టెంపర్‌తో లక్‌ వర్కౌవుట్‌ అవుతుందా? | Will the Luck Workout ? | Sakshi
Sakshi News home page

టెంపర్‌తో లక్‌ వర్కౌవుట్‌ అవుతుందా?

Published Mon, May 22 2017 2:44 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

టెంపర్‌తో లక్‌ వర్కౌవుట్‌ అవుతుందా? - Sakshi

టెంపర్‌తో లక్‌ వర్కౌవుట్‌ అవుతుందా?

కోలీవుడ్‌లో మార్కెట్‌ ఖాళీ అనుకున్న సమయంలో నటుడు అజిత్‌తో వివేగం చిత్రంలో జత కట్టే అవకాశం నటి కాజల్‌ అగర్వాల్‌ను మరోసారి లైమ్‌టైమ్‌లోకి తీసుకొచ్చింది. ఆ తరువాత మరో స్టార్‌ హీరో విజయ్‌తో ఆయన 61వ చిత్రంలో నటించే అవకాశం తలుపుతట్టింది. ఇలా ఒకే సారి ఇద్దరు ప్రముఖ హీరోలతో నటిస్తుండడంతో సంబరాలు చేసుకుంటోంది నటి కాజల్‌అగర్వాల్‌. తెలుగులోనూ తన తొలి దర్శకుడు తేజా దర్శకత్వంలో రానాతో రొమాన్స్‌ చేస్తున్న కాజల్‌ ఇటీవల వివేగం చిత్రం కోసం ఐరోపా దేశాలు చుట్టొచ్చింది. ఆ లొకేషన్స్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి, అక్కడ నటించిన అనుభవాలను పంచుకుంది.

ఒక తెలుగు చిత్రం కోసం హైదరాబాదులో మండే ఎండల్లో నటించి, వివేగం చిత్రం షూటింగ్‌ కోసం ఐరోపా దేశాలకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అక్కడ సూర్యరశ్మినే చూడలేదన్నారు. జిల్‌ అనిపించే మంచు ప్రాంతాల్లో నటించిన అనుభవం మరపురానిదని పేర్కొంది. ముఖ్యంగా సైబీరియా, లోతట్టు మంచు ప్రాంతం అయిన మాసిటోనియా, పోలెండ్‌ వంటి సుందరమైన ప్రాంతాల్లో నటించడం సరికొత్త అనుభూతిని కలిగించిందని పేర్కొంది.

ఉత్తరాదికి చెందిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోని కొన్ని చిత్రాల్లో నటించినా, అక్కడ రాణించలేకపోయింది. ఈ బ్యూటీకి ఆ కొరత వెంటాడుతూనే ఉందట. అలాంటిది మరోసారి బాలీవుడ్‌లో తన లక్కు పరీక్షించుకునే అవకాశం వచ్చిందట. కాజల్‌అగర్వాల్‌ తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించి సక్సెస్‌ను అందుకున్న టెంపర్‌ చిత్రం తాజాగా హిందీలో రీమేక్‌ కానుంది. రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా నటించనున్న ఇందులో నాయకి అవకాశాన్ని కాజల్‌ దక్కించుకుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రం అయినా బాలీవుడ్‌లో కాజల్‌కు లక్‌ అవుతుందా లేక కిక్‌ నిస్తుందా అన్నది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement