కురవి, న్యూస్‌లైన్: వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో ప్రేమలోపడి పెళ్లి చేసుకుంటానని మొండికేయడంతో కుటుంబ సభ్యులు ఓ బాలికను హత్య చేసిన సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలంలోని కాంపల్లి శివారు తునికిచెట్టు తండాలో శనివా రం రాత్రి జరిగింది. కురవి సీఐ రవీందర్ కథనం ప్రకారం తండాకు చెందిన బానోత్ భద్రు, తారీల కుమార్తె సరిత(16) ఇంటర్ చదువుతోంది. అదే తండాకు చెందిన రాంసింగ్‌ను ప్రేమిస్తోంది. అతడు వరుసకు సోదరుడు అవుతాడు.
రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు పారిపోయారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రాంసింగ్‌ను అరెస్ట్ చేసి జై లుకు పంపారు. సరితను వరంగల్‌లోని స్వధార్ హోంకు పంపారు. రాంసింగ్ బెయిల్‌పై విడుదలయ్యూక వెంటనే హోంకు వెళ్లి సరితను కలిశాడు. ఈక్రమంలో పలుమార్లు తమ కుమార్తెకు కౌన్సెలింగ్ చేశారు. అయినా వైఖరిలో మార్పు రాకపోవడంతో తల్లిదంఢ్రులు శనివారం సరితను తాడుతో ఉరివేసి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడి పోలీసులకు చిక్కారు.