డై హార్డ్‌ ఫ్యాన్‌.. వెండితెరపై ‘సాఫ్ట్‌వేర్‌’ కుర్రాడు | Siva Alapati Film Debut As Hero With Die Hard Fan | Sakshi
Sakshi News home page

Die Hard Fan: డై హార్డ్‌ ఫ్యాన్‌.. వెండితెరపై ‘సాఫ్ట్‌వేర్‌’ కుర్రాడు

Published Mon, Sep 5 2022 1:56 PM | Last Updated on Mon, Sep 5 2022 2:06 PM

Siva Alapati Film Debut As Hero With Die Hard Fan - Sakshi

మధురవాడ (భీమిలి):  ఆ యువకుడికి సినిమాలంటే పిచ్చి..ఎలాగైనా సరే తెరపై కనిపించాలని కలలుగన్నాడు. చిన్నతనం నుంచీ ఇదే ధ్యాస. వయసు పెరిగే కొద్దీ లక్ష్యం మరింత బలపడింది. చిన్నచిన్న పాత్రలతో ఆకట్టుకున్నాడు. కట్‌ చేస్తే డై హార్డ్‌ ఫ్యాన్‌ సినిమాతో హీరో అయ్యాడు. మంచి టాక్‌ తెచ్చుకోవడంతో ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనుకుంటున్నారా? విశాఖకు చెందిన శివ రామకృష్ణ ఆలపాటి. సింపుల్‌గా శివ అలపాటి.
చదవండి: రెండోపెళ్లిపై చర్చకు దారితీసిన రేణు దేశాయ్‌ కామెంట్స్‌

శివది స్వస్థలం పీఎంపాలెం కాగా.. విశాఖ కిర్లంపూడి లే అవుట్‌లో నివాసం ఉంటున్నాడు. శివ హీరోగా  ‘డై హార్డ్‌ ఫ్యాన్‌’ చిత్రంలో నటించారు. ఈ నెల 2న చిత్రం హైదరాబాద్‌లో విడుదలైంది. త్వరలోనే ఏపీ అంతటా విడుదల చేయనున్నారు. సినిమా యూత్‌ను మెప్పించింది. దీంతో తన ఆశలకు ఈ చిత్రం జీవం పోసినట్టుందని శివ పేర్కొన్నాడు. శివ సరసన ప్రియాంక్‌ శర్మ హీరోయిన్‌ నటించగా, షకలక శంకర్, రాజీవ్‌ కనకాల, నోయల్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అభిరామ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్‌కి, అభిమానికి మధ్య జరిగిన సస్పెన్స్‌ కామెడీ డ్రామానే ఈ సినిమా కథ.

సినిమా అంటే ప్రాణం 
మొదటి నుంచీ సినిమాలన్నా..నటనన్నా చాలా ఇష్టం. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు సినిమా రంగంవైపు అడుగులేశా..సాఫ్ట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ మరోవైపు వెండితెరపై నటిస్తున్నా..సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఐదేళ్లు హైదరాబాదు, పూనేలో పనిచేశా.. గతంలో చిన్న చిన్న చిన్న క్యారక్టర్లు వచ్చేవి. వీటిలో ‘నేనే లేని నా ప్రేమ కథ , రన్‌ వెబ్‌ సిరీస్‌లో మేజర్‌ రోల్‌ చేశాను. తర్వాత 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఆడిషన్స్‌ హీరో రోల్‌కి అవకాశం వచ్చింది. ఉద్యోగం, నటన రెండూ సాధ్యం కాదు కనుక ఉద్యోగం మానేశా. వారం రోజుల్లో విశాఖ థియేటర్లలో డై హార్డ్‌ ఫ్యాన్‌ చిత్రాన్ని విడుదల చేస్తాం.
– శివ, హీరో   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement