బన్నీ ఖాతాలో భారీ రికార్డ్‌ | Allu Arjun DJ Hindi Dub Version Hits 100 Million Views | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 30 2018 12:18 PM | Last Updated on Tue, Jan 30 2018 12:18 PM

Dj Duvvada Jagannadam Youtube Views record - Sakshi

యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌ సాధించిన డిజె (హిందీ) సినిమా

అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిజె దువ్వాడ జగన్నాథమ్‌. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటింది. బన్నీ కెరీర్‌లో మరో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ఆన్‌లైన్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. గోల్డ్‌ మైన్స్ టెలీఫిలింస్‌ యూట్యూబ్‌ చానల్‌లో ఉన్న డిజె హిందీ డబ్బింగ్‌ సినిమా 71 రోజుల్లో ఏకంగా పది కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది.

బన్నీ బ్రహ్మాణుడిగా నటించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌ గా అలరించింది. విలక్షణ నటుడు రావూ రమేష్‌ విలన్‌ గా నటించాడు. 50 కోట్ల బడ్జెట్‌ తో దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగులో వందకోట్లకు పైగా వసూళ్లు సాదించినట్టుగా చిత్రయూనిట్‌ వెల్లడించారు. తాజాగా హిందీ వర్షన్‌ పది కోట్లకు పైగా వ్యూస్‌ సాధించటంపై స్పందించిన చిత్ర దర్శకుడు హరీష్ శంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement