జ్ఞాపికలతో క్రీడాకారులు
భువనగిరి : తైక్వాండో ఆత్మరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని తైక్వాండో జిల్లా అధ్యక్షుడు సోలిపురం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థుల మానసికోల్లాసంతోపాటు విద్యా, ఉద్యోగాల్లో తైక్వాండో ఉపయోగపడుతుందన్నారు.
అనంతరం తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గుర్రం కృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు ఈనెలలో మేడ్చల్ జిల్లాలో జరిగే సీనియర్, సబ్‌జూనియర్, వికారాబాద్‌లో క్యాడేట్, మహబూబాబాద్‌లో జూనియర్ విభాగం పోటీల్లో పాల్గొంటారన్నారు.
సబ్‌జూనియర్, సీనియర్, క్యాడేట్ సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సుమారు 200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా కోశాధికారి మీసాల వెంకటేశం, ఉపాధ్యక్షులు కోట్ల సుధాకర్, శిక్షకులు కోన్‌రెడ్డి శ్రీకాంత్, శివ, శివసాయి, పర్యవేక్షకులు సుధీర్, గోపాలకృష్ణ, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment