సెంటిమెంట్లతో ఒప్పించేసాడట..! | Vivegam Director Ask Nayanthara For Surya Film | Sakshi
Sakshi News home page

దర్శకుడికి సెంటిమెంట్‌గా మారిన నయన్‌

Published Tue, May 14 2019 8:05 AM | Last Updated on Tue, May 14 2019 10:02 AM

Vivegam Director Ask Nayanthara For Surya Film - Sakshi

సెంటిమెంట్‌ అందరికీ ఉంటుంది. సినిమారంగంలో కాస్త ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. సక్సెస్‌తో ఆ సెంటిమెంట్‌ ఇంకా అధికం అవుతుంది. దర్శకుడు శివ అలాంటి సెంటిమెంట్‌ను నమ్ముతున్నారు. ఛాయాగ్రహకుడయిన ఈయన దర్శకుడిగా అవతారమెత్తి సక్సెస్‌ అయ్యారు. కోలీవుడ్‌లో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం చిత్రాలను తెరకెక్కించారు. విశేషం ఏమిటంటే ఈ నాలుగు చిత్రాల్లోనూ హీరో అజితే. తొలి చిత్రం విజయవంతం కావడంతో ఆ కాంబినేషన్‌ వరుసగా నాలుగు చిత్రాల వరకూ కొనసాగింది. ఐదో చిత్రం కూడా చేయబోతున్నారన్న ప్రచారం సాగినా, దానికి కాస్త బ్రేక్‌ పడింది. మధ్యలో యువ దర్శకుడు హెచ్‌.వినోద్‌ అజిత్‌ హీరోగా చిత్రం చేస్తున్నారు. దీంతో దర్శకుడు శివ వేరే నటుడిని చూసుకోవలసిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఆయనకు హీరో దొరికాడు. అవును సూర్య హీరోగా శివ తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఇందులో హీరోయిన్‌ ఎవరన్న చర్చ తెరపైకి వచ్చింది. శివ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటిలోకీ విశ్వాసం పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్ర హీరోయిన్‌ నయనతార దర్శకుడు శివకు సెంటిమెంట్‌గా మారిందట. అంతే సూర్యతో చేసే చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని భావించారని తెలిసింది. అయితే నయనతార కాల్‌షీట్స్‌ అంత ఈజీగా లభించడం కష్టతరమే. అయినా శివ తన సెంటిమెంట్‌ను ఆమెకు వివరించడంతో కాదనలేకపోయిందని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్‌తో దర్భార్, విజయ్‌తో ఆయన 63వ చిత్రంలోనూ నటిస్తున్నానని, ఆ రెండు చిత్రాలు పూర్తి కావడానికి సెప్టెంబరు వరకూ పడుతుంది. ఆపై కావాలంటే కాల్‌షీట్స్‌ సర్దుబాటు చేయగలనని నయనతార చెప్పడంతో అందుకు దర్శకుడు శివ సంతోషంగా సరే అన్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. మొత్తం మీద సెంటిమెంట్‌ అలా వర్కౌట్‌ అయ్యిందన్న మాట. ఇక ఇప్పటికే గజని, ఆదవన్, మాస్‌ చిత్రాల్లో సూర్యతో రొమాన్స్‌ చేసిన నయనతార మరోసారి అందుకు సిద్ధం అవుతోందన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement