భర్త ఇంటి ఎదుట భార్య నిరసన దీక్ష | Wife a protest strike on husband house | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ఎదుట భార్య నిరసన దీక్ష

Published Thu, May 28 2015 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

భర్త ఇంటి ఎదుట భార్య నిరసన దీక్ష

భర్త ఇంటి ఎదుట భార్య నిరసన దీక్ష

- ప్రేమించి పెళ్లాడి ఒంటరిగా వదిలేసిన భర్త
- నెలన్నరకే దారుణం
- భర్త కళ్ల ముందే యువతిని చితకబాదిన అత్త, మామ
- ఆస్పత్రికి తరలించిన స్థానికులు, పోలీసులు
ఖిలావరంగల్ :
అతడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేసిన నెలన్నరకే భార్యను ఒంటరిగా వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయూడు. దీంతో భర్త కోసం అత్తింటికి వెళ్లి నిరసన దీక్షకు దిగిన ఆ యువతిని అత్త,మామ చితకబాదారు. ఈ సంఘటన బుధవారం రాత్రి సాకరాశికుంటలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. అండర్ రైల్వేగేట్ ప్రాంతం 15వ డివిజన్ సాకరాశికుంట కాలనికి చెందిన కుంటి శంకర్, నీలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం దంపతులిద్దరు అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబ భారం పెద్దకుమారుడు శంకర్‌పై పడింది. అతడు ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. చిన్న చెల్లె సుకన్య(18) ఇంటి దగ్గరే ఉంటూ కూలీకి వెళ్లేది. ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన ఎనగందుల చిన్నకుమార్, శైలజ దంపతుల పెద్ద కుమారుడు మధు(22)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఒకే సామాజిక వర్గం కావడం, రెండు కుటుంబాలు ఒకే వీధిలో ఉండడంతో వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు మేజర్లు కావడంతో ఏప్రిల్14న కొమ్మాల దేవస్థానంలో వేద మంత్రోచ్ఛర ణల నడుమ పసుపుతాడు కట్టి పెండ్లి చేసుకున్నారు. సుమారు 45 రోజులు ఈ జంట నగరం పరిధి లో ఓ గదిని అద్దెకు తీసుకుని జీవనం సాగించారు. ఈ క్రమం లో మధు భార్య సుకన్యకు చెప్పకుండా సాకరాశికుంటలోని తల్లిదండ్రుల ఇంటికి చేరాడు. మూడు రోజులైనా భర్త రాకపోవడంతో సుకన్య బుధవారం సాయంత్రం నేరుగా మధు ఇం టికి చేరుకుంది. అతడి తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానీ యకపోవడంతో ఇంటి ఎదుటే తనకు న్యాయం చేయాలని నిరసన దీక్షకు దిగింది. మధు ఎదుటే అత్తమామలు ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ చితకబాదారు. దీంతో ఆమె సొమ్మసిల్లి పడిపోవడంతో అత్తమామలు అక్కడి నుంచి పరారయ్యూ రు. స్థానికులు సుకన్య అన్న శంకర్‌కు సమాచారమిచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement