కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివేగం టీజర్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఫారిన్ లోకేషన్లలో భారీ యాక్షన్స్ సీన్స్తో రూపొందించిన టీజర్ అభిమానులను అలరిస్తోంది.