సూపర్ స్టార్కు సైడ్ ఇచ్చాడు | Mahesh, Murugadoss Film Has No Competition | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్కు సైడ్ ఇచ్చాడు

Published Sat, Mar 4 2017 10:16 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

సూపర్ స్టార్కు సైడ్ ఇచ్చాడు

సూపర్ స్టార్కు సైడ్ ఇచ్చాడు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు మురుగదాస్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి సూపర్ స్టార్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మహేష్ సినిమా రిలీజ్ అవుతున్న జూన్ 23నే కోలీవుడ్ టాప్ హీరో అజిత్ మూవీ, వివేగంను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది చిత్రయూనిట్. అదే జరిగితే కోలీవుడ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్న మహేష్, మురుగదాస్ల సినిమాకు కష్టాలు తప్పవు.

అయితే వివేగం టీం తాజా ప్రకటనతో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వివేగం సినిమాను ముందుగా అనుకున్నట్టుగా జూన్ 23న కాకుండా ఆగస్ట్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో పోస్ట్ ప్రొడక్షన్కు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు గ్యాప్ దొరికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement