ఇద్దరు ఆడ కవలలు పుట్టారని ఒక పాపను గొంతు కోసి చంపిన విషయం నెల్లికుదురు మండలం వావిలాల శివారు మద్దు తండాలోబుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన వాంకుడొతూ బాలాజీ, సరితలకు ముగ్గురు సంతానం. మొదటి సంతానంగా బాబు పుట్టగా, రెండో సంతానంగా కవల ఆడ పిల్లలు పుట్టారు. దీంతో ఆవేదన చెందిన తండ్రి ఒక పాపను గొంతు కోసి చంపి పూడ్చిపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సరితను విచారించారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగని ఆడశిశు హత్యలు
Published Wed, Mar 2 2016 4:02 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement