శివయ్య .. గంగను విడువయ్యా!
గుమ్మఘట్ట (రాయదుర్గం) : వర్షాలు సంవృద్ధిగా కురిపించి, కష్టాల నుంచి గట్టెంక్కించు శివయ్యా అంటూ గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామస్తులు వేడుకున్నారు. ఆదివారం వేద మంత్రోచ్ఛారణల మధ్య శివాలయంలో మహా కుంబాభిషేకం నిర్వహించారు. గర్భ ఆలయంలో శివుడి విగ్రహాన్ని పూర్తి నీటిలో మునిగేలా రెండు ట్యాంకర్ల నీరు పట్టారు. 12 గంటల పాటు శివలింగం పూర్తి నీటిలోనే ఉంచి శివనామ స్వరాన్ని మార్మోగించారు.
రాత్రంతా అఖండ భజన చేపట్టనున్నట్టు ఆలయ కమిటీ సభ్యుడు సత్యనారాయణస్వామి, అర్చకుడు ఈరణ్ణ స్వామి తెలిపారు. సోమవారం ఉదయం స్వామికి రుద్రాభిషేకం, పూర్ణాభిషేకం, కుంకుమార్చన తదితర పూజ కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం అన్నదానం చేపడతామన్నారు.