ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో మూఢనమ్మకాలకు సంబంధించిన ఉదంతమొకటి సంచలనంగా మారింది. మహాశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆలయంలో ఒక యువకుడు వృక్షాలను కట్ చేసే యంత్రంతో తన గొంతు కోసుకున్నాడు. సమాచారం తెలియగానే అతని కుటుంబ సభ్యులు పరుగుపరుగున ఆలయానికి చేరుకుని, బాధితుడిని చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధిత యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఈ ఘటన రఘునాథ్‌పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన పల్టూ రామ్ కుమారుడు దీపక్ కుశ్వాహ్(30) కూలీనాలీ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దీపక్ తండ్రి పల్టూరామ్ తెలిపిన వివరాల ప్రకారం దీపక్‌కు ఇద్దరు పిల్లలు. దీపక్ మహాశివుని భక్తుడు. గత కొంతకాలంగా దీపక్ ఉదయం, రాత్రివేళల్లో మహాశివునికి పూజలు చేస్తుంటాడు. ఇటీవల దీపక్ తాను మెడ కోసుకుని మహాశివుని ప్రసన్నం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాడు.
ఈ విషయం తెలుసుకున్న పల్టూ రామ్ తన కుమారుతో అటువంటి పని చేయవద్దని చెప్పాడు. అయితే కుమారుడు అతని మాట వినలేదు. కాగా దీపక్ ఒక నోట్‌బుక్‌లో మహాశివుని మంత్రాలను, శివునితో సాగించిన సంభాషణను రాస్తుంటాడు. దానిలో దీపక్ మహాశివునికి తనను తాను అర్పించుకుంటానని రాశాడు. దానిలో పేర్కొన్న విధంగా ఉదయం 4 గంటలకు ఆలయానికి వెళ్లాడు. అక్కడ చెట్లు కట్ చేసే యంత్రంతో మహాశివుని సమక్షంలో తన మెడను కట్ చేసుకుని జయజయధ్వానాలు చేశాడు.
దీనిని అక్కడున్నవారు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు వెంటనే ఆలయానికి చేరుకుని భాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీపక్ చిన్నాన్న ప్రసాద్ మాట్లాడుతూ దీపక్ మెడ కట్ చేసుకున్న సమయంలో ‘జై భగవాన్ శంకర్’ అనే నినాదాలు చేశాడని తెలిపారు.
బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ సచిన్ మాహుర్ మాట్లాడుతూ దీపక్ అనే యువకుడు స్వయంగా తన మెడ కోసుకున్నాడని, అతనికి వైద్య చికిత్స జరుగుతున్నదని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు.
ఇది కూడా చదవండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు..
Comments
Please login to add a commentAdd a comment