breaking news
lord venkateshwara
-
శ్రీ మహావిష్ణు విగ్రహామే.. బెదిరిస్తే భయపడేటోన్ని కాదు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని.. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. అలిపిరి వద్ద స్వామివారి విగ్రహానికి అపచారం జరిగిన పరిణామంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగింది. అది చెబితే నాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఆది శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అని అంటున్నారు. శిల్పి చెక్కి పడేశాడని నిరక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుంది?. శని విగ్రహానికి విల్లు, బాణం ఉంటుంది. కాబట్టి.. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఏడాదిన్నర కాలంగా మీరు ఏమి చేస్తున్నారు?. వైఖానస ఆగమ సత్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే దైవానుగ్రహంతో బోర్డు సభ్యులయ్యాం అని మీరు చెప్పుకుంటున్నారు. అదే స్వామివారి అనుగ్రహంతో రెండుసార్లు చైర్మన్, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యాను నేను. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినా వాస్తవాలే చెబుతుంటాను నేను. హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని. కాబట్టి నాపై ఎన్నిసార్లు.. ఎంత దుష్ప్రచారం చేసినా ఎవ్వరు నమ్మరు. రాజకీయాలు కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం. నేను నాయకుడ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును అని భూమన ఉద్ఘాటించారు. -
దేవదేవుడి మీదే కుట్రలు చేసిన నీచుడిగా చరిత్రకెక్కిన చంబాసురుడు
-
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. ఇక, నిన్న తిరుమల శ్రీవారిని 54,105 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాగా, రిపబ్లిక్ డే, నెలలో నాలుగో శనివారం, ఆదివారం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక, గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. నిన్న ఒక్కరోజు 54,105 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 23,590 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దీంతో, నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.44 కోట్లుగా ఉంది. ఇక, నేడు ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు, టైమ్ స్లాట్ ఎస్ఎస్డీ దర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అటు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. #తిరుమల పౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు#Tirumala On the eve of Paurnami, Sri Malayappa Swamy blessed devotees from Garuda Vahanam pic.twitter.com/Nk6CboAhWA — kshetradarshan (@kshetradarshan) January 25, 2024 -
వెంకటేశ్వర వైభవం
-
కన్నుల పండుగగా పుష్పయాగం కన్నుల పండుగగా పుష్పయాగం
-
శ్రీవారికి కానుకగా బంగారు శఠారి
సాక్షి, తిరుమల : కలియుగ వైకుంఠదైవం వెంకేటేశ్వరస్వామికి ఓ భక్తులు బంగారు శఠారి బహుమతిగా అందించారు. చెన్నైకి చెందిన భాష్యం కన్స్ట్రక్షన్స్ సంస్థ తరపున టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు. ఈ మేరకు ఈ కానుకను శ్రీవారి ఆలయంలో టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా పాల్గొన్నారు. శ్రీవారి ఉత్సవాల ఊరేగింపు సందర్భంలో ఈ శఠారిని వినియోగించనున్నారు. -
రిషికేష్‌లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి: తితిదేకి అనుబంధంగా ఉన్న రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మే 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. మే 18వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, రాత్రి 7.00 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. -
శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ.1.కోటి విరాళం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు ఆర్కే ఆనంద్ రూ.1 కోటి విరాళం ఇచ్చారు. మంగళవారం ఇక్కడి దాతల విభాగంలో 1 లక్షా 60 వేల యూఎస్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని టీటీడీ నిత్యాన్నప్రసాద ట్రస్టుకోసం వినియోగించాలని దాత కోరారు. అలాగే మరో ఇద్దరు భక్తులు రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు.