అజిత్ ఫోన్ కాల్‌.. హీరో విజయ్ భార్య అలక! | Ajith made a surprise call to Vijay Sethupathi and Jessy disappointed | Sakshi
Sakshi News home page

అజిత్ ఫోన్ కాల్‌.. హీరో విజయ్ భార్య అలక!

Published Fri, Mar 10 2017 12:59 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

అజిత్ ఫోన్ కాల్‌.. హీరో విజయ్ భార్య అలక!

అజిత్ ఫోన్ కాల్‌.. హీరో విజయ్ భార్య అలక!

చెన్నై: వరుస మూవీలతో బిజిబిజీగా ఉన్న తమిళ హీరో విజయ్‌ సేతుపతికి ఓ సర్ ప్రైజ్ కాల్ రావడంతో అతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ ఆయన భార్య జెస్సీ సేతుపతి మాత్రం తెగ ఫీలైపోయారట. అసలు ఏమైందంటే.. 'వివేగమ్'తో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్టార్ హీరో అజిత్ కుమార్ ఆ మూవీ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. గతేడాది నుంచి ఇప్పటివరకూ విడుదలైన కొన్ని మూవీలు (సేతుపతి, కాధలం కదంతు పొగమ్, ఇరైవి, రెక్క, ధర్మదురై అండ్ ఆనందవన్ కట్టలై) చూశాడు. విజయ్ చాలా తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు ఆ కథల ఎంపికపై అజిత్ ఇంప్రెస్ అయిపోయాడు. విజయ్ సేతుపతికి ఫోన్ చేసి అతడి మూవీలను మెచ్చుకున్నాడు. ఇదే తరహాలో విభిన్న మూవీలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని విజయ్ కి సూచించాడు.

ఇంతవరకూ ఒకే కానీ, ఈ క్రమంలో విజయ్ ఇరకాటంలో పడ్డాడు. నటుడు విజయ్ భార్య జెస్సీ సేతుపతి స్టార్ హీరో అజిత్‌కు వీరాభిమాని. వివేగమ్ మూవీ షెడ్యూల్ బ్రేక్ సమయంలో భర్తతో కలసి వెళ్లి అజిత్‌ను కలవాలని జెస్సీ ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త విజయ్ మరిచిపోయాడు. అజిత్ తనకు ఫోన్ చేసి ప్రశంసించాడని చెప్పగానే సంతోషించక పోగా విజయ్ భార్య జెస్సీ కాస్త ఫీలయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అజిత్ ఫోన్ చేస్తే తన గురించి గానీ, తామిద్దరం కలవాలని ప్లాన్ చేసుకున్న విషయాన్ని చెప్పలేదని విజయ్ పై జెస్సీ అలిగారట. ఇటీవల రజనీకాంత్, విజయ్‌కి ఫోన్ చేసి అభినందించగా, తాజాగా అజిత్ కూడా ఫోన్ చేసి ప్రశంసించడంపై కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement