
జాతీయస్థాయి తైక్వాండోకు పోరుమామిళ్ల విద్యార్థులు
ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు పోరుమామిళ్లకు చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు తైక్వాండో అసోషియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ నాయబ్స్రూల్ తెలిపారు.
పోరుమామిళ్ల: ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు పోరుమామిళ్లకు చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు తైక్వాండో అసోషియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ నాయబ్స్రూల్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 3, 4 తేదీల్లో తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో జూనియర్స్ పోటీల్లో పోరుమామిళ్లకు చెందిన శ్రీవిద్య 44 కేజీల బాలికల విభాగంలో బంగారు పతకం, 42 కేజీల విభాగంలో వీరవందన రజత పతకం, 55 కేజీల బాలుర విభాగంలో అబ్దుల్‌కలామ్ రజత పతకం సాధించారని వివరించారు. వీరు ఈనెల 28 నుంచి 31 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారన్నారు. కడప జిల్లా టీమ్ కోచ్‌గా బాలు, రెఫరీలుగా మహబూబ్‌బాషా, నరసింహప్రసాద్ వ్యవహరించారన్నారు.