జాతీయ స్థాయికి ఎంపిక
మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి జీ కావ్య జాతీయస్థాయి
సిరికొండ :
మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి జీ కావ్య జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ బాశెట్టి లింబాద్రి తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 జూనియర్ కళాశాలల విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు కళాశాల విద్యార్థినులు జీ కావ్య, టీ లత, ఎం దేవిక ఎంపికై గతనెల 30న రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. కావ్వ గోల్డ్‌మెడల్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాగా, లత, దేవికలు సిల్వర్ మెడల్స్ సాధించారు. క్రీడాకారిణులను బుధవారం జిల్లా జూనియర్ కళాశాలల క్రీడల నిర్వహణ కార్యదర్శి మహ్మద్ షకీల్, కోచ్ పీఈటీ ఈశ్వర్ తదితరులు కళాశాలలో అభినందించారు.