డల్లాస్ : డల్లాస్‌లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో భారత క్రీడాకారులు అద్భుత విజయం సాధించారు. తెలుగు తేజాలైన కొండాసహదేవ్, అబ్దుల్ కలీల్, సింధు తపస్విలు బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. విజేతలకు స్థానిక తెలుగు సంస్థ టాంటెక్స్ (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం), తెలంగాణ ఎన్.ఆర్.ఐ. విభాగం సంయుక్తంగా సత్కరించింది. ఇర్వింగ్ లోని అవర్ ప్లేస్ రెస్టారెంట్‌లో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. తెలుగు భాష , సంస్కృతులను డల్లాస్ పరిసర ప్రాంతాల్లో 32 సంవత్సరాలకు పైగా పరిరక్షిస్తూ, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టాంటెక్స్ సంస్థ ప్రస్తుత అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి మాట్లాడుతూ తైక్వాండో పోటీల్లో విజయం సాధించి భారత దేశ కీర్తిని చాటిన విజేతలను సత్కరించడం తమ బాధ్యత అని తెలిపారు. సంవత్సరం పొడుగునా వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు వారందరికీ గర్వ కారణమైన తైక్వాండో విజేతలను, ఈ క్రీడాకారులను ప్రత్యేక శిక్షణ ఇస్తూ తీర్చిదిద్దిన వారి కోచ్ జయంత్ రెడ్డి లను టాంటెక్స్ సంస్థ సభ్యులు జ్ఞాపికలతో సత్కరించారు.
డా. మోహన్ గోలి, రఘు చిట్టిమల్లలు, తెలంగాణా ఎన్.ఆర్.ఐ. విభాగ సభ్యులకు, కార్యక్రమం జరిగిన అవర్ ప్లేస్ రెస్టారెంట్ యజమాని నరేంద్ర బాబులకు అభినందనలు తెలిపారు. వీర్నపు చినసత్యం, కోడూరు క్రిష్ణారెడ్డి, కోశాధికారి పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు శరత్ ఎర్రం, సమీర ఇల్లెందుల, బండారు సతిష్మరియుపాలక మండలి అధిపతి కన్నెగంటి చంద్ర, సభ్యుడు పవన్ నెల్లుట్ల ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment