youtube views
-
100 మిలియన్ వ్యూస్ వచ్చిన ఈ పాటను చూశారా?
సంగీతానికి భాషతో సంబంధం లేదు. హృదయాన్ని హత్తుకునే పాటలను ఎవరు స్వరపరిచినా అది విశ్వవ్యాప్తం అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో సంగీత దర్శకులు, గాయకులు నిరూపించారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది) 'ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే...బీరాజ్పేట దొందుగేయే మణినంకరే...' ఇవి మలయాళీలకు బాగా తెలిసిన పదాలు వీటిని ఒకపాటగా చేర్చి ప్రపంచాన్నే మెప్పించారు. ఈ సంప్రదాయ జానపద పాట విన్నప్పుడల్లా ఆ రిథమ్‌తో వారు కదులుతారు. రీసెంట్గా ఈ జానపద పాటను మళ్లీ 'అజగజాంతరం' అనే ఓ మలయాళీ సినిమాలో విన్నాం. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్‌లో 'ఒల్లుల్లేరు' 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఏడాది క్రితం వచ్చిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసిందనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్ ఖాన్) ఈ మధ్య కాలంలో ఏ మలయాళ పాటలు సాధించలేని ఘనత దీనికి దక్కింది. జస్టిన్ వర్గీస్ సంగీతం అందించగా ప్రసీత చాలకుడి అనే సింగర్ అద్భుతంగా పాడింది. ఆమె జానపద గీతాల కళాకారిణి కావడంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే సంగీత ప్రియుల్ని ఈ పాట ఉర్రూతలు ఊగిస్తుంది. అక్కడ ఏ వేడుక జరిగినా ఈ పాట ఉండి తీరాల్సిందే. -
10 రోజులు.. 5 కోట్లు.. యూట్యూబ్ మొత్తం షేక్..!
కోలీవుడ్ స్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. టాలీవుడ్లో ఈ చిత్రాన్ని 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'రంజితమే' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్‌ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది. (చదవండి: 'వారీసు' బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ అవుట్) ఈ మాస్ సాంగ్ విడుదలై పది రోజులవుతోన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకు ఈ పాటకు ఆదరణ మరింత పెరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటిదాకా 5 కోట్ల వీక్షణలు, 18 లక్షల లైక్స్ సొంతం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. The sensational #Ranjithame hits 50M views 🔥 📽️ https://t.co/Q56reRe9tc 🎵 https://t.co/gYr0tkVJkD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #RanjithameSong #Varisu #VarisuPongal pic.twitter.com/l8ElaoR20h — Sri Venkateswara Creations (@SVC_official) November 16, 2022 -
ఆమె నాట్యం... మూడుకోట్ల వ్యూస్
సాధారణంగా ఏడు పదులకు పైబడిన వయసులో చకచకా నడవడమే గొప్ప. అలాంటిది నాట్యం చేస్తే ఎలా ఉంటుంది? అదీ చీరకట్టులో... షీమా కిర్మానీ అయితే అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. ఇటీవల ఆమె నాట్యం చేస్తూ విడుదల చేసిన ‘పసూరి’ వీడియో యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది. ఇప్పటి దాకా దాదాపు మూడు కోట్లమంది ఈ వీడియోను చూశారు. పాకిస్థాన్ లో బాగా పాపులర్ అయిన మ్యూజిక్ టీవీ సీరీస్– 14లో భాగంగా ఈ వీడియోను విడుదల చేశారు. గత నలభై ఏళ్లుగా సంప్రదాయ చీరకట్టులోనే నాట్యం చేస్తూ పాకిస్థానీ మహిళల స్వేచ్ఛ, హక్కుల కోసం పోరాడుతున్నారామె. రావల్పిండిలోని ఓ బ్రిగేడియర్ కుటుంబంలో పుట్టి పెరిగిన షీమా కిర్మానీకి చిన్న వయసునుంచే నాట్యం మీద ఎనలేని మక్కువ. షీమా తల్లి హైదరాబాద్‌కు చెందిన వారు. ఆమె ఎక్కువగా చీరనే ధరించేవారు. చిన్నప్పటినుంచి ఆమె చీరకట్టు చూస్తూ పెరిగిన షీమా తను కూడా చీర కట్టుకోవడానికి ప్రయత్నించేది. దేశ విభజన జరగడంతో.. కుటుంబం రావల్పిండికి మారింది. అయినప్పటికీ ప్రతి వేసవికాలం సెలవులకు ఇండియా వచ్చేది. దీంతో ఆమెకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి ఏర్పడింది. ఈ ఆసక్తితో స్కూలు చదువు పూర్తయ్యాక, లండన్ లో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తిచేసింది. లండన్ లో ఉన్నప్పుడు అక్కడి మహిళలకు ఉన్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఆమెను ఎంతగానో ఆకర్షించాయి. ఇతర ప్రపంచ దేశాల్లో ఎక్కడాలేని నిబంధనలు పాకిస్థాన్ లోనే ఉండడం తనకి నచ్చలేదు. దీంతో 1979లో ‘తెహ్రీక్–ఇ–నిస్వాన్ ’ అనే స్త్రీవాద గ్రూపును ప్రారంభించి, మహిళల కనీస హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టింది. ఔరత్ మార్చ్... ఎనభయ్యవ దశకంలో ఢిల్లీ వచ్చిన షీమా.. భరతనాట్యం, ఒడిస్సీలలో శిక్షణ తీసుకుంది. శిక్షణ పూర్తయిన తరువాత కరాచీకి తిరిగి వెళ్లింది. కానీ అప్పుడు జనరల్‌గా పనిచేస్తోన్న జియా ఉల్హక్.. పాకిస్థాన్ లో అంతా ఇస్లాంనే అనుసరించేలా సరికొత్త నిబంధనలు తీసుకొచ్చారు. భారతీయ స్త్రీలు ధరించే చీరలను అక్కడ ధరించకూడదని నిషేధం విధించారు. నాట్యం చేయడానికి కూడా అనుమతి లేదు. అప్పుడే శాస్త్రీయ నృత్యకారిణిగా పట్టభద్రురాలైన షీమాకు ఆ నిబంధనలు అస్సలు మింగుడు పడలేదు. తన భావాలను వ్యక్తం చేయడానికి నాట్యం మంచి సాధనమని భావించిన షీమా అక్కడి నిబంధనలకు విరుద్ధంగా చీరకట్టుకుని నాట్యం చేసేది. ఇందులో భాగంగానే ‘ఔరత్ మార్చ్’ పేరిట ప్రదర్శనలు ఇస్తూ మహిళల హక్కుల గురించి గొంతెత్తి చెబుతోంది. ప్రతి సంవత్సరం ఉమెన్ ్సడేకు ఔరత్ మార్చ్‌ను నిర్వహిస్తూ సమాన హక్కుల కోసం పోరాడుతోంది. 2017లో ప్రముఖ లాల్ షహబాజ్ క్వాలందర్ మందిరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అనేకమంది చనిపోయారు. అప్పుడు దానికి నిరసనగా షీమా తన తెహ్రీక్ గ్రూపుతో కలిసి ఆ మందిరం వద్దకు చేరుకుని ‘ధమాల్’ను ప్రదర్శించింది. ధమాల్ అనేది ఒకరకమైన నృత్యం. దీనిని దర్గాలలో సూఫీ సాధువులు వారి ఆరాధనలో భాగంగా చేస్తారు. ధమాల్‌ను ప్రదర్శించి అప్పుడు కూడా వార్తలో నిలిచింది. గత నలభై ఏళ్లుగా డ్యాన్ ్స చే స్తూనే మహిళా హక్కుల కోసం పోరాడుతోంది. ఎంతోమంది అధికారుల ఆగ్రహానికి లోనైనప్పటికీ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. అంతేగాక ఎంతోమంది విద్యార్థులకు నాట్యం నేర్పిస్తూ వారిలో అవగాహన కల్పిస్తోంది. సంకల్పం ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చనడానికి ఉదాహరణగా నిలుస్తోంది షీమా. -
స్నేక్ అటెంప్ట్ మర్డర్ అంటే ఇదేనేమో?
A Person Runs At Top Speed After Being Startled By Snake: పాములు పగబట్టి చంపేస్తేయంటూ కథలు కథలుగా... మనం చిన్పప్పుడు వింటుండే వాళ్లం. మహా అయితే సినిమాల్లో చూసి ఉంటాం. నిజంగా అయితే ఎవ్వరికీ పెద్దగా తెలియదు. పైగా మనం అవన్నీ ఉత్తుత్తి మాటలేనని, మూడనమ్మకాలని కొట్టి పారేస్తాం కూడా. కానీ నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూశాక నమ్మకుండా ఉండలేం. ఇంతకీ ఆ కథ ఏంటో చూసేద్దాం... పాములును చూస్తేనే ఒక రకమైన భయంతోపాటు శరీరం ఒక రకమైన గగ్గురపాటుకు గురవుతోంది. అలాంటిది ఒక పాము టేబుల్ పక్కన దాక్కుని మరి వెంటపడి దాడి చేస్తే పై ప్రాణాలు పైకే పోతాయి. ఊహిస్తేనే భయంగా అనిపిస్తోంది కదా. సరిగ్గా అలాంటి ఘటనే థాయ్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది. థాయ్‌ల్యాండ్‌లోని ఒక ఇంటిలోని మేడ పై చక్కటి డైనింగ్ టేబుల్ రెండు కుర్చిలతో చాలా పరిశుభ్రంగా అందంగా అలకరించి ఉంది. (చదవండి: "ఇది మా తప్పిదమే" ) ఈ క్రమంలో ఎరుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి టేబుల్ దగ్గరకి వచ్చి టేబుల్ మీద ఉన్న వాటిని సర్థుతుంటాడు ఇంతలో ఒక పాము హఠాత్తుగా అతని మీదకు ఉరుకుతుంది. దీంతో సదరు వ్యక్తి వెంటనే అప్రమత్తమై పరుగెడతాడు. అయినా సరే పాము మాత్రం ఆ వ్యక్తిని వదలకుండా చాలా కోపంగా వెంబడిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు... పాములు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయని ఒకరు, అన్నా ఏం చేశావు అంతలా పాము నిన్ను పగబెట్టిందేంటి ? అంటూ రకరకాల కామెంట్లతో ట్వీట్ చేస్తున్నారు. (చదవండి: 1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..) -
ఆల్ ఇండియా రికార్డ్ సెట్ చేసిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు కేరళలో కూడా బన్నీకి అభిమానం గణం ఉంది. అల్లు అర్జున్ సినిమాలకి మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో బన్ని సినిమాలు అన్ని కూడా ఈ రెండు భాషలలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి. తెలుగులో ఏవరేజ్ అయినా సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంటాయి. ఇక కొన్ని ప్రొడక్షన్ సంస్థలు బన్నీ ప్రతి సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్ యుట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అనలిస్ట్ కమల్‌నాథ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.(ఆటపాటల పుష్ప) Stylish Star @alluarjun film #Sarrainodu (Hindi dubbed version) becomes the FIRST INDIAN FILM to reach 300 Million+ views on @youtubeindia#AlluArjun#300MViewsForSarrainoduHindi pic.twitter.com/v6TaqWns5m — Komal Nahta (@KomalNahta) July 15, 2020 2016లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. మరో హీరో ఆదిపిని శెట్టి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.(బన్నీని ఒక్క ఛాన్స్ అడిగిన బాలీవుడ్ డైరెక్టర్) -
సామజవరగమన @ 100 మిలియన్స్
‘సామజవరగమన... నిను చూసి ఆగగలనా..’ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ‘అల వైకుంఠపురము’లోని ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ‘సామజ వరగమన’ పాట బాగా వైరల్ అయింది. ‘‘ఈ పాట యూట్యూబ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. సౌతిండియాలో ఒక పాటకు 100 మిలియన్ వ్యూస్ రావడం ఇదే తొలిసారి’’ అని చిత్రబృందం తెలిపింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. -
ఫ్లాప్ సినిమా.. యూట్యూబ్ రికార్డ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం వివేగం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. దాదాపు 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ నిరాశపరచటంతో డిజాస్టర్ల జాబితాలో చేరింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవల వివేగం సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ వీర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమాను తొలివారంలో ఏకంగా 2.6 కోట్ల మంది యూట్యూబ్‌లో చూశారు. గతంలో ఏ దక్షణాది చిత్రానికి తొలి వారంలో ఈ స్థాయిలో వ్యూస్ దక్కలేదు. అయితే తెలుగు సినిమాను కూడా ఉత్తరాది ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసు గుర్రం, దువ్వాడ జగన్నాథమ్ చిత్రాలు అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల లిస్ట్‌లో నిలిచాయి. అందుకే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కిన దక్షిణాది చిత్రాల హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. -
బన్నీ ఖాతాలో భారీ రికార్డ్
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిజె దువ్వాడ జగన్నాథమ్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటింది. బన్నీ కెరీర్లో మరో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ఆన్లైన్లో సంచలనాలు సృష్టిస్తోంది. గోల్డ్ మైన్స్ టెలీఫిలింస్ యూట్యూబ్ చానల్లో ఉన్న డిజె హిందీ డబ్బింగ్ సినిమా 71 రోజుల్లో ఏకంగా పది కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. బన్నీ బ్రహ్మాణుడిగా నటించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా అలరించింది. విలక్షణ నటుడు రావూ రమేష్ విలన్ గా నటించాడు. 50 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగులో వందకోట్లకు పైగా వసూళ్లు సాదించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. తాజాగా హిందీ వర్షన్ పది కోట్లకు పైగా వ్యూస్ సాధించటంపై స్పందించిన చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. Thank U All 🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/nbWrBdoLGP — Harish Shankar .S (@harish2you) 30 January 2018 -
పవన్ టీజర్ : తెలుగులో టాప్, సౌత్‌లో సెకండ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ ను తిరగరాస్తోంది. ఇప్పటికే తెలుగుతో అతి తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా, అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా అజ్ఞాతవాసి రికార్డ్ సృష్టించింది. తాజాగా దక్షిణాదిలోనూ పవన్ సినిమా టీజర్ జోరు కనిపిస్తోంది. ఈ టీజర్ సౌత్ ఇండియాలో 24 గంటల్లో అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. విజయ్ హీరోగా నటించిన మెర్సల్ టీజర్ కు అత్యధికంగా ఏడు లక్షల నలబై వేలకు పైగా లైక్ లు రాగా అజ్ఞాతవాసి టీజర్ నాలుగు లక్షలకుపైగా లైకుల వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇదే రికార్డ్ కాగా.. దక్షిణాదిలో మాత్రం సెకండ్ ప్లేస్ సాధించింది. అజ్ఞాతవాసి తరువాతి స్థానాల్లో సూర్య తాన సేరంద కూటం, అజిత్ వివేగం, రజనీ కబాలి టీజర్లు ఉన్నాయి. -
యూట్యూబ్ వ్యూస్ లో బాహుబలి 2 రికార్డ్
భారతీయ సినిమా చరిత్రలోని అన్ని రికార్డ్ లను తిరగరాసిన తెలుగు సినిమా బాహుబలి 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాహుబలి 2 సంచలన విజయం సాధించటమే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన బాహుబలి 2, 2017 యూట్యూబ్ లోనూ రికార్డ్ సృష్టించింది. 2017లో అత్యధిక మంది వీక్షించిన సినిమా ట్రైలర్ల జాబితాలో బాహుబలి 2 సినిమా రెండో స్థానంలో నిలిచింది. 9 కోట్ల 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించి హాలీవుడ్ సినిమా అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ తొలి స్థానంలో నిలవగా 8 కోట్లకుపైగా వ్యూస్ తో బాహుబలి 2 ట్రైలర్ రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు ఇన్ క్రెడిబుల్స్ 2, థోర్ : రాగ్నరాక్ బాహుబలి 2 తరువాతి స్థానాల్లో నిలవగా బాలీవుడ్ సినిమాలు టైగర్ జిందాహై, పద్మావతి చిత్రాల ట్రైలర్లు 5 కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి. -
'బాహుబలి దెబ్బకు ఆత్మహత్య చేసుకుంటారేమో'
ఎప్పుడూ ఎవరినో ఒకర్ని టార్గెట్ చేసి వివాదాస్పద ట్వీట్లు చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పీడు పెంచాడు. గురువారం బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన నేపథ్యంలో మరోసారి తన ట్వీట్లకు పని చెప్పాడు. ముందుగా ఈ ట్రైలర్‌ను ఆకాశానికి ఎత్తేసిన వర్మ, రాజమౌళితో పాటు ఇతర యూనిట్ సభ్యులపై ప్రశంసల వర్షం కరిపించాడు. అదే సమయంలో టాలీవుడ్ టాప్ స్టార్లను టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్లో విమర్శలు చేశాడు. తాజాగా బాహుబలి 2 ట్రైలర్ 50 మిలియన్ల( 5 కోట్ల) వ్యూస్ సాధించిన సందర్భంగా 'ఈ ఫిగర్‌ని చూసి టాలీవుడ్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో అని భయంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు. గురువారం ఉదయం రిలీజ్ చేసిన బాహుబలి ట్రైలర్ 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించింది. ఈ ఘనత సాదించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావటం విశేషం. ఇప్పటికే బాహుబలి రెండో భాగం మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలు మరింత పెంచేందుకు యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అందుకే రెండో భాగం రిలీజ్‌కు వారం రోజుల ముందు బాహుబలి తొలి భాగాన్ని మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల వరకు కలెక్షన్లు సాధించిన బాహుబలి రీ రిలీజ్లో మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. Ee figureni choosi Tollywood lo yenthamandhi aatma hatya chesukuntaro ani bhayamgaa vundhi😟 pic.twitter.com/PVa3owezUh — Ram Gopal Varma (@RGVzoomin) 17 March 2017