‘విశ్వాసం’ తెలుగులో వస్తోంది..! | Ajith Viswasam May Release In Telugu On 1st February | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 4:36 PM | Last Updated on Sat, Jan 19 2019 4:36 PM

Ajith Viswasam May Release In Telugu On 1st February - Sakshi

తమిళనాట సంక్రాంతి బరిలోకి దిగిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేట, అజిత్‌ విశ్వాసం రెండూ వసూళ్ల సునామీని సృష్టించాయి. బాక్సాఫీస్‌ వద్ద ఈ రెండూ రికార్డులు క్రియేట్‌చేస్తుంటే.. బయట ఫ్యాన్స్‌ మధ్యలో కలెక్షన్ల వార్‌ నడుస్తోంది. ఈ రెండింట్లో ‘పేట’ తెలుగులో రిలీజై ఓ మోస్తరుగా నడుస్తోంది. 

అయితే అజిత్‌ విశ్వాసం కూడా తెలుగులో డబ్‌ అయ్యేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ చిత్రం తెలుగులో రిలీజ్‌కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. జగపతి బాబు ప్రతినాయకుడిగా, నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. మరి ఇక్కడి ప్రేక్షకులు ఈ మూవీకి ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement