గురుగ్రామ్ : హరియాణాలోని గురుగ్రామ్‌లో 25 ఏళ్ల భారత యువ క్రీడాకారిణిని కాల్చివేతకు గురైంది. తైక్వాండో క్రీడాకారిణి అయిన సరితను మంగళవారం మధ్యాహ్న సమయంలో ఒక యువకుడు సరితను కాల్చి చంపాడని సమాచారం. అయితే ఈ హత్య వెనుక సరిత కోచ్ హస్తం దాగుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. 'గతంలో సరిత కోచ్ ఆమెను వివాహం చేసుకోవాలని పలుమార్లు వెంటపడగా సరిత చాలాసార్లు తిరస్కరించింది. దీంతో పెళ్లి విషయమై వీరివురి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పెళ్లికి నిరాకరించడంతోనే కోచ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు' అని సరిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
గురుగ్రామ్‌లోని బోరాఖుర్ద్ గ్రామంలో ఓ యువతి కాల్చివేతకు గురైనట్టు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను తైక్వాండో క్రీడాకారిణి సరితగా గుర్తించారు. ఒక యువకుడు మహిళను కాల్చి చంపి పరారైనట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. సరిత హత్య వెనుక కోచ్ హస్తం ఉందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోచ్ సరితకు 2013 నుంచి తెలుసని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే హత్య తర్వాత కోచ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment