సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బైలింగ్యువల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు సూపర్ స్టార్. అందుకే తమిళ నాట కూడా భారీ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాడు.
అయితే మహేష్ జోరుకు అజిత్ బ్రేక్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అజిత్ ప్రస్తుతం మాస్ స్పెషలిస్ట్ శివ దర్శకత్వంలో వివేగం అనే యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమాను కూడా ఆగస్టు 11నే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.
స్పైడర్ సినిమా రిలీజ్ సమయంలోనే అజిత్ సినిమాకు రిలీజ్ అయితే కోలీవుడ్ మహేష్ బాబు సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. కోలీవుడ్ లో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా.. మహేష్ బాబు సినిమాకు థియేటర్లు కూడా భారీ స్థాయిలో లభించకపోవచ్చని భావిస్తున్నారు. మరి నిజంగానే ఈరెండు భారీ చిత్రాలు పోటి పడతాయా..? లేక సర్థుకుపోయి డేట్లు మార్చుకుంటారా..? చూడాలి.