సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. ఇక, నిన్న తిరుమల శ్రీవారిని 54,105 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
కాగా, రిపబ్లిక్ డే, నెలలో నాలుగో శనివారం, ఆదివారం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక, గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. నిన్న ఒక్కరోజు 54,105 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 23,590 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దీంతో, నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.44 కోట్లుగా ఉంది.
ఇక, నేడు ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు, టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డీ దర్శనానికి 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అటు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
#తిరుమల
— kshetradarshan (@kshetradarshan) January 25, 2024
పౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు#Tirumala
On the eve of Paurnami, Sri Malayappa Swamy blessed devotees from Garuda Vahanam pic.twitter.com/Nk6CboAhWA
Comments
Please login to add a commentAdd a comment