బస్ డ్రైవర్‌గా అవకాశం ఇవ్వండి
మంత్రి మహేందర్‌రెడ్డిని కోరిన ‘ఢిల్లీ డ్రైవర్’ సరిత
సాక్షి, హైదరాబాద్: సరిత.. ఢిల్లీ మహా నగర బస్సు డ్రైవర్! సంస్థాన్ నారాయణ పురం సమీపంలోని సీతియా తండాకు చెందిన ఆమెది నిరుపేద కుటుంబం. ఐదుగురు అక్కాచెల్లెళ్లు. దీంతో హైదరాబాద్ వచ్చి బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. 2011 లో ఢిల్లీవెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా చేసింది. ఇప్పు డామె హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కావాలని ఉవ్విళ్లూరుతోంది.
అందుకు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చింది. సీఎం బిజీగా ఉండటంతో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిని కలసి.. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టు ఇవ్వాలని కోరింది. మహిళా డ్రైవర్‌గా సరితకు తప్పకుండా ప్రాధాన్యమిస్తామని మంత్రి చెప్పారు. షీక్యాబ్ నడుపుతానంటే ఆమెకు కారు కేటాయిస్తామన్నారు.