళ్లిచేసుకున్నా భర్త కాదనడంతో భార్య మౌనపోరాటానికి దిగింది. బాధితురాలు బాదవత్ స్వరూప తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న జాదవ్ బద్రేశ్వర్(బద్రునాయక్) స్వరూపలు ఈ ఏడాది మార్చి 4న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాని తర్వాత ఇంటికి వచ్చిన స్వరూపను కాదన్నాడు. కుటుంబీకుల ఒత్తిడితో స్వరూపను తన ఇంట్లో వదిలేశాడు. ఈ క్రమంలో పోలీసులు కౌన్సెలింగ్ చేయగా తిరిగి తీసుకెళ్లాడు. తర్వాత హైదరాబాద్‌లో కొన్ని రోజులు ఉండి, తిరిగి ఇంట్లో వదిలేయగా ఏప్రిల్ 10 న ఆత్మహత్యయత్నం చేసుకుంది. బాగయ్యాక ఫ్యామిలీ కోర్టులో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా భర్త తీసుకుపోకపోవడం, అత్తమామలు భర్తను కలువనీయడం లేదని చివరికి శనివారం కుటుంబీకులతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగినట్లు స్వరూప తెలిపారు. తన భర్త తనను ఇంటికి తోలుకుపోయే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్వరూప, ఆమె తల్లి అనసూయ పేర్కొన్నారు. చావయిన, బతుకయిన భర్తతోనే అన్నారు. పలువురు మహిళలు మద్దతు తెలిపారు. -
భర్త ఇంటి ఎదుట భార్య నిరసన దీక్ష
- ప్రేమించి పెళ్లాడి ఒంటరిగా వదిలేసిన భర్త - నెలన్నరకే దారుణం - భర్త కళ్ల ముందే యువతిని చితకబాదిన అత్త, మామ - ఆస్పత్రికి తరలించిన స్థానికులు, పోలీసులు ఖిలావరంగల్ : అతడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేసిన నెలన్నరకే భార్యను ఒంటరిగా వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయూడు. దీంతో భర్త కోసం అత్తింటికి వెళ్లి నిరసన దీక్షకు దిగిన ఆ యువతిని అత్త,మామ చితకబాదారు. ఈ సంఘటన బుధవారం రాత్రి సాకరాశికుంటలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. అండర్ రైల్వేగేట్ ప్రాంతం 15వ డివిజన్ సాకరాశికుంట కాలనికి చెందిన కుంటి శంకర్, నీలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం దంపతులిద్దరు అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబ భారం పెద్దకుమారుడు శంకర్‌పై పడింది. అతడు ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. చిన్న చెల్లె సుకన్య(18) ఇంటి దగ్గరే ఉంటూ కూలీకి వెళ్లేది. ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన ఎనగందుల చిన్నకుమార్, శైలజ దంపతుల పెద్ద కుమారుడు మధు(22)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఒకే సామాజిక వర్గం కావడం, రెండు కుటుంబాలు ఒకే వీధిలో ఉండడంతో వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు మేజర్లు కావడంతో ఏప్రిల్14న కొమ్మాల దేవస్థానంలో వేద మంత్రోచ్ఛర ణల నడుమ పసుపుతాడు కట్టి పెండ్లి చేసుకున్నారు. సుమారు 45 రోజులు ఈ జంట నగరం పరిధి లో ఓ గదిని అద్దెకు తీసుకుని జీవనం సాగించారు. ఈ క్రమం లో మధు భార్య సుకన్యకు చెప్పకుండా సాకరాశికుంటలోని తల్లిదండ్రుల ఇంటికి చేరాడు. మూడు రోజులైనా భర్త రాకపోవడంతో సుకన్య బుధవారం సాయంత్రం నేరుగా మధు ఇం టికి చేరుకుంది. అతడి తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానీ యకపోవడంతో ఇంటి ఎదుటే తనకు న్యాయం చేయాలని నిరసన దీక్షకు దిగింది. మధు ఎదుటే అత్తమామలు ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ చితకబాదారు. దీంతో ఆమె సొమ్మసిల్లి పడిపోవడంతో అత్తమామలు అక్కడి నుంచి పరారయ్యూ రు. స్థానికులు సుకన్య అన్న శంకర్‌కు సమాచారమిచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
భర్త ఇంటి ముందు దీక్ష
తిరువొత్తియూరు:వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, మామ, అత్తలపై చర్యలు తీసుకోవాలని భర్త ఇంటి ముందు భార్య దీక్ష చేపట్టింది. చెన్నై అరుంబాక్కంకు చెందిన వైదేహికి, ఐనావరం వెస్టుమాడ వీధికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జగదీష్‌కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 47 సవర్ల నగలు, కట్న కానుకలు వధువు ఇంటి వారు వరుడికి ఇచ్చారు. అయితే అదనంగా రూ.15 లక్షల వరకట్నం కోరు తూ జగదీష్, మామ ఆర్ముగం, అత్త చంద్ర కలిసి వైదేహిని చిత్ర హింసలు పెట్టారు. దీంతో ఆరు నెలలకు ముందు వైదేహ పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం కుటుంబ సభ్యుల సూచన మేరకు భర్త, అత్త మామలపై తగు చర్యలు తీసుకోవాలని ఐనావరం పోలీ సులకు మార్చి 12న ఫిర్యాదు చేసింది. కానీ ఫిర్యాదుపై పోలీసులు తగు చర్యలు తీసుకోలేదు. ముందస్తు జామీ న్ కోరుతూ చెన్నై జిల్లా కోర్టులో జగదీష్ దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత వైదేహి నుంచి విడాకులు కోరుతున్నట్టు నోటీసు పంపాడు. ఇది చూసిన వైదేహి దిగ్భ్రాంతి చెందింది. మంగళవారం ఉద యం జగదీష్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ కోర్టులో తోసిపుచ్చారు. దీంతో వైదేహి తిరిగి మంగళవారం మధ్యాహ్నం ఐనావరం మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ లీలావతి, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో వైదేహి రాత్రి 10 గంటలకు భర్త ఇంటి ముందు కూర్చుని ధర్నా చేపట్టింది. బుధవారం కూడా వైదేహి దీక్ష కొనసాగించింది. దీనిపై సమాచారం అందుకున్న ఐనావరం పోలీసు ఇన్స్పెక్టర్ కనకరాజ్, పోలీసు లు అక్కడికి చేరుకుని వైదేహితో చర్చలు జరిపారు. భర్త, అత్త, మామలను అరె స్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైదేహి దీక్ష విరమించింది.