సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ తన విజయ పరంపర కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న నేషనల్ స్కూల్ గేమ్స్ షూటింగ్ పోటీల్లో బాలికల బృందం బంగారు పతకం సాధించింది. షూటర్లు తమన్యు సిరంగి (412.9), గొంటు లక్ష్మీ సమన్విత (410.4), ఆహాన రాఠీ (406.6) బృందం 1229.9 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నారు.
బాక్సింగ్‌లో ఆరు పతకాలు
శుక్రవారం మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బాలుర బాక్సింగ్ అండర్–14, 17, 19 విభాగాల్లో ఏపీ విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. బోండా లక్ష్మణ్ (ఎస్వీఎల్‌ఎన్‌ఎస్ విద్యాపీఠ్ జూనియర్ కాలేజీ) రజతం, దాసరి ప్రవీణ్ కుమార్ (జీవీఎంసీ హైస్కూల్ , మాధవధార) కాంస్యం, జన్ని వసంతరావు (శ్రీ బాలాజీ జూనియర్ కళాశాల, భీమసింగి) కాంస్యం, ఆకుల అశోక్ కుమార్ (సోఫియా జూనియర్ కళాశాల, జ్ఞానపురం) కాంస్యం, ఆయుష్ (ఎంఏబీ పీ జూనియర్ కళాశాల, గాజువాక) కాంస్యం, దొంతల దేవస్వరూప్ (జేఎన్‌పురం, విజయనగరం జిల్లా) కాంస్య పతకం సాధించారు.
ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు అభినందించినట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ కార్యదర్శి భానుమూర్తిరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment