Ajith Kumar Vivegam hits Youtube Records in First Week - Sakshi
Sakshi News home page

Published Tue, Jun 26 2018 10:34 AM | Last Updated on Tue, Jun 26 2018 12:11 PM

Ajith Kumar Vivegam Youtube Record - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల అజిత్‌ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం వివేగం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. దాదాపు 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ నిరాశపరచటంతో డిజాస్టర్ల జాబితాలో చేరింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవల వివేగం సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ వీర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను తొలివారంలో ఏకంగా 2.6 కోట్ల మంది యూట్యూబ్‌లో చూశారు.

గతంలో ఏ దక్షణాది చిత్రానికి తొలి వారంలో ఈ స్థాయిలో వ్యూస్‌ దక్కలేదు. అయితే తెలుగు సినిమాను కూడా ఉత్తరాది ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన రేసు గుర్రం, దువ్వాడ జగన్నాథమ్‌ చిత్రాలు అత్యధిక వ్యూస్‌ సాధించిన సినిమాల లిస్ట్‌లో నిలిచాయి. అందుకే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్లుగా తెరకెక్కిన దక్షిణాది చిత్రాల హిందీ డబ్బింగ్‌ రైట్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement