కవిత
బాక్సింగ్, కరాటే, కుంగ్‌ఫు, తైక్వాండో లాంటి క్రీడలు పురుషులకే సొంతం అనుకుంటే పొరపాటే. వీటిలోనూ మగవారికి సమానంగా మహిళలు రాణిస్తున్నారు..తమ ప్రతిభను చూపుతున్నారు. రామంతాపూర్‌కు చెందిన కవిత(23) తైక్వాండోలో బ్లాక్ బెల్ట్‌ఐదో డాన్ సాధించి... ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి మహిళగా రికార్డులకు ఎక్కింది.
రామంతాపూర్: కవితకు తైక్వాండో అంటే ఆసక్తి. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే ఈ క్రీడను నేర్చుకోవాలని అనుకుంది. శిక్షణకు వెళ్తానంటే.. ‘ఆడపిల్లకు ఆటలు ఎందుకు?’ అని వారించారు. అయినా వినకుండా, వారిని ఎదిరించి గురువు జయంత్, సంపూర్ణ లింగంల దగ్గర శిక్షణలో చేరింది. పదో ఏటనే బ్లాక్‌బెల్ట్ సాధించింది. ఈ క్రీడలో జాతీయ స్థాయిలో ఐదో డాన్ సాధించిన పురుషులే చాలా తక్కువ మంది ఉంటారు. దేశంలోనే ఈ ఘనత సాధించిన ప్రథమ మహిళగా కవిత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళలే ఈ బెల్ట్ సాధించగా... అందులో కవిత ఒక్కరు కావడం విశేషం.
2004లో కొరియాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలో పాల్గొని మూడో డాన్ విజేతగా నిలిచింది. 2008లో అమెరికాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలో భారత్ తరఫున పాల్గొని పలు పతకాలు సాధించింది. భారత్‌లో జరిగిన వరల్డ్ తైక్వాండో పోటీలో ఐదో డాన్ విజేతగా నిలిచింది. దేశవిదేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని వందకు పైగా పతకాలు, 30కి పైగా ట్రోఫీలు గెలుచుకుంది. ఐదుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ప్రస్తుతం కవిత రామంతాపూర్‌లో తైక్వాండో అకాడమీని ప్రారంభించి శిక్షణనిస్తున్నారు.
ఒలింపిక్స్‌లోపతకమేధ్యేయం..
1994 ఒలింపిక్స్‌లో తైక్వాండో క్రీడ చూసి స్ఫూర్తి పొందాను. నేనూ తైక్వాండో నేర్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. పట్టుదలతో ఈ విద్యనభ్యసించాను. ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించడమే లక్ష్యంగా నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment