విశ్వనాథుడు కొలువైన కాశీ నగరం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశ విదేశాల నుంచి మహాశివుని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇదే కోవలో నిజమైన ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీకి వచ్చిన ఒక రష్యన్ మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించి, ఇంగా నుండి ఇంగానందమయిగా మారారు.
వారణాసిలోని శివలా ఘాట్ సమీపంలోని వాగ్యోగ పీఠం వద్ద ఇంగానందమయి ఈ దీక్ష తీసుకున్నారు. ఇంగా రష్యాలోని మాస్కో నివాసి. ఈ దీక్షకు ముందు ఆమె భారతీయుల తరహాలో వస్త్రధారణ చేశారు. పూజలో కూర్చొని, సనాతన ధర్మ ప్రక్రియను అనుసరించి, హిందూ మతాన్ని స్వీకరించారు. పండితులు ఆశాపతి త్రిపాఠి నుండి ఇంగా దీక్షను స్వీకరించారు.
అనంతరం ఆమె మహాశివునికి రుద్రాభిషేకం చేశారు. పండితులు ఆశాపతి త్రిపాఠి తనకు జీవితంలో ప్రశాంతతను అందించారని ఇంగా తెలిపారు. తాను ఇప్పటికే తాంత్రిక దీక్షను స్వీకరించానని, అయితే తనలోని అశాంతిని తొలగించుకునేందుకు సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ఇంగా తెలిపారు. శివునికి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం శాంతించాలని ప్రార్థించానని ఇంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment