జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ” అండర్ -17, 19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందం పతకాలు గెలుచుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఏపీ టీమ్‌కు నాలుగు కాంస్యాలు దక్కాయి.
ఈ సందర్భంగా.. ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఈ బాక్సింగ్ పోటీలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు ఢిల్లీలో జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు.
పతకాలు గెలుచుకుంది వీళ్లే
►అండర్ 19- బాలికల (45-48 కేజీలు) విభాగంలో మొహ్మద్ హీనా కౌసర్ (నారాయణ జూనియర్ కాలేజీ ,విశాఖపట్నం)- కాంస్య పతకం.
►అండర్ 19- బాలికల (48-51 కేజీలు ) విభాగంలో కోలుసు నిహారిక (విశాఖ గవర్నమెంట్ జూనియర్ కాలేజి,విశాఖపట్నం )- కాంస్య పతకం.
►అండర్ 19- బాలికల (51-54 కేజీలు) విభాగంలో గంగవరపు అక్షిత (గవర్నమెంట్ జూనియర్ కాలేజి ,రాజమహేంద్రవరం,తూర్పు గోదావరి జిల్లా)- కాంస్య పతకం.
►అండర్ 17- బాలికల (46-48 కేజీలు) విభాగంలో మైలపిల్లి మేఘన (సెయింట్ జాన్స్ పారిష్ స్కూల్ ,విశాఖపట్నం జిల్లా ) - కాంస్య పతకం.
చదవండి: National School Games: ఆంధ్రప్రదేశ్ తైక్వాండో బృందానికి పతకాలు
Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment