Ajithkumar
-
అజిత్ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !
కోలీవుడ్ విలక్షణ హీరో అజిత్‌కు నటనతో పాటు పలు రంగాల్లో ప్రవేశం ఉన్న విషయం తెలిసిందే. అజిత్‌కు చిన్నతనం నుంచి ఏరో మోడలింగ్‌లో ప్రతిభ ఉంది. ఇటీవలె అజిత్‌ను ‘హెలికాప్టర్ టెస్ట్ పైలట్ అండ్ యూఏవీ సిస్టమ్ సలహాదారుడి’గా మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ నిరాయుధ వైమానిక వాహన ప్రయోగ పోటీల్లో అయన పాల్గొనవచ్చు. దీంతో పాటు అజిత్‌కు ఫోటోగ్రఫీ, కారు రేసింగ్ రంగాల్లో కూడా ప్రావీణ్యం ఉంది. కారు రేసింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్నారు. అయితే రీసెంట్గా అజిత్ షూటింగ్ చేస్తూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే గత కొన్ని నెలల కింద కొయంబత్తుర్లో నిర్వహించిన తమిళనాడు రాష్ట్ర 45వ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అజిత్ పాల్గొన్నాడు. అజిత్ తదుపరి చిత్రం ‘నెర్కొండ పార్వై’ అగస్టు 8న పేక్షకుల ముందుకు రానుంది. -
అతిథులుగా...
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పింక్’. 2016లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనున్నారు. ‘చదురంగవేట్టై’ ఫేమ్ వినోద్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నటి విద్యాబాలన్‌లను అతిథి పాత్రల్లో నటింపజేసేందుకు బోనీకపూర్ చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘పింక్’ సినిమా రీమేక్‌కి కొబ్బరికాయ కొట్టనున్నారు. అమితాబ్, విద్యా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కూసింత ఓపిక పడితే తెలుస్తుంది. అమ్మ విద్యాబాలన్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో 3 సినిమాలు తెరకెక్కనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలితను ఎవరు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేశారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు భారతీ రాజా కూడా ఈ విప్లవ నాయకురాలు పై ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ నటించనున్నార ట. ఈ సినిమా కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట. -
అజిత్ ఫోన్ కాల్.. హీరో విజయ్ భార్య అలక!
చెన్నై: వరుస మూవీలతో బిజిబిజీగా ఉన్న తమిళ హీరో విజయ్ సేతుపతికి ఓ సర్ ప్రైజ్ కాల్ రావడంతో అతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ ఆయన భార్య జెస్సీ సేతుపతి మాత్రం తెగ ఫీలైపోయారట. అసలు ఏమైందంటే.. 'వివేగమ్'తో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్టార్ హీరో అజిత్ కుమార్ ఆ మూవీ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. గతేడాది నుంచి ఇప్పటివరకూ విడుదలైన కొన్ని మూవీలు (సేతుపతి, కాధలం కదంతు పొగమ్, ఇరైవి, రెక్క, ధర్మదురై అండ్ ఆనందవన్ కట్టలై) చూశాడు. విజయ్ చాలా తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు ఆ కథల ఎంపికపై అజిత్ ఇంప్రెస్ అయిపోయాడు. విజయ్ సేతుపతికి ఫోన్ చేసి అతడి మూవీలను మెచ్చుకున్నాడు. ఇదే తరహాలో విభిన్న మూవీలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని విజయ్ కి సూచించాడు. ఇంతవరకూ ఒకే కానీ, ఈ క్రమంలో విజయ్ ఇరకాటంలో పడ్డాడు. నటుడు విజయ్ భార్య జెస్సీ సేతుపతి స్టార్ హీరో అజిత్‌కు వీరాభిమాని. వివేగమ్ మూవీ షెడ్యూల్ బ్రేక్ సమయంలో భర్తతో కలసి వెళ్లి అజిత్‌ను కలవాలని జెస్సీ ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త విజయ్ మరిచిపోయాడు. అజిత్ తనకు ఫోన్ చేసి ప్రశంసించాడని చెప్పగానే సంతోషించక పోగా విజయ్ భార్య జెస్సీ కాస్త ఫీలయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అజిత్ ఫోన్ చేస్తే తన గురించి గానీ, తామిద్దరం కలవాలని ప్లాన్ చేసుకున్న విషయాన్ని చెప్పలేదని విజయ్ పై జెస్సీ అలిగారట. ఇటీవల రజనీకాంత్, విజయ్‌కి ఫోన్ చేసి అభినందించగా, తాజాగా అజిత్ కూడా ఫోన్ చేసి ప్రశంసించడంపై కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. -
సినిమా రివ్యూ: వీరుడొక్కడే
తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరం' చిత్రం 'వీరుడొక్కడే'గా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్యాయం, చెడు, ఫ్యాక్షన్‌ను ఎదిరించి...మంచి కోసం ఎంతవరకైనా తెగించే మనస్తత్వం కల వ్యక్తి వీరేంద్ర(అజిత్). తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నలుగురు సోదరుల కోసం వీరేంద్ర పెళ్లికి దూరంగా ఉంటాడు. అన్యాయం, అక్రమాలను పాల్పడే వీరభద్రం (ప్రదీప్ రావత్) దుశ్చర్యల నుంచి ప్రజల్ని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో తన సహచరులతో ఆ గ్రామంలోకి ప్రవేశించిన గోమతి దేవి (తమన్నా) అనే అర్కిటెక్ట్.. వీరేంద్ర ప్రేమలో పడేలా నలుగురు సోదరులు ప్లాన్ చేస్తారు. వీరేంద్ర మంచితనాన్ని చూసి గోమతి ప్రేమలో పడుతుంది. గోమతి ప్రేమ కోసం ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని వీరేంద్ర నిర్ణయం తీసుకుంటాడు. తమ గ్రామంలో నాగరాజు (అతుల్ కులకర్ణి) గ్రూప్‌తో జరిగిన సంఘటన ప్రభావంతో హింస, గొడవలు, కొట్లాట, ఫ్యాక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని గోమతి కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. వీరేంద్రను పెళ్లి చేసుకుందామనుకునుకున్న తరుణంలో గోమతిపై నాగరాజు గ్రూప్ ఎటాక్ చేస్తుంది. నాగరాజు గ్రూపును వీరేంద్ర ఎదుర్కొని.. గోమతిని ఆ దాడి నుంచి రక్షిస్తాడు.. అయితే ఆ సంఘటనలో వీరేంద్ర అసలు రూపాన్ని గోమతి చూస్తుంది. తనకు ఇష్టం లేని వ్యవహారాలే వీరేంద్ర జీవితంలో ప్రధానమైనవని తెలుసుకున్న గోమతి షాక్ అవుతుంది. వీరేంద్ర అసలు జీవితం తెలుసుకున్న తర్వాత గోమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గోమతిపై ఎటాక్ ఎందుకు జరిగింది. నాగరాజు అసలు గోమతి కుటుంబంపై ఎందుకు పగ పెంచుకుంటాడు? నాగరాజు, వీరభద్రం గ్రూప్‌ల ఆటకట్టించి.. గోమతిని, తన కుటుంబాన్ని వీరేంద్ర ఎలా రక్షించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ’వీరుడొక్కడు’. మాస్, యాక్షన్ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్న వీరేంద్ర పాత్రలో అజిత్ కనిపించారు. ప్రేమ కోసం హింస, ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పిన వ్యక్తిగా, ప్రేయసి కోసం, ప్రేమను పంచిన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లే మరో షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను అజిత్ అవలీలగా పోషించాడు. అయితే గతంలో చాలా చిత్రాల్లోఇలాంటి పాత్రల్లో కనిపించిన అజిత్.. మరోసారి రొటీన్‌గానే అనిపించాడు. అర్కిటెక్ట్‌గా గోమతి పాత్రలో ఓ సంప్రదాయ యువతిగా తమన్నా కనిపించింది. ఈ చిత్రంలో గోమతి పాత్ర ప్రధానమైనప్పటికి... సహజంగా ప్రేక్షకులు ఆశించే గ్లామర్ మిస్ కావడం నిరాశ కలిగించే అంశం. గోమతి పాత్ర కారెక్టరైజేషన్ పర్ ఫెక్ట్‌గా లేకపోవడం కొంత మైనస్. అంతేకాకుండా గోమతి పాత్ర కృత్రిమంగా కనిపిస్తుంది. విలన్లు ప్రదీప్ రావత్, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినా.. చిత్రంలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపేలా విలనిజం లేకపోవడం ప్రధాన లోపమని చెప్పవచ్చు. తమన్నా తండ్రిగా నాజర్ పర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో బాగా నచ్చే అంశం లాయర్ పాత్రలో సంతానం పండించిన కామెడీ. సంతానం కామెడి ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గొప్పగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెట్రీ ఫోటోగ్రఫి చిత్రానికి అదనపు ఆకర్షణ. యాక్షన్ సీన్ల చిత్రీకరణ రిచ్‌గా ఉంది. భూపతి రాజా, శివ అందించిన కథలో కొత్తదనం లేకపోయింది. సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.