
‘వద్దురా అన్న... బయటకు రాకురోయన్న.. వద్దన్న నువ్వొస్తే.. కాటేస్తుందిరా కరోనా’ అంటూ సరిత పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనాకు మందు లేకపోవడంతో భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతే కీలకంగా మారింది. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు పిలుపుచ్చాయి. అయితే, స్వీయ నియంత్రణతోనే కోవిడ్-19పై విజయం సాధిస్తామనేది జగమెరిగిన సత్యం. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పలువురు కళాకారులు, సెలబ్రిటీలు తమదైన శైలిలో పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఏఎస్పీ సరిత అలాంటి ప్రయత్నమే చేశారు. సీఐడీ ఎస్‌ఐ శ్రీహరి రచించిన పాటను ఆమె తన గళంతో అందర్ని ఆకట్టుకునేలా పాడారు. ‘వద్దురా అన్న... బయటకు రాకురోయన్న.. వద్దన్న నువ్వొస్తే.. కాటేస్తుందిరా కరోనా’ అంటూ సరిత పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కరోనాపై పోరాటంలో పోలీసులు ముందున్నారని, ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు.
(చదవండి: కరోనా పోరు: విజేత ఆ ఊరు)
(చదవండి: కరోనా అలర్ట్ : హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు..)