అజిత్‌ దర్శకుడితో సూర్య | Suriya Work With Director Shiva | Sakshi
Sakshi News home page

అజిత్‌ దర్శకుడితో సూర్య

Published Sun, Apr 14 2019 10:29 AM | Last Updated on Sun, Apr 14 2019 10:29 AM

Suriya Work With Director Shiva - Sakshi

నటుడు అజిత్‌ దర్శకుడితో సూర్య చిత్రం చేయబోతున్నారా? ఇందుకు అవుననే సమాధానం వస్తోంది కోలీవుడ్‌ నుంచి. నటుడు అజిత్‌ హీరోగా వరుసగా నాలుగు చిత్రాలు చేసిన దర్శకుడు శివ. వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం చిత్రాలన్నీ విజయం సాధించాయి. మరో చిత్రాన్ని శివ దర్శకత్వంలో నటించడానికి అజిత్‌ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా శివ... సూర్యతో చిత్రం చేయబోతున్నారనే టాక్‌ సడన్‌గా వైరల్‌ అవుతోంది.

సూర్య నటించిన ఎన్‌జీకే చిత్రం మే 31వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ తరువాత కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటిస్తున్న కాప్పాన్‌ తెరపైకి రానుంది. ప్రస్తుతం సూర్య మహిళా దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయనకు 38వ చిత్రం. దీని తరువాత సూర్య నటించే 39వ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement