సంగీతానికి భాషతో సంబంధం లేదు. హృదయాన్ని హత్తుకునే పాటలను ఎవరు స్వరపరిచినా అది విశ్వవ్యాప్తం అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో సంగీత దర్శకులు, గాయకులు నిరూపించారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది)
'ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే...బీరాజ్పేట దొందుగేయే మణినంకరే...' ఇవి మలయాళీలకు బాగా తెలిసిన పదాలు వీటిని ఒకపాటగా చేర్చి ప్రపంచాన్నే మెప్పించారు. ఈ సంప్రదాయ జానపద పాట విన్నప్పుడల్లా ఆ రిథమ్‌తో వారు కదులుతారు. రీసెంట్గా ఈ జానపద పాటను మళ్లీ 'అజగజాంతరం' అనే ఓ మలయాళీ సినిమాలో విన్నాం.
తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్‌లో 'ఒల్లుల్లేరు' 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఏడాది క్రితం వచ్చిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసిందనే చెప్పవచ్చు.
(ఇదీ చదవండి: కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్ ఖాన్)
ఈ మధ్య కాలంలో ఏ మలయాళ పాటలు సాధించలేని ఘనత దీనికి దక్కింది. జస్టిన్ వర్గీస్ సంగీతం అందించగా ప్రసీత చాలకుడి అనే సింగర్ అద్భుతంగా పాడింది. ఆమె జానపద గీతాల కళాకారిణి కావడంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే సంగీత ప్రియుల్ని ఈ పాట ఉర్రూతలు ఊగిస్తుంది. అక్కడ ఏ వేడుక జరిగినా ఈ పాట ఉండి తీరాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment