self-defense
-
కొనసాగుతున్న భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఖేర్సన్ దక్షిణ ప్రాంతం, జపోరిజియా పరిధిలో రష్యా సేనలు స్వీయ రక్షణలో పడ్డాయని ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. ఇరాన్ తయారీ షాహీద్ డ్రోన్లు, క్షిపణులు, శతఘ్ని, మోర్టార్ దాడులు పెరిగాయని ఉక్రెయిన్ తెలిపింది. పలు చోట్ల జరిగిన దాడుల్లో శనివారం నలుగురు మరణించారని వెల్లడించింది. ఒడెసాలోని నౌకాశ్రయం వద్ద జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడ్డారు. 20కిపైగా షాహీద్ డ్రోన్లు, ఎనిమిది క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్కేంద్రం జపోరిజియా న్యూక్లియర్పవర్ ప్లాంట్‌లో చివరి రియాక్టర్‌ను అధికారులు షట్‌డౌన్ చేశారు. ప్లాంట్ సమీపంలో బాంబుదాడుల బెడద ఎక్కువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్రెయిన్ అణుఇంథన సంస్థ ఎనర్జియాటమ్ తెలిపింది. కేంద్రక విచ్ఛిత్తి చర్య, అత్యధిక ఉష్ణోద్భవం, పీడనాలను ఆపేందుకు ఆరింటిలో చిట్టచివరిదైన ఐదో రియాక్టర్లో కూలింగ్ రాడ్లను కోర్లోకి దింపేశామని తెలిపింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థకు సరఫరా చేసే విద్యుత్ లైన్లు దాడుల కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్లాంట్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా అసాధ్యం. రియాక్టర్ షట్డౌన్కు ఇదీ ఒక కారణమేనని ఎనర్జియాటమ్ వివరించింది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించాక ప్లాంట్ నిర్వహణ బాధ్యత రష్యా చేతికొచ్చింది. మరోవైపు కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో వరదమయమైన ఖేర్సన్లో ఇంకా నీరు 4.5 మీటర్ల ఎత్తులో నిలిచే ఉంది. ఈ వారంలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముంపు ప్రజలకు సహాయక చర్యలకు విఘాతం కలగొచ్చని ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ హెచ్చరించారు. దాదాపు 7 లక్షల మంది తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఐక్యరాజ్యసమితి సహాయక విభాగం అధిపతి మార్టిన్ ఆందోళన వ్యక్తంచేశారు. -
గన్ కంట్రోల్ బిల్లుకు అమెరికా సెనేట్ అమోదం
వాషింగ్టన్: ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడటం అమెరికన్లకు రాజ్యాంగమిచ్చిన హక్కు అంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, తుపాకుల నియంత్రణకు రూపొందిన చరిత్రాత్మక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. తుపాకుల కొనుగోలుపై ఆంక్షలు విధించే అత్యంత కీలకమైన ఈ బిల్లును ఆమోదించింది. 50 మంది డెమొక్రాట్లతో పాటు తుపాకుల నియంత్రణను తీవ్రంగా వ్యతిరేకించే రిపబ్లికన్ పార్టీకి చెందిన 15 మంది సెనేటర్లు కూడా అనుకూలంగా ఓటేయడం విశేషం. దాంతో 100 మంది సభ్యుల సెనేట్‌లో 65–33 తేడాతో బిల్లు గట్టెక్కింది. దీన్ని త్వరలో డెమొక్రాట్ల ఆధిక్యమున్న దిగువ సభ (ప్రతినిధుల సభ)లో బిల్లు ప్రవేశపెడతారు. అయితే ఆమోదం లాంఛనమే. అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. దీనిపై బైడెన్ హర్షం వెలిబుచ్చారు. ‘‘28 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో చలనం వచ్చింది. తుపాకుల హింసకు అడ్డుకట్ట పడాలని కుటుంబాలకు కుటుంబాలు రోడ్డెక్కడంతో కాంగ్రెస్ సభ్యులంతా ఏకమయ్యారు’’ అని వ్యాఖ్యానించారు. బిల్లులో ఏముంది? 21 ఏళ్ల కంటే తక్కువున్న వారు తుపాకులు కొనుగోలు చేస్తే వారి నేపథ్యంపై విస్తృతంగా వివరాలు సేకరిస్తారు. పాఠశాలల్లో భద్రతను పెంపొందించడానికి, ప్రజల్లో మానసిక సమస్యల నివారణకు ఆరోగ్య కార్యక్రమాలకు 1500 కోట్ల డాలర్ల నిధుల్ని కేటాయిస్తారు. ఎవరి చేతులోనైనా తుపాకులు ప్రమాదకరమని భావిస్తే లైసెన్స్ రద్దు చేసి తుపాకులు వెనక్కు తీసుకునే అధికారాలు రాష్ట్రాలకు సంక్రమిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ ఫ్లాగ్ చట్టాలు అమలు చేయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. -
ఆత్మరక్షణ విద్యల్లో నాయికలు
సినిమా: ఇప్పుడు కథానాయికలు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతున్నారు. ఒకప్పుడు అందాలారబోతకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు వేరే లెవల్ అంటున్నారు. ఆ మధ్య నటి అనుష్క బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో నటించడానికి గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి విద్యలో శిక్షణ పొందింది. అదే విధంగా ఇటీవల నటి స్నేహ కూడా పటాస్ చిత్రం కోసం తమిళుల ప్రాచీన విలువిద్య అడిమురై అనే ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొంది నటించారు. ఈ చిత్రం స్నేహకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా సంచలన నటిగా ముద్ర వేసుకున్న అమలాపాల్ తాజాగా అదో అంద పరవై పోల చిత్రంలో నటించింది. ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం. ఈ చిత్రం కోసం అమలాపాల్ గ్రామిక అనే ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొంది నటించింది. ఈ చిత్రం పిబ్రవరి 14న తెరపైకి రానుంది. ఇకపోతే మరో మలయాళ నటి మాళవికమోహన్ కూడా ఇప్పుడు యాక్షన్ హీరోయిన్ అవతారమెత్తింది. ఈ అమ్మడు ఇళయదళపతి విజయ్‌కు జంటగా మాస్టర్ చిత్రంలో నటిస్తోంది. విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఇందులో నటి మాళవికమోహన్కు ఫైట్స్ ఉన్నాయట. దీని కోసం పర్కలర్ అనే ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతోందని తెలిసింది. ఇకపోతే ఇదే చిత్రంలో నటి ఆండ్రియా నటిస్తోంది. ఈమెకు కూడా చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదలకు సిద్ధం అవుతోంది. మొత్తం మీద హీరోయిన్ ఇప్పుడు యాక్షన్‌కు మారడంతో పాటు ఆత్మరక్షణ విద్యల్లోనూ ఆరితేరుతున్నారన్నమాట. -
నేనూ కాపలాదారునే..
న్యూఢిల్లీ: సామాజిక రుగ్మతలు, అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరులో తనతో కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతుదారులను కోరారు. ‘నేను కూడా కాపలాదారునే’(మై భీ చౌకీదార్) అంటూ ప్రతిజ్ఞ చేయాలని వారికి పిలుపునిచ్చారు. ‘మీ కాపలాదారు (చౌకీదార్)గా దేశానికి సేవ చేసేందుకు గట్టిగా నిలబడ్డాను. కానీ, నేను ఒంటరిని కాను. అవినీతి, చెడు, సామాజిక రుగ్మతలపై పోరు సాగించే ప్రతి ఒక్కరూ కాపలాదారే. దేశ పురోగతికి కృషి చేసే ప్రతి ఒక్కరూ కాపలాదారే. నేడు ప్రతి భారతీయుడూ ‘నేనూ కాపలాదారునే’ అంటున్నారు’ అని ట్విట్టర్లో పేర్కొంటూ ఒక వీడియోను ట్యాగ్ చేశారు. ప్రధాని పిలుపును కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘మోదీ! మీరు ఆత్మరక్షణలో ఈ ట్వీట్ చేశారు. ఈ రోజు కాస్తంత అపరాధంతో ఉన్నారు’ అని పేర్కొంటూ విజయ్ మాల్యా, అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలతో ప్రధాని ఉన్న ఫొటోలను ట్యాగ్ చేశారు. ప్రధాని మోదీ పిలుపుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా స్పందించారు. ‘దొంగ కాపలాదారు మోదీ ఒక్కరే’ అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే చౌకీదార్ అని ప్రధాని మోదీ తరచుగా తనను తాను పోల్చుకుంటుండటం తెలిసిందే. -
ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం
భువనగిరి : తైక్వాండో ఆత్మరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని తైక్వాండో జిల్లా అధ్యక్షుడు సోలిపురం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థుల మానసికోల్లాసంతోపాటు విద్యా, ఉద్యోగాల్లో తైక్వాండో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గుర్రం కృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు ఈనెలలో మేడ్చల్ జిల్లాలో జరిగే సీనియర్, సబ్‌జూనియర్, వికారాబాద్‌లో క్యాడేట్, మహబూబాబాద్‌లో జూనియర్ విభాగం పోటీల్లో పాల్గొంటారన్నారు. సబ్‌జూనియర్, సీనియర్, క్యాడేట్ సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సుమారు 200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా కోశాధికారి మీసాల వెంకటేశం, ఉపాధ్యక్షులు కోట్ల సుధాకర్, శిక్షకులు కోన్‌రెడ్డి శ్రీకాంత్, శివ, శివసాయి, పర్యవేక్షకులు సుధీర్, గోపాలకృష్ణ, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
అమ్మాయిల్ని ధైర్యంగా పెంచాలి
‘వరంగల్ యాసిడ్ ఘటన’.. నేను చదువుకునే రోజుల్లోనే జరిగింది. ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేరస్తులపై నాటి పోలీసుల చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్లలో కొండంత విశ్వాసం నింపింది. అయితే మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలతో పాటు మగవాళ్లలోనూ పరివర్తన రావాలి. పరివర్తన తెచ్చే బాధ్యతను తల్లిదండ్రులు, సమాజం తీసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఆత్మరక్షణకు సదా సిద్ధంగా ఉండాలి. అబలలమని భావించకుండా.. వేధింపులను, దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అంటున్నారు మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి. బాలికలు, యువతులు, మహిళల సంరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటూ మహిళా ఐపీఎస్ ఆఫీసర్లలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప్తితో మాట్లాడుతున్నప్పుడు మహిళా ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని ‘సాక్షి’కి అనిపించింది. నాన్న మైనింగ్ శాఖలో అధికారి. తరచూ బదిలీలు అవుతుండేవి. వరంగల్, కాకినాడ, నల్లగొండ, చిత్తూరు.. ఇలా అనేక ప్రాంతాల్లో నివాసం ఉన్నాము. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా నా బాల్యం గడించింది. చిత్తూరులోని గుడ్‌షెపర్డ్‌లో హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్లో మరింత కష్టపడి చదివా. ఆ తర్వాత నాన్న గైడెన్స్ నా ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో తోడ్పడింది. .. కన్నీళ్లు ఆగలేదు ఐఐటీలో చేరాలన్నది నా కల. ఎలాగైనా ఐఐటీ సాధించాలని పట్టుదలతో ఉండేదాన్ని. హైదరాబాద్‌లో రామయ్య కోచింగ్ సెంటర్లో ప్రవేశానికి ప్రయత్నించా. అయితే అప్పటికే సీట్లు నిండిపోవటంతో అది కుదరలేదు. చిత్తూరు జిల్లా పక్కనే ఉన్న నెల్లూరు పట్టణంలో పేరున్న ఒక కోచింగ్ సెంటర్లో చేరాలని అనుకున్నా. అక్కడికి వెళ్లి ఓ లెక్చరర్ని అడిగితే, ‘‘చూడమ్మాయ్.. ఐఐటీలు అబ్బాయిలకు మాత్రమే సూట్ అవుతాయ్. ఇంజనీరింగ్, సైన్స్ సబ్జెక్టుల్లో వాళ్లు మాత్రమే రాణిస్తారు. అమ్మాయిలు అలా కాదు. మీరు ఐఐటీలో సెట్ కాలేరు. వెళ్లి చక్కగా డిగ్రీ చదువుకో’ అని చాలా నిరుత్సాహంగా మాట్లాడారు. ఆ లెక్చరర్ మాటలతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆరోజు రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఎదుర్కొన్న మొదటి వివక్ష అదే. ఎలాగైనా ఆ లెక్చరర్ అభిప్రాయాన్ని తప్పుగా నిరూపించాలనుకున్నా. పట్టుదలతో కోచింగ్ తీసుకుని ఐఐటీ సాధించా. అమ్మాయిలు ఏ రంగంలోనైనా అబ్బాయిలతో పోటీ పడవచ్చన్న ఆత్మవిశ్వాసం అప్పుడే నాకు కలిగింది. సైంటిస్టు అవ్వాలనుకున్నా ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరా. క్లాస్‌లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఢిల్లీ ఐఐటీ వాతావరణం బాగుంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న వివక్ష ఎక్కడా కనిపించదు. అప్పటి వరకు సైంటిస్టు కావాలనుకున్న నన్ను మా నాన్న సివిల్ సర్వీసెస్ వైపు మళ్లేలా చేశారు. ఐఐటీ పూర్తికాగానే హైదరాబాద్‌లో ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరిపోయా. మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంకు సాధించాను. కోపం కట్టలు తెంచుకుంది ఐపీఎస్ ఆఫీసర్ కాక ముందు ఒక ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపింది. నాన్న సుపీరియర్ ఆఫీసర్ ఒకరు హైదరాబాద్‌లో ఉండేవారు. ఒక అబ్బాయి ఆయన కూతురు వెంటపడి ప్రేమించమంటూ వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో పైశాచికంగా హత్య చేశాడు. ఆ ఘటన నన్ను కుదిపేసింది. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నవారిపై నాలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలోనే అనుకున్నా.. ఇలాంటి దాడులు ఆగిపోవాలని. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్‌గా నా పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నాను. మరీ ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాను. మెదక్ జిల్లాలో మహిళలపై దాడులు అరికట్టేందుకు ‘షీ భరోసా’లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు పోలీస్స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని మహిళా కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు, సిబ్బంది గౌరవించేలా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ప్రజలు తమ సమస్యలు ఎప్పుడైనా చెప్పుకునేందుకు ఎస్పీగా ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటున్నాను. అంబులెన్స్ కోసం చూడలేదు రంగారెడ్డి జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ రోజు సీఎం బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తుండగా వికారాబాద్ రూట్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్‌బైక్ నడుపుతున్న ఓ వ్యక్తిని వాహనం ఢీకొంది. అందరూ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకున్నారు. నేను వాహనం దిగి అతని పల్స్ చూశాను. బతికి ఉన్నట్లు అనిపించింది. అంబులెన్స్ కోసం చూడకుండా వెంటనే, కారుతున్న ఆ రక్తగాయాలతోనే అతడిని నా వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లా. వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత హైదరాబాద్‌కు తరలించాం. బతికాడు. అతడితో పాటు నాకూ ప్రాణం వచ్చినట్లయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్బంలో 108 వాహనాలకోసం ఎదురుచూడకుండా సొంత వాహనంలో క్షతగాత్రులను తరలించిన వార్తలు విన్నప్పుడు సంతృప్తిగా ఉంటుంది. ఆ రెండు కేసులు..! ఐపీఎస్ అయ్యాక మొదట ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నల్లగొండ జిల్లాలో పనిచేశా. అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ వికారాబాద్ ఇచ్చారు. వికారాబాద్‌లో ఏఎస్పీగా పనిచే స్తున్న సమయంలోనే.. ఓ వ్యక్తి కన్నకూతురుపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మొదట ఈ కేసు మాకు ఒక సవాలుగా మారింది. తన కూతురును తీసుకుని వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి నేను ఘటనా స్థలానికి వెళ్లాను. తండ్రిని విచారిస్తే పొంతన లేకుండా సమాధానం చెబుతున్నాడు. తండ్రే అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఉంటాడని మాకు అనుమానం వచ్చింది. ఘటనా స్థలంలో తండ్రి చెప్పులు కనిపించటంతో మా అనుమానం రూఢీ అయ్యింది. గట్టిగా విచారిస్తే నేరం అంగీకరించాడు. ఇప్పటికీ కదిలిపోతాను మరో కేసు గురించి కూడా చెప్పాలి. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో గత ఏడాది నవంబర్‌లో ఈ క్రైం చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన కుటుంబాలు ఉపాధి కోసం ముప్పిరెడ్డిపల్లికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాయి. కలీం, హసీనా జంట అలాగే బాబు, పాపతో వలస వచ్చారు. 2017 డిసెంబర్ 6న వాళ్ల ఆరేళ్ల పాప ఖుష్బూ కనిపించకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరుసటిరోజు ముప్పిరెడ్డిపల్లిలోని మొండికుంట అనే ప్రాంతంలోని కల్వర్టులో ఆరేళ్ల పాప శవం కనిపించింది. క్లూస్‌టీం, పోలీసు జాగిలాలను రంగంలోకి దించి దర్యాప్తు వేగవంతం చేశాం. స్వయంగా నేనే కేసును దర్యాప్తు పర్యవేక్షించాను. మాకు అందిన క్లూస్ మేరకు అజయ్ అలియాస్ శమీరాజ్ బ్రార్ అనే అతన్ని నిందితునిగా గుర్తించాము. శమీరాజ్ బ్రార్ డిసెంబర్ 6వ తేదీన ఖుబ్బూ(6) చదువుకునే పాఠశాలకు వెళ్లి భోజన విరామం సమయంలో పాపకు చాక్లెట్లు ఇచ్చి బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత గ్రామ శివారులో చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు. శమీరాజ్ బ్రార్‌కు ఆరేళ్ల కూతురు ఉంది. మానవమృగంలా మారి శమీరాజ్ బ్రార్ ఖుష్బూలో తన కూతురును చూసుకోకపోవటం నన్ను కలిచివేసింది. ఈ కేసులో శమీరాజ్ బ్రార్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఇలాంటి కేసులు చూసినప్పుడల్లా నేను కదలిపోతాను. చిన్నారులు, మహిళల విషయంలో పురుషుల ప్రవర్తన మారాలని బలంగా కోరుకుంటున్నాను’’ అని ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు చందన దీప్తి. మగపిల్లలకో పాఠ్యాంశం ఉండాలి మహిళలపై దాడులు అరికట్టాలంటే ముందు పురుషుల్లో మార్పు రావాలి. మహిళలు తమ ఆత్మరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా వేధిస్తున్నారు అంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలి. తల్లిదండ్రులు తమ చిన్నారులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలి. ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేయటంతోపాటు గృహహింస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. అయితే మహిళల సంరక్షణ కోసం మరికొన్ని చర్యలు తీసుకోవచ్చు. నిర్మానుష్య ప్రదేశాల్లోనే ఎక్కువగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేస్తే దాడులు తగ్గుతాయి. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించాలన్న విషయం మగపిల్లల మనస్సు ల్లోకి ఎక్కించేందుకు పాఠ్యాంశాల్లో మహిళల ఔన్నత్యం గురించి తెలియజెప్పే అంశాలను చేరిస్తే బాగుంటుంది. – మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి – కాకోళ్ల నాగరాజు, సాక్షి, మెదక్ -
ఆత్మరక్షణ కోసం దళితులకు ఆయుధాలివ్వాలి
ఒంగోలు ఒన్‌టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, గిరిజనులకు రక్షణ కల్పించలేని దుíస్థితిలో ఉన్నాయని, అందుకే చట్ట ప్రకారం దళిత, గిరిజనుల ఆత్మరక్షణకు ఆయుధాలు ఇస్తే వారిని వారే కాపాడుకుంటారని విప్లవ రచయితల సంఘం నేత జి.కళ్యాణరావు వ్యాఖ్యానించారు. మార్చి 20న సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు దేశంలో ఎస్సీ,ఎస్టీ ప్రజలు జీవించే హక్కుకు అత్యంత ప్రమాదకరమైందని, అట్రాసిటీ చట్టాన్ని చట్టబద్ధంగా చంపేసిందని, ఈ తీర్పుకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మాంచాల్సిన బాధ్యత, చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఓర్సు శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సాయంత్రం సదస్సు నిర్వహించారు. ప్రధాన వక్తగా కళ్యాణరావు హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 11 మంది దళితులు హిందూ మతోన్మాద కాషాయమూకల తూటాలకు బలయ్యారని, వారి పోరాట స్ఫూర్తితో చట్టం మరింత పటిష్టతకు ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని కళ్యాణరావు పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో అమానుష నిచ్చనమెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించిన పూలే, అంబేడ్కర్, పెరియార్ రామస్వామి వంటి మహనీయుల పోరాటం ఫలితంగా వచ్చిన అనేక చట్టాలను పాలకులు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. దళిత వ్యతిరేక మతోన్మాద శక్తులు రాజ్యంలోకి వచ్చి రిజర్వేషన్లు ఎత్తేయాలని, రాజ్యాంగాన్ని సవరించాలని, దాని స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలని కుట్రలు పన్నుతున్నాయని, సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా పీడిత కులాలు ఐక్యంగా ఉద్యమించాలని ప్రభాకర్ పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దుడ్డు విజయ్సుందర్, డాక్టర్ నూకతోటి రవికుమార్, నక్కల వీరాంజనేయులు, పాలడుగు విజయేంద్ర బహుజన్ మాట్లాడారు. సదస్సును దుడ్డు వెంకట్రావు పర్యవేక్షంచారు. -
ఆత్మరక్షణలో తమ్ముళ్లు
* కేంద్ర బడ్జెట్లలో రాష్ట్రానికి అన్యాయం * ప్రశ్నించలేని స్థితిలో టీడీపీ అధినేత * ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్న నేతలు, కార్యకర్తలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : కేంద్ర ప్రభుత్వం తీరుతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రిక్తహస్తం చూపించడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా మెలుగుతున్నా అదనపు ప్రయోజనాలు సాధించలేకపోతోంది. గుంపులో గోవిందా అన్న రీతిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఆంధ్రప్రదేశ్‌ను చూస్తుండటంతో టీడీపీ నేతలు ఖంగుతింటున్నారు. మరోవైపున ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడును సమయం దొరికిన ప్రతీసారీ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అనేక రకాలుగా సహకారం అందిస్తోందని, వెంకయ్య నాయుడు సిఫార్సులతో రాష్ట్రానికి అనేక కొత్త ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వస్తున్నాయంటున్నారు. అవి కార్యరూపం దాల్చకపోవడం, సమయం వచ్చిన ప్రతీసారీ ఝలక్ ఇస్తుండడంతో టీడీపీ నేతలు నిశ్చేష్టులవుతున్నారు. పెరుగుతున్న అసహనం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన, విశాఖ రైల్వేజోన్, కేంద్ర బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సహాయం చేయకపోవడంతో టీడీపీ నేతల్లో అసహనం పెరుగుతోంది. అయితే అధినేత చంద్రబాబు మిత్రపక్షమైన బీజేపీపై ఘాటుగా విమర్శిస్తే అసలుకే మోసం వస్తుందనే భావనతో రాష్ర్ట ‘ప్రయోజనాలు’ను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఖరి, స్థానిక బీజేపీ నాయకుల వైఖరితో విసుగెత్తిన టీడీపీ నేతలకు అధినేత వైఖరి మింగుడు పడడం లేదు. ప్రాజెక్టుల నిర్మాణంపై సందేహాలు రాజధాని నిర్మాణానికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం, రాష్ట్రంలోని జాతీయ ప్రాజెక్టులకు నిధులు పరిమితంగా కేటాయించడంతో వాటి నిర్మాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నారుు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల అభివృద్ధి ముడిపడి ఉంది. రూ.30 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్రం చెబుతున్నప్పటికీ, పరిమిత కేటాయింపుల వలన ఏం సాధించలేని దుస్థితి రాష్ట్రానికి ఏర్పడుతోంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.5 వేల కోట్లు ఈ బడ్జెట్లో కేంద్రం కేటాయించనుందని ఆ పనులు పొందిన నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టులు చేస్తున్న సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయిస్తోంది. ఇప్పటి వరకు చేసిన పనులకు ఆ సంస్థలకు కనీసం రూ.300 కోట్లకుపైగా నగదు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ కేటాయింపులు చూసి ప్రస్తుతం పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలు వాటిని నిలుపుదల చేసే ఆలోచనలో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధిపై అనుమానాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిమ్స్ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)కు మంగళగిరిలో శంకుస్థాపన జరిగిన సమయంలో కేంద్రంలో నిధులు కేటాయిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు. నిర్మాణ పనులన్నింటినీ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఈ సంస్థకు నిధుల కేటాయింపు లేకపోవడంతో రాష్ట్ర అభివృద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విమర్శల వెల్లువ కేంద్రంలోని బీజేపీతో మిత్ర పక్షంగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయకుండా మిన్నకుండిపోవడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓటుకు నోటు కేసు కారణంగా కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయలేక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత బడ్జెట్‌పై స్పందించిన తీరు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా మెతకవైఖరితో కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనే భయం మిగిలిన నేతలను వెంటాడుతోంది. దీనిపై అంతర్గతంగా చర్చ సాగుతోంది. -
గులాబీకి ‘ప్రాణ’ సంకటం!
- కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేదేలా? - ప్రాణహిత -చేవెళ్లపై విపక్షపార్టీల విమర్శనాస్త్రాలు - డిజైన్ మార్పుపై అధికార పార్టీలో అస్పష్టత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు అంశం తెలంగాణ రాష్ట్ర సమితిని ఆత్మరక్షణలో పడేసింది. ఈ ప్రాజెక్టు కుదింపును రాజకీయాస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుండడంతో గులాబీ దళంలో గుబులు మొదలైంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొలేక దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చే సిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటనను కాంగ్రెస్ అందిపుచ్చుకుంటోంది. పాలకపక్షాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలకు పదునుపెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తో డీలా పడ్డ ఆ పార్టీ నాయకత్వం.. తొలిసారి చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుపై సమష్టిగా పోరుబాట పట్టింది. ఓటమి తర్వాత దాదాపు ఇంటికే పరిమితమైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాజె క్టు కుదింపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ప్రాజెక్టు నమూనా మారిస్తే సహించేదిలేదని హెచ్చరించడం ద్వారా రాష్ట్రస్థాయిలో చర్చకు తెరలేచింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలోనూ ఆ పార్టీ మునుపెన్నడులేని విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. డిజైన్ మార్చారా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఒకవైపు సమావేశంలో తీర్మానానికి పట్టుబట్టడం.. మరోవైపు బయట పార్టీ శ్రేణులు జెడ్పీని ముట్టడించడంతో కాంగ్రెస్ వ్యూహం ఫలించిం ది. ప్రాజెక్టుపై తీర్మానానికి ససేమిరా అన్న మంత్రి మహేందర్‌రెడ్డి.. విపక్ష సభ్యులను అరెస్ట్ చేయించారు. ఈ అంశం కూడా తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. అధికారపక్షంలో అస్పష్టత ప్రాణ హిత ప్రాజెక్టుపై అధికారపక్షం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ప్రాజెక్టు నమూనా మార్పుపై ఇప్పటికే పలుమార్లు సీఎం సంకేతాలిచ్చినప్పటికీ, ఈ అంశంపై నోరుమెదిపేందుకు అధికారపార్టీగణం జంకుతోంది. డిజైన్ మార్చారని ఒప్పుకుంటే జనంలోకి వెళ్లలేమని బయపడుతున్న ఆ పార్టీ.. డిజైన్ మార్చలేదని చెప్పేందుకూ సాహసించడంలేదు. గోదావరి జలాలు చేవెళ్ల వరకు రావని కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేసినందున.. ఏ ప్రకటన చేసినా గులాబీ బాస్‌తో చీవాట్లు తప్పవని భావిస్తోంది. ఈ ఇబ్బందే కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ‘తమ సభ్యులను బయటకు పంపాలా? సమావేశం వాయిదా వేయాలా? అనే అంశంపై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్న మహేందర్‌రెడ్డి.. ఒకవేళ ప్రాజెక్టు డిజైన్ మార్చకపోతే ఎందుకు అరెస్ట్ చేయిస్తారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. డిజైన్ మార్చుతున్నారు గనుకే కేటీఆర్ కూడా కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపించాలని సలహా ఇచ్చిఉంటారన్నారు. కాంగ్రెస్ ముప్పేట దాడిని కొనసాగించడంతో డైలమాలో పడిన గులాబీ దళం.. విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నాలు ప్రార ంభించింది. అయితే, ప్రాజెక్టు నమూనాపై స్పష్టత లేకుండా ముందుకెలా సాగాలనే అంశంపై తర్జనభర్జన పడుతోంది. -
నెగడు-20
రచన: ఎం.వి.రమణారెడ్డి దావానలం ఆరిన తరువాత, నిప్పు ఇంకా రగులుతూ ఉన్నప్పుడు, కాలుతున్న మాంసం దాపులకు రావడానికి ఇతర ఏ జంతువూ సాహసించదు. కర్రతో నిప్పును కుళ్లగించడం, కర్రతోనే నిప్పులను వేరుజేయడం, దూరం నుండే మాంసాన్ని దగ్గరికి లాక్కోవడం వంటి నైపుణ్యాలు తన చేతులకున్న కారణంగా, ఉడికిన మాంసాన్ని సమృద్ధిగా సంపాదించుకునే సౌకర్యం దానికి కలిసొచ్చింది. ఆ నరవానరానికి కాలిన మాంసం రుచిగా తగిలుండొచ్చు; కానీ, ఆ మాంసం కోసం అది చేసిన అన్వేషణ కేవలం రుచి కోసం కాదు. అడవిమంట మూలంగా దొరికేది సులువైన సముపార్జన గాబట్టి. కానీ అది నిరవధికంగా దొరికే పదార్థంగాదు. కోరినప్పుడల్లా అడవులు మండుతూ కూర్చోవు. కాబట్టి ఏడాదిలో ఎక్కువభాగం వేటాడకా తప్పదు. పచ్చిమాంసం తినకా తప్పదు. నరవానరానికి ప్రథమంగా నిప్పుతో ఏర్పడిన అవసరం వంటకోసం కాదు; ఆత్మరక్షణ కోసం. ఎంత పెద్దదైనా, ఎంత క్రూరమైనదైనా నిప్పు జోలికి ఏ జంతువూ రాలేదు. అనుభవంతో కలిగిన ఈ పరిజ్ఞానాన్ని ఆత్మరక్షణ అవసరాల కోసం అమలులోకి తీసుకురావడం మాత్రమే అప్పుడు జరిగింది. ఇది ఏడాదిలోనో, రెండేళ్ళలోనో జరిగిన జ్ఞానోదయం కాదు. ఈ కొద్దిపాటి ఆలోచనకు ఎంతలేదన్నా పదిలక్షల సంవత్సరాలు పట్టిందని మనం గుర్తుంచుకోవాలి. అప్పటికి ఆస్ట్రలోపిథికస్, దాని తరువాతి పరిణామదశలు అంతర్థానమై, ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలను ‘హోమో ఎరెక్టస్’ ఆక్రమించింది. అప్పటికింకా అటువంటి జీవి అమెరికా ఖండం చేరుకోలేదు. పరిణామక్రమంలో హోమో ఎరెక్టస్ మనకు దగ్గరి బంధువు కాబట్టి, ఇకమీదట ఆ జీవిని ‘అతడు’, ‘ఆమె’ అనేందుకు అభ్యంతరం ఉండగూడదు.చెత్తాచెదారం కువ్వేసి, చేత్తో విరిగే మండలూ మాకులూ ప్రోగేసి, మంటలు చల్లారిన అడవినుండి కొరివిని తీసుకొచ్చి నెగడు రగిలించడం పెద్ద సమస్యేంగాదు. అయితే, అలాంటి పదార్థాలు గప్పున మండి చప్పున ఆరిపోతాయి. మాటిమాటికీ నిప్పును తెచ్చుకునేందుకు దావానలం రోజూ జరిగే సంఘటన కాదు. కానీ, ఆ మంటల్లో కాలిన లావుపాటి కలపమొద్దులు ఎంతోకాలం ఆరిపోకుండా రగులుతుంటాయే, అలాంటి ఏర్పాటు అతనికి కావలసింది. అడవులకు కొదువలేదు. కర్రకు కరువులేదు. లేనిదల్లా కొమ్మలు నరికే సాధనమే. అప్పుడు కొమ్మలు నరికేందుకు అనువైన పనిముట్టు అవసరమయింది. ఆ ప్రయోజనం కోసం రాయిని ఎలా చెక్కాలో, ఏ సైజు రాయిని ఎన్నుకోవాలో ఆ చిన్న మెదడు ఆలోచించింది. ఫలితంగా రూపొందిన పనిముట్టే రాతిగొడ్డలి. ‘గొడ్డలి’ అనగానే కర్రను దూర్చేందుకు మధ్యలో బెజ్జముండే మనతరం గొడ్డలిని ఊహించుకోలేం. రాయిలో తొర్ర తొలిచే లాఘవం నేర్చేందుకు తిరిగి వేల సంవత్సరాలు పట్టింది. మొదట్లో తయారైన గొడ్డలి చేత్తో పట్టుకుని కొమ్మను నరికేందుకు పనికొచ్చేది మాత్రమే. ఆ తరువాత మరికొంత కాలానికి, కర్రకు రాతిగొడ్డలి కట్టి చేజంపునా కొమ్మ నరికేందుకు అనుకూలమైన తయారీ రంగంలోకొచ్చింది. కర్రకు కట్టడమంటే - కట్టేందుకు తాడులాగా ఉపయోగపడే నార గురించి తెలిసుండాలి. రాయి గుణం, కర్ర గుణం, నిప్పు గుణం, నార గుణం అప్పటిదాకా సాధించిన అదనపు పరిజ్ఞానం. ఆనాటి మనిషికి అవన్నీ అతీంద్రియంగా పుట్టిన ఆలోచనలు కావు. అతీంద్రియంగా పుట్టే ఆలోచనకు వేల సంవత్సరాలూ లక్షల సంవత్సరాలూ అవసరముండదు. కళ్ళతో చూసింది, చెవులతో వినింది, స్పర్శతో గ్రహించింది - ఎంతోకాలంగా ఈ ఇంద్రియాలు అందిస్తున్న సమాచారాన్ని అనుభవాలతో బేరీజు వేసుకోవడం కారణంగా కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. ‘ముందు తరం నుండి గ్రహించడం, తరువాతి తరానికి అందించడం’ అనే స్తన్యజంతువు ప్రాథమిక స్వభావం నరవానర జీవిత విధానాన్ని కొత్తపుంతలు తొక్కించింది. కొరివితో వన్యమృగాలను భయపెట్టడం ఏనాడు తెలిసొచ్చిందో, ఆనాడే మనిషి నివాసం ఆరుబయలు నుండి గుహలోకి మారింది. అంతకుముందు గుహలన్నీ ప్రమాదకరమైన జంతువుల నివాసాలు. హక్కు కోసం జరిగిన పోరాటంలో మానవుడు జయించాడు; క్రూరమృగాలను మారుమూల ప్రాంతాలకు కాందిశీకులను చేశాడు. నిప్పు మూలంగా మానవునికి ఏర్పడిన మొట్టమొదటి ఆస్తి ‘గుహ’. కాబట్టి, మనిషి మనిషిగా ఎదిగేందుకు రాతి పనిముట్టు తొలిమెట్టు కాగా, నిప్పు రెండవమెట్టు. సుమారు ఐదు వేల సంవత్సరాలప్పుడు రాతి పనిముట్టుతో మనిషికి అవసరం తీరిపోయింది గానీ నిప్పుతో అవసరం మాత్రం ఇప్పటికీ తీరలేదు. రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
లఘు చిత్రాలుగా మహిళా సమస్యలు
దృశ్య ఆకృతి మన రక్షణ మన చేతుల్లోనే ఉంది. దేశంలోని ప్రతి పాఠశాలలోనూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ విధానాలను కనుక నేర్పిస్తే, మగవాళ్లలో జంకు బయల్దేరుతుంది. అప్పుడీ అత్యాచార ఘటనలు తగ్గుతాయి’’ అంటున్న అకృతి... ఆకృతి నాగ్‌పాల్! నటి, మోడల్. ఇటీవలి బాలీవుడ్ చిత్రం ‘హాలీడే’లో చిన్న పాత్ర. అయితే ఈ పరిచయం అప్పుడే పాతపడిపోయింది. ఆమె ఇప్పుడు ‘డైలీ రేప్’ అనే లఘు చిత్రాన్ని తీసిన నిర్మాత, దర్శకురాలు! ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ గుజరాతీ అమ్మాయి తన కెరీర్‌ను బాలీవుడ్ చిత్రాలకే పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు. లఘుచిత్ర దర్శకురాలిగా మహిళా సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అనుకుంటున్నారు. ‘డైలీ రేప్’ చిత్రంలో ప్రధానంగా ఆమె దాంపత్య జీవితంలోని లైంగిక హింసను చూపించారు. భర్త తన భార్యను అనుక్షణం మాటలతో, చేతలతో ఎలా వేధించేదీ దాపరికం లేకుండా చిత్రీకరించారు. అలాంటివే మరికొన్ని తియ్యాలని ఆకృతి ఉద్దేశం. ‘‘వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట స్త్రీలపై, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. స్త్రీని మగాడు ఒక ఆటవస్తువుగా చూస్తున్న ధోరణి నానాటికీ ఎక్కువవుతోందే కానీ, తగ్గుముఖం పట్టడం లేదు. ఈ ధోరణిని సున్నితంగా ఎత్తిచూపి సమాజంలో ఆలోచన రేకెత్తించాలన్నదే నా ధ్యేయం’’ అంటున్నారు ఆకృతి. అదే సమయంలో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి స్త్రీ సాధికారత ఎంత కీలకమైనదో ఆమె చెప్పదలచుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో, బాధ్యతలను మోయడంలో స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వెయ్యడం వల్లనే సమాజాభివృద్ధి మందగమనంలో సాగుతోందని ఆకృతి బలంగా నమ్ముతున్నారు. మహిళలు పురుషులకంటే ఏవిధంగానూ, ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన బాలీవుడ్ చిత్రాలు.. మదర్ ఇండియా, మిర్చి మసాలా, దామిని, బాండిట్ క్వీన్, లజ్జ, కహానీల నుంచి స్ఫూర్తి పొందిన ఆకృతి అలాంటి చిత్రాలు విరివిగా రావలసిన అవసరం ఉందని అంటున్నారు. నటి, రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన ఆకృతి కొంతకాలంగా ‘ఇండియా ఫర్ ఉమెన్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచే స్తున్నారు. ఆకృతికి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది! ‘‘మన రక్షణ మన చేతుల్లోనే ఉంది. దేశంలోని ప్రతి పాఠశాలలోనూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ విధానాలను కనుక నేర్పిస్తే, మగవాళ్లలో జంకు బయల్దేరుతుంది. అప్పుడీ అత్యాచార ఘటనలు తగ్గుతాయి’’ అంటున్న ఆకృతి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్దాస్ పాంఛోటియా మనవరాలు. విఠల్దాస్ కొన్ని మూకీ చిత్రాలను కూడా తీశారు. తాతగారి అడుగుజాడల్లో నడుస్తున్న ఆకృతి లఘుచిత్రాల అనంతరం కొంత అనుభవం వచ్చాక మహిళా సమస్యలపై ఒక పెద్ద చిత్రాన్నే తీస్తానంటున్నారు. ఆశయం గొప్పది కనుక ఆమె ప్రయత్నం తప్పక ఫలించి తీరుతుంది. -
కాల్పులకుగ్రీన్ సిగ్నల్
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాల్పులకు డీజీపీ రామానుజం పచ్చ జెండా ఊపారు. నేరాలను అరికట్టే సమయంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయి తే ఈ ప్రతాపాన్ని అమాయక ప్రజలపై చూపరాదని షరతు విధించారు. తుపాకీ కాల్పులపై తమిళనాడు పోలీసుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు పోటీలు నిర్వహించారు. విజేతలకు డీజీపీ రామానుజం శుక్రవారం బహుమతులను అందజేశారు. అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేర పరిశోధనలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరును జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని కోరారు. కాల్పుల పోటీల్లో విజేతలుగా నిలిచివారిని జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. తీవ్రవాదులు, రౌడీషీటర్లను అరెస్ట్‌చేసే సమయంలో వారు తిరగబడిన సందర్భాలు అనే కం ఉన్నాయని గుర్తుచేశారు. ఇటువంటి సమయాల్లో పోలీసు అధికారులు తమ ఆత్మరక్షణ కోసం నేరగాళ్లపై కాల్పులు జరిపితే తప్పులేదని అన్నారు. అయితే తుపాకీ వినియోగంలో తమ నైపుణ్యాన్ని ప్రజల వద్ద ప్రదర్శించరాదని హెచ్చరించారు. కాల్పుల పోటీల్లో విజేతలకు గతంలో రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20వేలు అందజేసేవారని, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలిత ఈ మొత్తాన్ని పదింతలకు పెంచారని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రూ.2.8 కోట్ల మొత్తాన్ని పోలీసులకు పంచిపెట్టారని ఆయన వెల్లడించారు. చాంపియన్‌గా సాయుధ పోలీస్ దళం తుపాకీ కాల్పుల పోటీల్లో రాష్ట్ర సాయుధ పోలీస్ దళం చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుంది. చెన్నై పోలీస్ ద్వితీయ, సెంట్రల్ రిజర్వు పోలీస్ తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. వ్యక్తిగత విజేతలుగా పులియంతోపు సహాయ పోలీస్ కమిషనర్ సుధాకర్ 60 మార్కులతో ప్రథమ స్థానం పొందారు. సీబీసీఐడీ ఎస్పీ అన్బు, దక్షిణ చెన్నై రవాణాశాఖ సహాయ కమిషనర్ దినకరన్, ఈ రోడ్డు ఎస్పీ చక్రవర్తిలు 59 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 210 మంది అధికారులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన 52 మంది అధికారులకు పతకాలు, కప్పులు బహూకరించారు. -
మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని యువతులు, మహిళలకు సబల పథకం కింద ఆత్మరక్షణ అంశంలో శిక్షణ ఇవ్వాలని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎ.ఇ.రాబర్ట్స్ కోరారు. ఎంవీపీ కాలనీలో గల సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన సీడీపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శిక్షణ విషయంలో పోలీసుల సహకారం కూడా ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 15 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గర్భిణులు, బాలింతలకు రోజూ పాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకం మంజూరైన ఏడు కొత్త ప్రాజెక్టుల పరిధిలో పాల నిధుల కోసం త్వరగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించాలని కోరారు. జిల్లాలోని 13 ప్రాజెక్టులకు సొంత భవనాలు మంజూరైనందున సీడీపీఓలు రెవెన్యూశాఖ సహకారంతో స్థల సేకరణ వేగవంతం చేయాలని కోరారు. ఇంకా ఆరు భవనాలకు ప్రతిపాదనలు అందాల్సి ఉందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసినందున అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు. మానసిక వికలాంగులకు ప్రభుత్వం రూ.5 వేలు వంతున నగదు అందజేస్తుందని తెలిపారు. జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గల మానసిక వికలాంగుల వివరాలను తమకు అందజేయాలని కోరారు. సమావేశంలో సంస్థ ఏపీడీ జి.చిన్మయిదేవి, ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ వెంకటేశ్వరి, అర్బన్-2 సీడీపీఓ ఉషారాణి, జిల్లాలోని 23 ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సీఐ మురళి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 2 నుంచి శిక్షణ తరగతులు అల్లిపురం : విశాఖ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మహిళలకు ‘ఆత్మ రక్షణ మెలకువల’పై శిక్షణ ఇవ్వనున్నట్టు నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్ పి.ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే, జూడో, బాక్సింగ్‌ల్లో ప్రావీణ్యం గల శిక్ష కులతో తగిన శిక్షణ, సిటీ ట్రైనింగ్ సెంటర్ బోధన సిబ్బందితో బాలల న్యాయ చట్టం, పోలీస్ వ్యవస్థ తదితర అంశాలపై అవ గాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్వయంగా గానీ, 0891-2712471లోగానీ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. -
యువతులకు 500 టెక్నిక్స్
దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డున కీచకుల అరాచకత్వానికి బలైన నిర్భయ త్యాగం వృధా కాలేదు. ఈ దారుణ ఘటనతో ప్రభుత్వంలోనూ, ప్రజలలోనూ, ముఖ్యంగా యువతలో స్పందన వచ్చింది. అవగాహన పెరిగింది. ఇంకా అవగాహన కలిగించవలసి ఉంది. సమాజంలో గౌరవంగా బతకాల్సిన స్త్రీని సాటి మనిషిగా చూడకపోగా అడ్డొస్తే హతమార్చడం అలవాటై పోయింది. ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ అభయ లాంటి కేసులు నిత్యకృత్యంగా మారాయి. ఇంటా, బయటా ముప్పేట దాడికి గురవుతున్న మహిళ మనగడ సాగించాలంటే ఆత్మరక్ష తప్ప మరోమార్గం లేదని బాలల హక్కుల సంఘం చెబుతోంది. రోడ్‌సైడ్ రోమియోల వేధింపులు భరించలేకపోతున్నారా? ఆటపట్టించేవారి ఆటకట్టించాలనుందా? అసభ్యంగా ప్రవర్తించేవారి పనిపట్టాలనుందా? రోడ్డుపై ఏ దొంగో ఎటాక్ చేస్తాడని భయపడుతున్నారా? మీరు భయపడవలసి అవసరంలేదని బాలల హక్కుల సంఘం భరోసా ఇస్తోంది. మహిళలు ఇక తమను తాము రక్షించుకోవటం ఈజీ అని బాలల హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు.అల్లరిచేసేవారిని ఎలా మట్టికరిపించాలి? - చేయిపట్టి లాగేవాడిని ఎలా కుళ్ళబొడవాలి? హ్యాండ్బాగ్ను, మెడలో గొలుసును లాక్కెళ్లే దొంగల దుమ్ము ఎలా దులిపేయాలి? మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలనేదానిపై బాలల హక్కుల సంఘం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు ఏ ఏటికి ఆఏడు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలపై వేధింపులు రాష్ట్రంలో మామూలైపోయాయి. వరకట్నం, మానసిక వేధింపులు, లైంగిక వేధింపులు, దోపీడి, దొంగతనాలు, కిడ్నాప్‌లకు మహిళలు నిత్యం గురవుతూనే ఉన్నారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులు సైతం పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీతో కలిసి బాలల హక్కుల సంఘం విద్యార్థినులకు స్వీయరక్షణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడి సమయంలో అవతలివ్యక్తిని మట్టికరిపించి తమను తాము కాపాడుకోడానికి 500 టెక్నిక్స్‌ను ప్రదర్శించారు. చిన్న వస్తువులతో ఎలా కాపాడు కోవాలో డ్రిల్ నిర్వహించి చూపించారు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమితో కలిసి స్కూళ్లూ, కాలనీల్లో స్వీయ రక్షణపై ప్రత్యేక కార్యక్రమాన్ని బాలల హక్కుల సంఘం చేపట్టింది. దాడి సమయంలో అవతలివ్యక్తిని మట్టికరిపించి కాపాడుకోడానికి ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించి 500 టెక్నిక్స్‌ను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే కరాటే, థైక్వాండో లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చు కోవాడం ద్వారా రక్షణ మాత్రమే కాకుండా పిల్ల శారీరక దారుడ్యం మెరుగుపడి ఆరోగ్యానికి సైతం మేలుచేస్తుందని నిపుణులు అంటున్నారు. బాలికలు, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించి అవగాహణ కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు, ఇండియన్ మార్షల్ అకాడమి నిర్వాహకుడు నరేందర్ చెప్పారు. మహిళల కోసం బాలల హక్కుల సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయం. -
ఆత్మరక్షణకు యూట్యూబ్ క్లాసులు
నిర్భయ ఘటన తర్వాత మహిళల ఆత్మరక్షణకు సంబంధించి బోలెడు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆత్మరక్షణ తరగతుల పేరుతో పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం కూడా ఎక్కువయ్యాయి. గడచిన ఏడాదిలో విద్యార్థినులకు మార్షల్ఆర్ట్స్ నేర్పే విద్యాలయాల సంఖ్య బాగా పెరిగింది. పాఠశాలలు, కళాశాలలతో పాటు కొన్ని ప్రయివేటు కంపెనీల్లో కూడా మహిళలకు ఆత్మరక్షణ బోధనలు చేయడం మొదలుపెట్టారు. అయితే అందరికీ అలా నేర్చుకోవడం కుదరదు కదా! అలాంటివారు యూట్యూబ్ ద్వారా టిప్స్ తెలుసుకుంటున్నారు. 2013లో అతిఎక్కువగా చూసిన యూట్యూబ్ వీడియోల జాబితాలో సెల్ఫ్‌డిఫెన్స్ వీడియోలే ముందు వరుసలో ఉన్నాయి. గడచిన ఏడాదిలో మన దేశంలో అమ్మాయిలపై జరిగిన లైంగికదాడులే కారణం. చేతిలో పెప్పర్ స్ప్రే, బ్యాగులో కారం పొట్లం మాత్రమే మహిళల్ని రక్షించలేవు. దుండగుల చేతుల నుంచి విడిపించుకుని తమను తాము రక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ కావాలి. కొన్ని ముఖ్యమైన ఫైట్ టెక్నిక్స్ కూడా తెలియాలి. వాటిని యూట్యూబ్ ద్వారా తెలుసుకునే మహిళల సంఖ్య పెరగడం మంచి పరిణామమే. -
ఒక చేత వెన్నముద్ద ఒక చేత యుద్ధవిద్య
నిరుడు ఇదే సమయానికి - ఈ కొయ్యబారిన చలిరోజుల్లో... యావద్దేశం సలసల మరిగిపోతున్న రక్తంతో ‘నిర్భయ’ కోసం నినదిస్తూ ఉంది. ఆమె బతకాలని క్షణం విరామం లేకుండా ప్రార్థిస్తూనే ఉంది! ఇప్పుడు నిర్భయ లేదు. నిర్భయ చట్టం ఉంది. చట్టం ఉంది. కానీ నిశ్చింత లేదు! రోజూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక ఘటన! పార్లమెంటు చట్టం చేస్తుంది కానీ... పాఠశాల వరకూ తోడు రాలేదు. పోలీస్స్టేషన్లు ఉంటాయి కానీ... ఆఫీస్‌లో పక్కనే వచ్చి కూర్చోవు. ఎలా మరి? చదువు కోసం, కొలువుల కోసం ఆడపిల్లలు బయటికి వెళ్లిరావడం ఎలా? ఏ కవచాలు వారిని కాపాడతాయి? కవచాలు అక్కర్లేదు... కరములు చాలు అంటోంది బాలల హక్కుల సంఘం. అనడం మాత్రమే కాదు... స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతోంది. అంతకన్నా ముందు... ధైర్యమే మీ తొలి ఆయుధం అని నూరిపోస్తోంది. కనీసం వెయ్యి విద్యాలయాలలో బాలికలకు, యువతులకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచాలని కంకణం కట్టుకున్న ఈ హక్కుల సంఘం బృహత్తర ప్రయత్నమే ఈవారం ‘జనహితం’. ఆడపిల్ల బయటకు వెళితే తిరిగి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు భయంభయంగా ఎదురుచూసే రోజులివి. వారి భయం ‘ఆమె’ను మరింత బలహీనురాలిగా మారుస్తుంది. అదే ఆత్మరక్షణ విద్య నేర్పితే ‘ఆమె’ ధైర్యంగా ఎదుగుతుంది. ఇంటిల్లిపాదీ నిబ్బరంగా ఉంటారు. ఈ ఆలోచన తో రాష్ట్ర బాలల హక్కుల సంఘం ‘అమ్మాయిలకు ఆత్మరక్షణ’ పద్ధతులను నేర్పిస్తోంది. ఇందుకు గాను ఐఎమ్ఎఫ్ కరాటే మాస్టర్ నరేందర్‌తో కలిసి 1000 స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లోని అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ‘ప్రతి అమ్మాయి బాల్యం నుండే తనను తాను రక్షించుకోవడం ఎలా అన్నది తల్లి చిన్ననాటినుంచే నేర్పించాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం, ఆత్మరక్షణ విద్యలను సాధన చేయించాలి. ఎవరైనా తమపై దాడి జరపగలరన్న అనుమానం వచ్చిన వెంటనే అలెర్ట్ అవగలిగే అవగాహన వారిలో పెంచాలి. తమ దగ్గర ఉండే సాధారణమైన సాధనాలతోనే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి..’ అంటూ ఈ సూచనలు చేస్తున్నారు నిర్వాహకులు. ఆత్మరక్షణ పద్ధతుల్లో చెప్పే ప్రధాన అంశాలు మార్షల్ ఆర్ట్స్ అనేది చిట్టచివరి అధ్యాయం. ముందు కనీస జాగ్రత్తలు అమ్మాయిలు తీసుకోవడం అవసరం. పెద్దలూ వారికి ఇవి సూచించాలి... ఇంట్లో నుంచి అమ్మాయి బయటకెళ్లేటప్పుడు వెంట మొబైల్ తీసుకెళ్లాలి. అందులో ఇంటి నెంబర్లు, పోలీసుస్టేషన్ నెంబర్లు ఉంచుకోవాలి, అమ్మాయిలు చాలావరకు రోడ్లపై మొబైల్లో స్నేహితులతో చాటింగ్ చేస్తూ, కబుర్లు చెబుతూ వెళుతుంటారు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా దాడికి గురిచేసే అవకాశం ఉండవచ్చు. అందుకని రోడ్లమీద ఫోన్ కబుర్లకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు నలుగురితో కలిసి ఉండాలి. వెంట విజిల్ తీసుకువెళ్లడం, కీ చెయిన్‌కు ఒక చిన్న కత్తిలాంటివి తగిలించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగంతకులు తమ నోరు మూస్తే వారి చేతి పైన పిన్‌తో గాని, కీతో గాని గుచ్చడం... వంటివి చే సి దాడి నుంచి తప్పించుకోవచ్చు. కొందరు బస్సులలో, రద్దీగా ఉండే ప్రాంతాలలో శరీర భాగాలను తగులుతుంటారు. అలాంటప్పుడు తమ వెంట ఉండే వస్తువులతో ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కవచ్చో తెలుసుకోవచ్చు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. కరాటే నేర్చుకున్న అమ్మాయిలు కూడా కొంత అమాయకంగా ఆలోచిస్తుంటారు. తమపై దాడి చేసిన వారిని గట్టిగా కొడితే చచ్చిపోతారేమో అని భయపడుతుంటారు లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వెనుకంజ వేస్తుంటారు. రోడ్డు మీద ఎవరైనా తమపై దాడికి దిగినప్పుడు వారిని తరమవచ్చు అని ‘నిర్భయ చట్టం’ చెబుతోంది. ఆడపిల్లలు చిన్నప్పటినుంచే ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ పట్ల అవగాహన పెంచుకోవాలి. టీచర్లు, దగ్గరి బంధువులు మెచ్చుకోలు కోసం భుజాలు తట్టడం, నొక్కడం చేస్తుంటారు. వీటిలో ఆ ‘టచ్’ పట్ల ఆలోచన చేసే జ్ఞానం అలవర్చుకోవాలి. ‘తేడా’గా అనిపిస్తే ప్రిన్సిపాల్‌కు చెప్పడం లేదా నలుగురిలో నిలదీయడం, ఇంట్లో వారికి చెప్పడం చేయాలి. లేదంటే వారు మరింత చనువు తీసుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లల శారీరక అవయవాల గురించి చెబుతూ వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటప్పుడు ఆడపిల్లలు సిగ్గుపడుతూ గుంభనంగా ఉండిపోకూడదు. ఇలాంటివి ప్రోత్సహిస్తే సదరు వ్యక్తి మరింత అడ్వాన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారి గురించి నలుగురికీ తెలియజేయడం అవసరం. ఆగంతకులు ఎవరైనా వెనక నుంచి పట్టుకుంటే ముఖంపై కొట్టాలి, ముక్కుపై గుద్దాలి, విడిపించుకునే క్రమంలో ఎలా ఉండాలో కనీస అవగాహన పెంపొందించాలి. నెగిటివ్, పాజిటివ్ అంశాలకు తేడా తెలుసుకోవాలి. నిలదీసే ధైర్యం పెంచుకోవాలి. చదువుతోపాటు చిన్ననాటి నుంచి అబ్బాయిలకూ సంస్కారం నేర్పాలి. ఈ ముందు జాగ్రత్తలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలకు ఎంతవరకు అవసరమో తెలియజేస్తూ వారిలో అవగాహన కల్పిస్తుంది ఈ కార్యక్రమం. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివమల్లాల భయం పోయింది కరాటే నేర్చుకోకముందు ఓ సారి బస్‌లో నా మెడలో చైన్‌ను లాగారెవరో! ఆ సమయంలో అరవడానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. కొన్ని రోజుల వరకు ఆ భయం పోలేదు. ఆ సంఘటన తర్వాత కరాటే నేర్చుకున్నాను. కిందటేడాది కాలేజీ నుంచి వస్తుంటే దారిలో ఆగంతుకులు దాడి చేయబోయారు. వారిని ధైర్యంగా ఎదుర్కోగలిగాను. - పి.శాలిని, కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత -
ఆడపిల్ల ఆత్మ రక్షణకు కరాటే అవసరమే
పుల్కల్, న్యూస్‌లైన్ : ఆత్మరక్షణకు ఆడపిల్లలకు కరాటే అవసరమంటున్నాడు మండలంలోని వెంకటకిష్టాపూర్ గ్రామానికి చెందిన కొండ్రేపల్లి రమేష్. తనకు మార్షల్ ఆర్ట్స్ అంటే అతనికి ప్రాణమని, ఇష్టంగా కష్టపడి నేర్చుకుని మాస్టర్ అయినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఎంసీజే చేస్తూ తాను నేర్చుకున్న విద్యను పది మందికి నేర్పుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ర మేష్. 2007వ సంవత్సరంలో వెంకటకిష్టాపూర్లో ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్‌ఫూ లయన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించిన రమేష్.. 2010లో బ్లాక్ బెల్ట్ పొందాడు. 2011వ సంవత్సరంలో మల్కాజిగిరి సికింద్రాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియన్ టోర్నమెంట్లో బెస్ట్ ఇన్స్‌ఫెయిర్ అవార్డు పొందాడు. 2012లో సికింద్రాబాద్‌లో జరిగిన స్టేట్ లెవల్ టైగర్ కుంగ్‌ఫూలో కటాస్ అవార్డు సాధించాడు. 2013లో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డిగ్రీ అందుకున్నాడు. ఇలా అతను మార్షల్ ఆర్ట్స్‌లో ఓ వైపు విజయాలు సాధించుకుంటు మరోవైపు పేద పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం సిద్దిపేటలో ఎంసీజే చదువుతూ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. అందులో పేద విద్యార్థులు, ఆడ పిల్లలకు ఉచితంగానే కరాటే నేర్పుతున్నాడు. ఇటీవల తన సొంత గ్రామంలో తన వద్ద కరాటే నేర్చుకున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి జోగిపేట సీఐ సైదానాయక్ చేతుల మీదుగా వివిధ విభాగాల్లో బెల్టులను అందించారు.